• తాజా వార్తలు

ఈ డెబిట్ కార్డు ఉంటే రూ.10 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ ఉన్నట్టే

మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా..అయితే ఎటువంటి కార్డు వాడుతున్నారు. రూపే కార్డు , మాస్టర్ కార్డు, టైటానియం కార్డు ఇలా చాలా రకాల కార్డులు ఉంటాయి. అయితే వీటిల్లో మీరు రూపే డెబిట్ కార్డు వాడుతున్నట్లయితే మీరు ఏకంగా రూ.10 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనాసరే అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. 

రూపీ, పే అనే రెండు పదాల కలయికతో రూపే కార్డుకు నామకరణం చేశారు. వీసా, మాస్టర్ డెబిట్ కార్డులను విదేశీ పేమెంట్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తాయి. రూపే కార్డు స్వదేశీ పేమెంట్ టెక్నాలజీపై పనిచేస్తుంది. తొలి రూపే గ్లోబల్ కార్డును 2014లో జారీ చేశారు. భారత్‌లో ఎన్‌పీసీఐ ఈ కార్డు లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. కస్టమర్లు విదేశాల్లో కూడా ఈ కార్డు వాడొచ్చు. దీని కోసం ఎన్‌పీసీఐ డిస్కవర్ నెట్‌వర్క్‌తో జతకట్టింది. కాగా రూపే గ్లోబల్ కార్డు ఐదు రకాలుగా అందుబాటులో ఉంది. రూపే క్లాసిక్ డెబిట్ కార్డు, రూపే క్లాసిక్ క్రెడిట్ కార్డు, రూపే ప్లాటినం డెబిట్ కార్డు, రూపే ప్లాటినం క్రెడిట్ కార్డు, రూపే సెలెక్ట్ క్రెడిట్ కార్డు అనే కార్డులు అందుబాటులో ఉన్నాయి. 

ఈ కార్డు ఉన్నవారికి రూ.10 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది. అయితే రూపే సెలెక్ట్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుంది. రూపే ప్లాటినం డెబిట్ కార్డుపై రూ.2 లక్షలు, రూపే క్లాసిక్ డెబిట్ కార్డుపై రూ.లక్ష బీమా మొత్తం లభిస్తుంది. ఇక విదేశాల్లో రూపే కార్డు ఉపయోగిస్తే ఏటీఎం ట్రాన్సాక్షన్లపై 5 శాతం, పీఓఎస్ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీంతో పాటుగా ఉచిత డెమెస్టిక్, ఇంటర్నేషనల్ లాంజ్ ఫెసిలిటీ కూడా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు ఈ కార్డులను అందిస్తున్నాయి.
 

జన రంజకమైన వార్తలు