మోటోరోలా తన మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ ధర బాగా తగ్గించింది. గతేడాది ఫిబ్రవరి నెలలో దీన్ని విడుదల చేసినప్పుడు ధర రూ.49,999 ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.16 వేలకు తగ్గిపోయింది.
గతేడాది ఫిబ్రవరిలో దీన్ని రిలీజ్ చేసిన తరువాత కొన్ని నెలలకు రూ.12వేలకు ధర తగ్గగా రూ.37,999 ధరకు ఈ ఫోన్ లభ్యమైంది. అయితే తాజాగా ఈ ఫోన్ ధర ఏకంగా రూ.22వేలు తగ్గింది. దీంతో ఇప్పుడీ ఫోన్ రూ.15,999 ధరకు వినియోగదారులకు లభ్యమవుతోంది. ఇక ఇదే ఫోన్ 32 జీబీ వెర్షన్ కేవలం రూ.12,999 కే యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యమవుతున్నది.
ఇవీ స్పెసిఫికేషన్లు
* 5.4 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే
* 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్
* 3 జీబీ ర్యామ్
* 32/64 జీబీ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్ (అప్‌గ్రేడబుల్)
* 4జీ ఎల్‌టీఈ
* 3760 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.