దేశీయ మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి మరో సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. కస్టమర్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై దేశంలోని 150 నగరాల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు షియోమీ ఫోన్లను ఆర్డర్ చేస్తే కేవలం ఒక్క రోజులోనే డెలివరీ పొందవచ్చు. అందుకు గాను షియోమీ.. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో యూజర్లు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో షియోమీ ఫోన్లతోపాటు ఏ ఇతర ప్రొడక్ట్స్‌ను కొన్నా రూ.49 అదనంగా చెల్లిస్తే మరుసటి రోజే ఆ ప్రొడక్ట్‌ను డెలివరీ చేస్తారు. అయితే కస్టమర్లు నిత్యం మధ్యాహ్నం 3 గంటల లోపే ప్రొడక్ట్‌లను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.
కాగా షియెమి ఇంతకుముందు Express Delivery serviceని అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీన్ని guaranteed next-day deliveryగా మార్చింది. ఈ విషయాన్ని షియోమి India chief Manu Kumar Jain బహిర్గత పరిచారు. షియోమీ అందిస్తున్న ఈ గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సర్వీస్ కేవలం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. శని, ఆదివారాలు, పబ్లిక్ హాలిడేలలో ఈ సర్వీస్ లభించదు. అలాగే ఎక్స్‌ఛేంజ్ ఆర్డర్లకు కూడా ఈ సర్వీస్ లభించదు. ఈ క్రమంలో ఒక్క రోజులో గనక ప్రొడక్ట్‌లను డెలివరీ ఇవ్వకపోతే కస్టమర్లు చెల్లించే రూ.49 వెనక్కి ఇచ్చేస్తామని కూడా షియోమీ తెలిపింది.
కాగా బెంగళూరులో ఇప్పటికే ఎక్స్‌ప్రెస్ డెలివరీ పేరిట నిర్ణీత ఫోన్లను ఎంపిక చేసిన పిన్‌కోడ్‌లలో ఉంటున్న యూజర్లకు షియోమీ సేమ్ డే డెలివరీ చేస్తున్నది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ సేవలు అందుతాయి. కేవలం ఆదివారం మాత్రమే ఈ సర్వీస్ ఉండదు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ డెలివరీకి షియోమీ ఎలాంటి చార్జీలను వసూలు చేయడం లేదు. కాగా దేశంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో నంబర్ 3 పొజిషన్‌లో ఉన్న షియోమీ దేశంలోని 150 నగరాల్లో వేగంగా ప్రొడక్ట్‌లను డెలివరీ అందిస్తుండడంతో ఆ కంపెనీ సేల్స్ పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మధ్య షియోమి క్రికెట్ వరల్డ్ కప్ సీజన్‌కు తగ్గట్టుగా వరల్డ్ కప్ ఎడిషన్ పవర్ బ్యాంక్‌ను మార్కెట్లోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త ఎంఐ పవర్ బ్యాంక్ సామర్థ్యం 10000 ఎంఏహెచ్ కావడం విశేషం. కేవలం బ్లూ రంగులోనే ఈ పవర్ బ్యాంక్‌ను ఆవిష్కరించింది. దీని ధర కేవలం రూ.999. వరల్డ్ కప్ ఎడిషన్ పవర్ బ్యాంక్‌లో డ్యూయెల్ యూఎస్‌బీ ఔట్‌పుట్, టూవే క్విక్ చార్జ్ వంటి ఫీచర్లున్నాయి. లిథియమ్ పాలీమర్ బ్యాటరీలు, అడ్వాన్స్‌డ్ రెసిస్టెన్సీ కెపాసిటెన్స్ సెన్సర్లు వంటి వాటితో ఇది రూపొందింది. దీని బరువు 240 గ్రాములు.