డిజిటలైజేషన్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్ దూసుకుపోతోంది. ఇన్‌కంటాక్స్ ట్రాన్సాక్షన్లన్నీ ఆన్‌లైన్ చేస్తున్న ఈ శాఖ పాన్ కార్డు తీసుకునే ప్రాసెస్‌ను మరింత సులువుగా మార్చింది. ఆన్‌లైన్‌లో అప్లయి చేసుకుంటే అదే రోజు కార్డు పొందే అవకాశం కల్పిస్తామని తాజాగా ప్రకటించింది. ఫిజికల్ పాన్ కార్డులతో పాటు, ఎలక్ట్రానిక్ పాన్ (ఇ-పాన్) కార్డులు కూడా ప్రవేశ పెట్టినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చెప్పింది. అప్లయి చేసిన రోజే దరఖాస్తుదారుకు ఈ- మెయిల్ ద్వారా ఇ- పాన్ కార్డు పంపుతుంది. ఈ కార్డుపై డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. వీటిని ఎక్కడైనా ఐడెంటిఫికేషన్ కోసం కావాలంటే ఎలక్ట్రానిక్ మోడ్‌లో కూడా పంపే వీలుంది. డిజిలాకర్.జిఒవి.ఇన్ వెబ్‌సైట్‌లోనూ స్టోర్ చేసుకోవచ్చు.
పాన్,టాన్, సిన్.. అన్నీ
కంపెనీలకు సంబంధించి ఐటీ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే ఈ పద్ధతిని ఫాలో అవుతోంది. కొత్తగా నమోదయ్యే కంపెనీలకు పాన్ కార్డులతో పాటు, పన్ను తగ్గింపు ఖాతా సంఖ్య(టాన్)నూ సేమ్ డే ఇష్యూ చేస్తున్నామని ఐటీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ ఎఫైర్స్ (ఎంసీఏ) పోర్టల్‌లోకి వెళ్లి అప్లయి చేయాలి. నమోదైన ఎంసీఏ ఈ డిటెయిల్స్‌ను సీబీడీటీకి పంపిస్తుంది. వాటి ఆధారంగా ఐటీ శాఖ కంపెనీలకు అదే రోజు పాన్, టాన్ కార్డులు ఇష్యూ చేస్తుంది. పైగా పాన్,ట్యాన్ రెండింటికీ ఒకటే అప్లికేషన్ చాలు. కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (సిన్)ను కూడా ఆన్‌లైన్‌లో అప్లయి చేసి తీసుకోవచ్చు. మార్చి 31 వరకు 19,704 కంపెలకు సేమ్ డే.. పాన్ నంబర్ ఇష్యూ చేసింది. కొంత మంది వ్యక్తులకు కూడా ‘ఇ-పాన్’ కార్డులను ఈ-మెయిల్ ద్వారా పంపించింది.