• తాజా వార్తలు

దీపావళికి బంపర్ డీల్స్‌తో ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

ఫెస్టివల్ సమయంలో ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం భారీ లాభాలతో దూసుకువెళుందనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని ఈ కామర్స్ దిగ్గజాలు ఈ సమయంలోనే భారీ ఆఫర్లకు తెరలేపి తమ అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ సారి వాటికి ముఖేష్ అంబానీ రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. Mukesh Ambani-led Reliance Industries (RIL) దీపావళి నాటికి ఈ కామర్స్ రంగంలోకి దూసుకురానుంది. రిల్ దీపావళి రోజున ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా నిలిచాయి. ఇదే జరిగితే ఇక ఈ కామర్స్ దిగ్గజాలు కూడా  రిల్ దెబ్బకు అతలాకుతలం కాక తప్పదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

వాల్ మార్ట్ భాగస్వామి ఫ్లిప్ కార్ట్ Big Billion Day అని , మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ Great Indian Diwali Sale అని పండగ సమయాల్లో వినియోగదారులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఈ రెండు దిగ్గజాలకు ముఖేష్ అంబానీతో పెద్ద ఫైటే నడవనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రిలయన్స్ అతి త్వరలోనే ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టబోతోందని జియో అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాం ద్వారా వినియోగదారులకు, రీటెయిల్స్ కు, ప్రొడ్యూసర్ కు అనేక రకాలైన ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాం ద్వారా దేశంలో ఉన్న 3 కోట్ల మంది చిన్న వ్యాపారులకు మేలు జరగనుందని ఆయన తెలిపారు. 

ఇండియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానికి చెందిన రిల్ వెస్డ్ బెంగాల్లో ఇప్పటికే రూ. 28 వేల కోట్ల పెట్టుబడులను పెట్టింది. ఇండియాలో ఇలా పెట్టుబడి పెట్టిన కంపెనీల్లో జియో పదవది. డిజిటల్ రివల్యూషన్ లో భాగంగా రూ.10 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు జియో ప్లాన్ చేస్తోంది.

జియో మనీ ప్లాట్‌ఫామ్‌ లేదా టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా డిజిటల్‌ కూపన్లను వాడుకుని పక్కనే ఉన్న దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేలా ఆపరేషనల్‌ మోడల్‌ను సిద్ధంచేస్తుందని తెలిసింది. ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌ సిటీల్లో పలు స్టోర్లకు, దిగ్గజ బ్రాండులకు కల్పిస్తోంది. వచ్చే ఏడాది దేశమంతటా దీన్ని ఆవిష్కరించనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి

కాగా రిలయన్స్ జియో తనకున్న విస్తారమైన నెట్‌వర్క్‌, మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లతో ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ వీధుల్లో ఉండే స్టోర్లు లేదా కిరణా షాపులతో కలిసి పనిచేస్తుందని తెలుస్తోంది.

జన రంజకమైన వార్తలు