• తాజా వార్తలు

రెడ్ మీ దెబ్బకు అమెజాన్ ఏకంగా ఆగిపోయింది


ఆన్ లైన్ సేల్స్ లో అదరగొట్టే షియోమీ దెబ్బకు టాప్ ఈ కామర్స్ సైట్ అమెజాన్ అదిరిపోయింది. ఊహించని రెస్పాన్సును తట్టుకోలేక సైట్, యాప్ రెండూ పనిచేయడం మానేశాయి.

బంపర్ ఆఫర్లతో షియోమి రెడ్ మి4 ఈ రోజు తొలిసారి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమెజాన్ లో విక్రయానికి పెట్టారు. అయితే కొనుగోలు చేయడం కోసం ఎక్కువ మంది అమెజాన్ ను సందర్శించడంతో అమెజాన్ ఇండియా వెబ్ సైట్, యాప్ రెండు నిలిచిపోయాయి. సర్వర్ల సామర్థ్యానికి మించి తాకిడి పెరగడంతోనే ఈ సమస్య తలెత్తింది.

దాంతో రెడ్ మి4 ఫోన్ ను కొనుగోలు చేయాలని భావించిన కస్టమర్లకు ప్రస్తుతం ఇది రద్దీ సమయం, ఈ పేజీలో ట్రాఫిక్ విపరీతంగా ఉంది, కొద్దిసేపయ్యాక ప్రయత్నించండి అనే మెసేజ్ అమెజాన్ వెబ్ సైట్ లో, యాప్ లో దర్శనమిచ్చింది. ఒకవేళ ఆర్డర్ ను ప్లేస్ చేయాలనుకుంటే, ఈ సమయంలో ప్రాసెస్ కాదని కూడా సందేశాలు కనిపించాయి.

కాగా షియోమి మొబైల్స్ అమెజాన్ లో విక్రయానికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సంచలనం నమోదవుతోంది. నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్లను అమెజాన్ ఇండియాలో, ఎంఐ.కామ్ లో విక్రయానికి ఉంచుతున్నారు. తాజా స్మార్ట్ ఫోన్ రెడ్ మి4 విక్రయం సందర్భంగా ఏకంగా ఈ సారి అమెజాన్ వెబ్ సైటే క్రాష్ అయింది. బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ ను షియోమి విడుదల చేసింది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 6,999 రూపాయలు.

జన రంజకమైన వార్తలు