• తాజా వార్తలు

టాప్ టెన్ షాపింగ్ యాప్స్ ఇవీ

ఆ పది యాప్ లతో అరచేతిలో షాపింగ్..
ఆన్ లైన్ షాపింగ్ మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుంది. యువతే కాదు, వృద్ధులు, గృహిణులు కూడా ఇప్పుడు ఆన్ లైన్ షాపింగుకే ప్రాధాన్యమిస్తున్నారు. బయటికెళ్లి షాపింగ్ చేసేదానిక్నా ఇంట్లోనే కంప్యూటర్ ముందో... చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే అయిదు నిమిషాల్లో షాపింగ్ పూర్తి చేసుకుంటే ఎంతో సమయం ఆదా అన్న సంగతి అందరూ గుర్తిస్తున్నారు. టైం సేవింగ్, తక్కువ ధరలు, మొహమాటానికి కొనాల్సిన అవసరం లేకపోవడం వంటి కారణాలతో దేశంలో ఈ కామర్స్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.  ఈ క్రమంలో 2015లో స్మార్ట్ పోన్ యాప్స్ ద్వారా రీటెయిల్ రంగంలో దూసుకుపోతున్న సంస్థల జాబితా ఇది. స్మార్ట్ కామర్స్ లో ఫ్లిప్ కార్ట్ అందరి కంటే ముందుండగా ఇటీవల కాలంలో స్పీడందుకున్న పేటీఎం రెండోస్తానానికి చేరుకుంది. గతంలో మంచి పొజిషన్లో ఉన్న జబాంగ్ వంటివి యాప్ షాపింగ్ లోకి రావడం కాస్త ఆలస్యమయ్యేసరికి మింత్ర కంటే వెనుకబడిపోయాయి.

టాప్ టెన్ షాపింగ్ యాప్స్ ఇవీ..

 

 

1. ఫ్లిప్‌కార్ట్ :
బెంగుళూరులో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. 2007లో ప్రారంభమైంది. 33వేల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. సంవత్సరాదాయం దాదాపు 100 కోట్ల డాలర్లు. 2015లో ఈ కంపెనీ రిటెయిల్ యాప్ అగ్రస్థానంలో దూసుకుపోతోంది.

 

2. పేటీఎం :
నోయిడా కేంద్రంగా పనిచేస్తోంది. 2010లో ప్రారంభమైంది. 2014లో ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ప్లాట్‌ఫాంలపై కలిపి మొత్తం దాదాపుగా 2.50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2015లో టాప్ రిటెయిల్ యాప్స్‌లో ఇది 2వ స్థానంలో ఉంది.

 

3. అమెజాన్ :
అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీ రిటెయిల్ యాప్‌కు భారత్‌లో 2015లో 3వ స్థానం లభించింది. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంది. సంవత్సరాదాయం దాదాపు 8800 కోట్ల డాలర్లు. 2.22 లక్షల మంది ఉద్యోగులు ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్నారు.

 

4. స్నాప్‌డీల్:
స్నాప్‌డీల్ రిటెయిల్ యాప్‌కు ఈ ఏడాది 4వ స్థానం దక్కింది. 2010లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 5వేల మందికి పైగా ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. సంవత్సరాదాయం దాదాపు 300 మిలియన్ యూఎస్ డాలర్లు.

  5. మింత్రా:
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా రిటెయిల్ యాప్ ఈ ఏడాది 5వ స్థానంలో నిలిచింది. ఫ్యాషన్ రంగానికి చెందిన ఉత్పత్తులను వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అమ్మడంలో ఈ కంపెనీ పేరుగాంచింది. ఈ సంస్థ కేవలం మొబైల్ యాప్ ద్వారానే అధిక శాతం అమ్మకాలను చేపడుతోంది.
 

6. జబాంగ్ :
జబాంగ్ రీటెయిల్ యాప్ ఈ ఏడాది ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ కి సంబంధించిన ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా అమ్ముతోంది. ప్రధాన కార్యాలయం గుర్ గావ్ లో ఉంది.

  7. షాప్‌క్లూస్:
ఇది 7వ స్థానంలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం గుర్ గావ్ లోనే ఉంది. 2011లో సిలికాన్ వ్యాలీ లో స్థాపించారు.
8. వూనిక్ :
వూనిక్ కంపెనీ కూడా రీటెయిల్ రంగంలో దూసుకుపోతోంది. గత ఏడాది పెద్దగా పాపులర్ కాని ఈ యాప్ ఈసారి 8వ స్థానంలోనిలిచింది.
  9. లైమ్‌రోడ్ :
లైమ్‌రోడ్ అనేది కేవలం స్త్రీలకు సంబంధించిన ఉత్పత్తులు విక్రయించే యాప్. ప్రధాన కార్యాలయం గుర్ గావ్ లో ఉంది.
  10. యెప్‌మీ:
యెప్‌మీ అనేది రెండేళ్లుగా పాపులర్ అయిన దుస్తులు, షూస్, ఫ్యాషన్ గాడ్జెట్స్ విక్రయించే సైట్. షూస్ ను తక్కువ ధరకే అందిస్తున్న సైట్ గా మొదలై క్రమంగా మార్కెట్ ను కమ్మేసింది.

జన రంజకమైన వార్తలు