• తాజా వార్తలు

ఎంఐ క్రెడిట్ వెన‌క ఉన్న అస‌లు మ‌త‌ల‌బు ఏమిటి?

చైనా ఫోన్ కంపెనీ షియోమి ఇండియ‌న్ మార్కెట్‌లో ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో అంద‌రికీ తెలిసిందే. ఏకంగా శామ్‌సంగ్‌నే త‌ల‌ద‌న్ని ఇండియాలో నెంబ‌ర్‌వ‌న్ మొబైల్ సేల్స్ కంపెనీగా నిల‌బడింది. త‌క్కువ ధ‌ర‌లోనే ఎక్కువ ఫీచ‌ర్లు,  స్టాండ‌ర్డ్స్ ఉన్న ఫోన్లు అమ్ముతూ అంద‌రికీ చేరువైన షియోమి ఇప్పుడు ఓ కొత్త ఆలోచ‌న‌తో మ‌న ముందుకొచ్చింది. అదే ఎంఐ క్రెడిట్‌. ఎంఐయూఐ ఓఎస్‌తో ప‌నిచేసే ఎంఐ ఫోన్లున్న క‌స్ట‌మ‌ర్ల‌కు కావాలంటే అప్పు ఇవ్వ‌డం ఈ స్కీమ్ ఉద్దేశం. 

ఎవ‌రికి ఇస్తారు? 
ఎంఐ.. క్రెడిట్‌బీ అనే ఇన్‌స్టంట్ లోన్ ఫ్లాట్‌ఫామ్‌తో క‌లిసి ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఐఐటీ, ఐఐఎంల గ్రాడ్యుయేట్ల‌యిన కొంత‌మంది క‌లిసి  క్రెడిట్‌బీని ఏర్పాటు చేసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీగా  ఆర్‌బీఐ ద‌గ్గ‌ర రిజిస్ట‌ర్‌చేయించారు. ఎంఐ క్రెడిట్ ప్లాన్ షియోమి సొంత ఆప‌రేటింగ్ సిస్టం  MIUI ఉన్న ఫోన్ల‌లో ప‌నిచేస్తుంది. అంటే కేవ‌లం ఎంఐ ఫోన్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ క్రెడిట్ స్కీం ప‌నిచేస్తుంది. ,

వెయ్యి నుంచి ల‌క్ష రూపాయ‌ల లోన్‌
ఎంఐ క్రెడిట్ ఫ్లాట్‌ఫాం కింద 1000 నుంచి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు లోన్ ఇస్తారు.  అప్లై చేసుకున్న 10 మినిషాల్లో మ‌నీ అకౌంట్‌లో వేస్తారు. దీనికోసం కేవైసీ పూర్తి చేయాలి. 

ఏమిటీ మ‌త‌ల‌బు?
ఫైనాన్స్, టెక్నాల‌జీ క‌లిసిన ఫిన్‌టెక్ కంపెనీల హ‌వా ఇప్పుడు న‌డుస్తోంది. ఇండియాలో క్రెడిట్ కార్డ్స్‌, ప‌ర్స‌న‌ల్ లోన్స్ ఇచ్చే కంపెనీల‌తోపాటు ప్ర‌స్తుతం మ‌నీ లెండింగ్ యాప్స్‌, కంపెనీలు ఈ రంగంలో వేళ్లూనుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే ఎంఐ ఫోన్ల‌తోపాటు మ్యూజిక్‌, వీడియో స‌ర్వీసుల‌ను లాంచ్‌ చేసిన షియోమి.. ఇప్పుడు మ‌నీ లెండింగ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఈ లోన్స్ ముఖ్యంగా యంగ్ ప్రొఫెష‌న‌ల్స్‌కి ఇస్తారు. కాబ‌ట్టి యూత్‌లో ఓ బ్రాండ్ ఉంటుంది. దాంతోపాటు 24 నుంచి 36 ప‌ర్సెంట్ వ‌డ్డీ కూడా వ‌స్తుంది. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కావ‌డంతో ఎంఐ దీనివైపు మొగ్గుచూపుతుంది. అదీకాక ఈ ప్లాన్‌తో ఎంఐ ఫోన్లు కొనేవారి సంఖ్య కూడా పెరుగుతుంద‌ని ఎంఐ అంచ‌నా. అదే  గ‌నుక క్లిక్ అయితే షియోమి  నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో చాలాకాలం ఉండొచ్చ‌ని అంచ‌నా.

జన రంజకమైన వార్తలు