;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది. కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.
ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ కస్టమర్లకు StateBankOfIndia హెచ్చరికలు జారీ చేసింది. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్‌కు దూరంగా ఉండాలంటూ ట్వీట్ చేసింది. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను సబ్‌స్క్రై బ్ చేసుకొని ఉంటే వెంటనే వాటిని అన్‌ఫాలో కావాలని సూచించింది. ఫేక్ అకౌంట్ల వల్ల మోసాల బారిన పడే అవకాశముందని తెలిపింది.
సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బ్యాంక్ లేదా ఏదైనా అధికారిని ట్యాగ్ చేసేటప్పుడు.. వారి అకౌంట్ వెరిఫై చేసుకోవాలని సూచించింది. తప్పుగా వేరొక అకౌంట్‌ను ట్యాగ్ చేయవద్దని తెలిపింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు పెరిగిపోతున్నాయని పేర్కొంది. అందువల్ల కస్టమర్లు అధికారిక అకౌంట్ ఏదో చెక్ చేసుకోవాలని తెలిపింది. అలాగే వెరిఫై సైన్ చూడాలని కోరింది. తర్వాతనే ఏదైనా సమాచారం లేదరా ఆర్థిక లావాదేవీల వివరాలు తెలియజేయాలని సూచించింది.
బ్యాంక్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు తెలిపింది.
1. Facebook: @StateBankOfIndia
2. Instagram: @theofficialsbi
3. Twitter: @TheOfficialSBi
4. LinkedIn: State Bank of India (SBI)
5. YouTube: State Bank of India
6. Quora: State Bank of India (SBI)
7. Pinterest: State Bank Of India
ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించి ఏదైనా మోసం జరిగితే వెంటనే బ్యాంక్‌కు తెలియజేయాలని కోరింది. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇచ్చింది. 1800112211. 18004253800 నెంబర్లకు ఫోన్ చేసి సమస్య తెలియజేయవచ్చు.