ఆధార్ కార్డు ఇప్పుడు ఇండియాలో చాలా పనులకు అత్యవసరం. అయితే అన్ని చోట్లకు ఆధార్ కార్డు పట్టుకెళ్లే అవసరం లేకుండా మొబైల్ యాప్ రూపంలోనూ అందుబాటులోకి తెచ్చారు. అదే ఎం-ఆధార్ యాప్. అయితే ఇప్పటికే మీ మొబైల్స్‌లో ఉన్న ఎం-ఆధార్ యాప్‌ను డిలీట్ చేసి కొత్తగా మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోమని ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ ఇటీవల ప్రకటించింది. ఎందుకు ఇలా చెబుతోందో, కొత్త యాప్‌లో ఏం ఫీచర్లున్నాయో చూద్దాం.
రెండు సెక్షన్లతో వచ్చింది
కొత్త ఎం-ఆధార్ యాప్‌లో ఇంటర్‌ఫేస్ రెండు సెక్షన్లుగా ఉంటుంది. ఇందులో మొదటి సెక్షన్ నాలుగు అంకెల పిన్ నెంబర్‌తో ఉంటుంది. ఈ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ బయోమెట్రిక్ అథంటికేషన్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయగలుగుతాం. ఈ-కేవైసీ ఆఫ్‌లైన్‌లో షేర్ చేయాలన్నా, ఓటీపీ జనరేట్ చేయాలన్నా ఈ సెక్షన్‌లోనే ఉంటాయి.
ఇక రెండోది సర్వీస్ సెక్షన్.
ఆధార్ డౌన్‌లోడ్ చేయడం , అడ్రస్ అప్‌డేట్ చేయడం, క్యూఆర్ కోడ్‌ను చూపించడం, దాన్ని స్కాన్ చేయడం, ఆధార్ రీప్రింట్ చేయడం, ఈమెయిల్, ఫోన్ నెంబర్ వెరిఫై చేయడం వంటి సర్వీసులన్నీ దీనిలో ఉంటాయి.
* మీకు దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ డిటెయిల్స్ కూడా మీరు ఈ సెక్షన్‌లో చెక్ చేసుకోవచ్చు.
* అంతేకాదు ఆధార్ కార్డుకు సంబంధించి మీరు చేసిన అప్లికేషన్ స్టేటస్ ఏమిటో పరిశీలించుకోవచ్చు.
* ఈ ఫంక్షన్లన్నీ బాగా పని చేస్తున్నాయి. అయితే ఒక్కోసారి ఈ యాప్ ఇంటర్నెట్‌కు సరిగా కనెక్ట్ కావడం లేదు.
ఫింగర్‌ప్రింట్ సెన్సర్ కూడా..
* యూఐఏడీఐ ఈ కొత్త ఎం-ఆధార్ యాప్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కూడా యాడ్ చేసింది . దీనివల్ల బయోమెట్రిక్ అథెంటికేషన్ సాధ్యమవుతుంది. దీనివల్ల యాప్ మరింత సెక్యూర్‌గా ఉంది.
* ఎం-ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీకు ఆధార్ ఉండాల్సిన పని లేదు. కానీ పర్సనల్ సర్వీసులు కావాలంటే మాత్రం మీ ఆధార్ నెంబర్ తప్పనిసరి.
* ఒక్క ఎం-ఆధార్ యాప్‌లో మూడు వరకు ఆధార్ ప్రొఫైల్స్‌ను సేవ్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో.. 13 భాషల్లో
* ఎం-ఆధార్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 5.0 (లాలీపాప్) ఆపై వెర్షన్ల ఓఎస్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ పని చేస్తుంది.
* ఐవోఎస్‌లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. ఐవోఎస్ 10 ఆ పై ఓఎస్‌లున్న ఐఫోన్లు, ఐప్యాడ్లలో ఈ యాప్ పని చేస్తుంది.
* ఈ యాప్ తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, ఒడియా, మళయాళం, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, అస్సామీస్‌తో సహా మొత్తం 13 భాషలను ఈ ఎం-ఆధార్ యాప్ సపోర్ట్ చేస్తుంది.