చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ ఇటీవల విడుదల చేసి రెడ్‌మీ 4 మరోమారు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా, ఎంఐ డాట్ కామ్‌లలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.6,999 ధర కలిగిన ఈ ఫోన్‌ను షియోమీ గత నెల మధ్యలో భారత్‌లో మూడు వేరియంట్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
లాంచింగ్ సమయంలో ఇచ్చిన ఆఫర్లనే నేడు కూడా ప్రకటించనుంది. రెడ్‌మీ 4 ఇటీవలి విక్రయాలు దుమ్మురేపాయి. అమ్మకానికి పెట్టిన నిమిషాల్లో అవుటాఫ్ స్టాక్ అవడం ఆ ఫోన్‌పై వినియోగదారులకు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.
కాగా షియోమి ఇంతకుముందు రికార్డ్ స్థాయి అమ్మకాలను సాధించింది. ఎంఐ స్టోర్ తో పాటు ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో తొలుత జనవరి 23, సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన రెడ్ మీనోట్ 4 హాట్ సేల్ ను క్రియేట్ చేసింది. అమ్మకాలు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే రెండున్నర లక్షల యూనిట్లను విక్రయించినట్టు షియామి అప్పట్లో ప్రకటించింది. దాదాపు 10 నిమిషాల్లో 2.5 లక్షలకు పైగా స్మార్ట్ ఫోన్లను అమ్మినట్టు తెలిపింది. ఆన్ లైన్ విక్రయ చరిత్రలోనే భారీ అమ్మకాల కొత్త రికార్డు నెలకొల్పింది.
అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందంటూ రెడ్ మీ నోట్ 4 అమ్మకాలపై స్పందించిన ఫ్లిప్ కార్ట్ కూడా ప్రకటించింది. ఫేవరెట్ మొబైల్స్ కొనుగోలులో వినియోగదారుల నమ్మకాన్ని ఫ్లిప్ కార్ట్ పదేపదే నిరూపించుకుంటోంది.
కాగా మోస్ట్ ఎవైటెడ్ స్మార్ట్ ఫోన్ ను షియోమి జనవరి 19 న మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే అమ్మకాలనుమాత్రం జనవరి 23 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు మరోసారి నిర్వహించబోయే సేల్స్ కూడా అదరగొట్టనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.