గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న యూజర్లకు గూగుల్ శుభవార్తను చెప్పింది. ఇందులో భాగంగా క్రోమ్ బ్రౌజర్ యూజర్లు ఈజీగా షాపింగ్ చేసుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్ పేమెంట్స్ మెథడ్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇకపై ఈజీగా షాపింగ్ చేయవచ్చు. అయితే ఇందుకోసం మీకు తప్పనిసరిగా Google Pay అకౌంట్ ఉండాలి. గూగుల్ పే ఉన్నట్లయితే మీరు క్రోమ్ నుంచి పేమెంట్స్ మెథడ్ ఫీచర్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ పై షాపింగ్ చేసుకోవచ్చు..అది ఎలా చేయాలో చూద్దాం.
ముందుగా క్రోమ్ బ్రౌజర్‌లోని పేమెంట్స్ మెథడ్స్ ఆప్షన్ దగ్గర మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాతనే మీరు షాపింగ్ జోన్ లో కెళ్లి అక్కడ షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే Google Pay అకౌంట్ వాడే జీమెయిల్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.
ముందుగా మీ ల్యాప్ టాప్ లేదా PC లేదా మొబైల్ డివైజ్ ల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. Google Pay అకౌంట్ వాడే యూజర్లు వారి (జీమెయిల్) ద్వారా లాగిన్ అవ్వండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తరువాత అక్కడ టాప్ రైట్ కార్నర్ దగ్గర కనిపించే డ్రాప్ మెనూలో సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ కనిపించే పేమెంట్ మెథడ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత అక్కడ కనిపించే చెక అవుట్ ఫారమ్స్ ఓపెన్ చేయండి. అందులో మీ అడ్రస్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డులను Add Card ద్వారా యాడ్ చేసుకోండి. Chrome sync ఆప్షన్ టర్న్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు ఈ ఫీచర్ వాడొచ్చు. నేరుగా షాపింగ్ పేమెంట్ చేయవచ్చు. Chrome సెట్టింగ్స్ లోని Payments methodsలో Add అనే బటన్ దగ్గర Add Your Card ఉంటుంది. అక్కడ మీరు కొత్త కార్డు యాడ్ చేయాలనుకుంటే దానికి అవసరమైన వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
గూగుల్ క్రోమ్ లో లాగిన్ కాగానే కార్డు ద్వారా పేమెంట్స్ చేసేందుకు ఆప్షన్ కనిపిస్తుంది. మీ కార్డు CVC ఎంటర్ చేసి Confirm చేస్తే చాలు.. పేమెంట్ పూర్తి అవుతుంది. ఒకవేళ.. మీ అకౌంట్ లో కొత్త కార్డు యాడ్ చేసుకోవాలంటే.. గూగుల్ పే నుంచి ఈమెయిల్ కు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. గూగుల్ అకౌంట్ లో సేవ్ చేసిన కార్డులను ఎప్పుడంటే అప్పుడు డిలీట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ ఆప్సన్ కూడా గూగుల్ లో ఉంది. ఒకవేళ యూజర్..పేమెంట్ మెథడ్ ను స్థానిక డివైజ్ లో మాత్రమే సేవ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు.