ఆన్ లైన్లో వస్తువులు కొనేటప్పుడు దాని మంచీచెడు తెలుసుకోవాలంటే రివ్యూలపై ఆధారపడతాం. కానీ, ఆ రివ్యూలు కూడా ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తుంటాయి. కొన్ని విక్రయ సంస్థలు తమకు అనకూలంంగా రాయించుకునే రివ్యూలు ఉంటాయి. వస్తువు నిజంగా మంచిది కాకపోయినా ఇలాంటి రివ్యూలను చదివి మంచిదని నమ్మి మోసపోతుంటాం. అలాగే.. ఒక్కోసారి పని గట్టుకుని కొందరు వ్యతిరేకంగా రాసే రివ్యూల వల్ల కూడా బాగుండదేమో అన్నఅభిప్రాయానికి వచ్చి మంచి మంచి వస్తువులను మిస్సయిపోతుంటాం.
ఫేక్ స్పాట్.కామ్
అమెజాన్ వంటి ప్రముఖ ఈకామర్స్ సైట్లో ఉండే రివ్యూల్లో నకిలీ రివ్యూలను పసిగట్టేందుకు ఒక మార్గం ఉంది. రివ్యూలు నిజమైనవా.. లేదంటే ఫేక్ రివ్యూలా అన్నది తెలసుకోవాలంటే http://fakespot.com/ వెబ్ సైట్ సహాయం చేస్తుంది.
20 వేల ప్రొడక్టులపై సజెషన్స్
ఈ ఫేక్ స్పాట్ ఇప్పటివరకు సుమారు 20 కోట్ల వస్తువులకు సంబంధించిన 55 కోట్ల రివ్యూలను విశ్లేషించింది.
ఏం చేయాలి..
అమెజాన్ లో మనం కొనాలనుకునే వస్తువుపై క్లిక్ చేయాలి. దాని యూఆరెల్ ను కాపీ చేసి ఫేక్ స్పాట్.కామ్ లో పేస్ట్ చేయాలి. ఒక నిమిషంలో అది అన్ని రివ్యూలను విశ్లేషించి యావరేజి రేటింగ్ చూపిస్తుంది. అంతేకాదు, ఫేక్ రివ్యూలుంటే చెప్తుంది. ఆ ప్రొడక్టుకు గ్రేడ్ ఇస్తుంది. దాని ఆధారంగా మనం కొనాలో లేదో నిర్ణయించుకోవచ్చు.