• తాజా వార్తలు

ఉగాది డిస్కౌంట్లకు తెరలేపిన ఈ కామర్స్‌ సైట్లు..

నిజానికి కొంత కాలం క్రితం వరకూ పండుగలు వస్తున్నాయంటే బట్టలు, ఫోన్‌లు, టీవీటు, తదిదల ఎలక్ట్రానిక్‌ పరికరాలకు వాటిని అమ్మే షాపులు అనేక రకాల డిస్కౌంటు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకునేవి. వాటికి తగ్గట్టుగానే అమ్మకాలు జరుగుతూ ఉండేవి. కానీ నేడు అలాకాదు. ఈ కామర్స్‌ సైట్స్‌ల విప్లవం మొదలయ్యాక కాలు కిందికి కదపకుండా ఇంట్లోనే కూర్చోని తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీనితో షాపుల ఆఫర్లు కాస్తా ఈ కామర్స్‌ సైట్లు అందిపుచ్చుకుని వినియోగదారులను తమ వైపుకు తిప్పుకున్నాయి. ఉగాదికి చాలామంది తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. దీనిని క్యాష్‌ చేసుకోవడానికి ప్లిప్‌కార్ట్‌, ఆమెజాన్‌, ఈబే, పేటీ ఏం వంటి దిగ్గజ ఈ కామర్స్‌ సైట్లు భారీ డిస్కౌంట్లకు తెరలేపాయి. నేటి నుంచి మూడు రోజుల(7,8,9 తేదీలు) పాటు ఎలక్ట్రానిక్‌ వస్తువుల మీద ఏకంగా 50శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నాయి. షాపులో ఎలాగు అధిక ధరలు ఉంటాయి... అదే అన్‌లైన్‌లో అయితే తక్కువ ధరతో పాటు అదనంగా డిస్కౌంట్‌ కూడా వస్తుండటంతో వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేయడం పరిపాటిగా మారుతోంది. దీనికి కారణం అన్‌లైన్‌లో వస్తువులు ఉత్పత్తి దారుని నుండి ఈ కామర్స్‌ సైట్ల మధ్య వర్థిత్వంతో వినియోగదారునికి వస్తువులు చేరుతాయి. సాధారణ పన్నులతో పాటు రాష్ట్రాల పన్నులు కూడా తగ్గడంతో పాటు అనేక రకాల ఇతర ఖర్చులు కూడా తగ్గడంతో దానిని వినియోగదారునికి మళ్లించి తక్కువ ధరకు ఈ కామర్స్‌ సైట్లు అందిస్తున్నాయి. మొబైల్‌ ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌ టాప్‌ వంటి ఎలాక్ట్రానిక్‌ వస్తువులను చాలా కంపెనీలు మార్కెట్‌లో కంటే ఈ కామర్స్‌ సైట్ల ద్వారానే తమ వస్తువుల అమ్మకాల్ని సాగిస్తున్నాయి. దీనికి తోడు క్యాష్‌ అన్‌ డెలివరి, ఈఎంఐ సదుపాయం, నచ్చకపోతే సులభంగా రిటర్న్‌ సదుపాయం ఉండటంతో వినియోగదారుడు కూడా ఎక్కువగా ఈ కామర్స్‌ సైట్ల మీదనే మక్కువ చూపుతున్నాడు. డిస్కౌంటు ఇస్తున్నారు కదా అని తెలియని సైట్‌లో కోనుగోలు చేసేముందు ఆచితూచి వ్యవహరించమని కూడా నిపుణులు చెబుతున్నారు. భారీ డిస్కౌంట్‌ల పేరుతో ఆశపెట్టి నాశిరకం వస్తువులను వినియోదారులకు అంటగడుతున్నాయి. ఎక్కువ ధర కలిగిన వస్తువులు కొనుగోలు చేసేవారు బాగా తెలిసిన నమ్మకం కలిగిన ఈ కామర్స్‌ సైట్లలో కొనుగోలు చేస్తే మంచిది.

 

జన రంజకమైన వార్తలు