ఐ ఫోన్ వాడటమంటే ఓ స్టేటస్ సింబల్. అందుకే ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే కాస్ట్, మెయింటనెన్స్ ఎక్కువైనా కూడా చాలా మంది ఐఫోన్‌నే ఇష్టపడతారు. ఇండియన్ మార్కెట్‌లో రోజుకో కొత్త కంపెనీ పుట్టుకొస్తుంది. ఎన్ని కంపెనీలు వచ్చినా ఫాస్ట్ గ్రోయింగ్ ఉన్న ఇండియన్ మార్కెట్‌లో సర్వైవ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మార్కెట్‌లో యాపిల్‌కు మంచి వేల్యూ ఉంది. దాన్ని సేల్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోవడానికి యాపిల్ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. కొంతకాలంగా మార్కెట్ షేర్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోన్న యాపిల్ ప్రస్తుతం ఐఫోన్ ధరలను తగ్గిస్తోంది.
3వేల నుంచి 8వేల రూపాయలు
లేటెస్ట్‌గా ఐఫోన్ 5ఎస్ ధరను 3వేల రూపాయలు తగ్గించడానికి ప్లాన్ చేస్తోంది. ఐఫోన్లన్నింటిలోనూ మోస్ట్ సక్సెస్‌ఫుల్ మోడల్ అయిన 5ఎస్ ధర ప్రస్తుతం 18,000. దీన్ని 15వేల రూపాయలకు అమ్మడానికి యాపిల్ రడీ అవుతోంది. దాదాపు ఐ ఫోన్ 6 ఎస్ ఫీచర్లు కలిగిన ఐఫోన్ ఎస్ఈ మోడల్‌పైనా భారీగా ధర తగ్గిస్తారని మార్కెట్ సమాచారం. 39 వేల రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయిన ఎస్ఈ ప్రస్తుతం 28 వేలకు లభిస్తోంది. ఈ మోడల్‌ను 20 వేల రూపాయలకు సేల్‌లో పెట్టడానికి యాపిల్ ప్లాన్ చేస్తోంది.
ఆ సెగ్మెంటే టార్గెట్
ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో 15 వేల నుంచి 20 వేల రూపాయల మధ్య ధర ఉన్న బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లకు బాగా గిరాకీ ఉంది. ఐఫోన్ల ధర తగ్గిస్తే ఈ రేంజ్‌లో ఫోన్లు కొనేవారిని ఎట్రాక్ట్ చేయొచ్చని యాపిల్ అంచనా వేస్తోంది. ఐఫోన్ లాంటి ప్రెస్టీజియస్ బ్రాండ్ బడ్జెట్ రేంజ్‌లో దొరికితే ఎక్కువ మంది కొంటారని, సేల్స్ పెరుగుతాయని యాపిల్ భావిస్తోంది. అదీకాక అమెరికా తర్వాత ఐఫోన్‌కు పెద్ద మార్కెట్ అయిన చైనాలో ఇటీవల సేల్స్ పడిపోయాయి. దీంతో యాపిల్ ఇండియా వైపు దృష్టి పెడుతోంది.