పెళ్లి కాని యువతీ యువకులకు రూమ్ బుక్ చేసుకునే అవకాశo ప్రయోగాత్మకం గా లాంచ్ చేసిన ఓయో రూమ్స్ పెద్ద సంఖ్య లో ఉన్న యువతీ యువకులను ఆకర్షిచడానికి ప్రముఖ హోటల్ రూమ్ బుకింగ్ యాప్ మరియు సంస్థ అయిన ఓయో సరికొత్త ప్రణాళిక లను సిద్దం చేసింది. ఈ కంపెనీ కి సంబందించిన హోటల్ లలో ఇక పై పెళ్లి కాని జంటలకు కూడా రూమ్ లు బోకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నారు. రెండు నెలల క్రితం దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టారు. తమ వద్ద రూమ్ లు బుక్ చేసుకుంటున్న జంటల యొక్క ఐడెంటిటీ వివరాలను వారి మధ్య ఉండే సంబంధాన్ని తమ వెబ్ సైట్ లోనూ, యాప్ లోనూ నమోదు చేసుకుంటున్నారు. ఒక్కసారి ఈ యాప్ లో కానీ వెబ్ సైట్ లో కానీ ఒక జంట యొక్క వివరాలు నమోదు అయితే ఇక ఆ తర్వాత మోసం జరగడానికి అవకాశం ఉండదు అని వీరి అభిప్రాయం. ఇది 200 నగరాల లోని మొత్తం 70,000 ల రూమ్ లను ఆఫర్ చేస్తుంది. తన మొత్తం పెట్టుబడిలో 60 శాతం కేవలం దీనికోసమే వెచ్చిస్తుంది. ప్రస్తుతానికి ఈ కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్ దేశం లోని 100 నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే దాదాపు అన్ని మెట్రో పోలిటన్ నగరాల లోనూ మరియు టాప్ విహార యాత్రా ప్రదేశాల లోనూ వీటిని అందుబాటులో ఉంచారు. “మాకు వస్తున్న కస్టమర్ లలో అత్యధిక శాతం మంది 18-30 సంవత్సరాల వయసు కల వారే. వారికి అత్యుత్తమ సేవలు అందించడం మా బాధ్యత. మేము కేవలం ఒక వర్గం వారికి మాత్రమే ఇలా చేయడం లేదు అలా అని ఇదేమీ మార్కెటింగ్ జిమ్మిక్ కాదు. మాకు కావలసింది కస్టమర్ యొక్క సంతృప్తి. మా వ్యాపార అభివృద్ది. వినియోగదారునికి ఒక మంచి వసతి అనుభవాన్ని అందించడం. ఈ యాప్ లాంచ్ ద్వారా ఒక్కసారి మా దగ్గర కు వచ్చిన జంటలు మరొక సారి ఓయో రూమ్ లు బుక్ చేసుకోవలంటే ఇక ఏ ఇబ్బంది ఉండదు. ఈ యాప్ లో చుస్తే వారి ఐడెంటిటీ తెలిసిపోతుంది కాబట్టి సులువుగా చెక్ ఇన్ అవ్వవచ్చు. అయినా అవివాహిత జంటలకు , స్థానికులకు అంటే అదే నగరానికి చెందిన వారికి రూమ్ లు ఇవ్వకూడదు అని మన దేశం లో చట్టం ఏమీ లేదు కదా! కాకపోతే రిస్క్ ఎందుకని కొన్ని హోటల్ లో అలా చేయవు కానీ వినియోగదారునికి ఆఖరి నిమిషం లో ఇబ్బంది కలుగకూడదు అనే ఉద్దేశ్యంతో మేము ఈ యాప్ ను ప్రవేశపెడుతున్నాము" అని ఓయో రూమ్స్ యొక్క చీఫ్ గ్రోత్ ఆఫీసర్ అయిన కవికృత్ చెప్పారు. |