• తాజా వార్తలు

మొబైల్ వాలెట్లకు కె.వై.సి గడువు పెంచడంతో పాటు,ఆర్.బి.ఐ. కొత్త రూల్స్ ఇవీ

మొబైల్ వాలెట్ యాప్‌లను వాడుతున్న వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. ఆయా వాలెట్లకు గాను ఫుల్ కేవైసీ చేయించుకునేందుకు గడవును మరొక ఆరు నెలల పాటు పెంచారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆ గడువును ఫిబ్రవరి 29, 2020 వరకు పొడిగించుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రస్తుతం ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం తదితర అనేక మొబైల్ వాలెట్ యాప్‌లను స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే ఆధార్, ఇతర వివరాలతో ఇప్పటికే చాలా మంది పాక్షిక కేవైసీ చేసి ఆయా యాప్‌లను ఉపయోగిస్తున్నారు. కానీ ఆగస్టు 31, 2019 లోగా ఆయా యాప్‌లకు గాను ఫుల్ కేవైసీ (ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్) చేయించుకోవాలని గతంలో ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని మరో 6 నెలలకు పొడిగించడంతో వినియోగదారులు ఆ గడువులోగా ఆ వాలెట్ యాప్‌లలో ఫుల్ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది.

తాజా ఉత్తర్వులతో మొబైల్ వ్యాలెట్ కంపెనీలు కూడా ఊపిరిపీల్చుకున్నాయి. తాజా ఉత్తర్వులతో ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర వ్యాలెట్స్ వాడేవారు ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్లు చేసుకోవచ్చు. అయితే కేవైసీ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని చెప్పింది. ఫిబ్రవరి 29 తర్వాత గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

జన రంజకమైన వార్తలు