ఇప్పటికే వివిధ రకాల ఛార్జ్ లతో వినియోగదారులపై ఛార్జ్ ల మోత మోగిస్తున్న బ్యాంకు లు సరికొత్త బాదుడికి సిద్ధం అవుతున్నాయి. ఇకపై ఎటిఎం విత్ డ్రా లకూ మరియు చెక్ బుక్ ఇష్యూ లకు కూడా మన బ్యాంకు లు ఛార్జ్ లు వేయనున్నాయి. డైరెక్టరేట్ జనరల్ అఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటలిజెన్స్ నిబంధనల మేరకు ఉచిత బ్యాంకింగ్ సేవలపై కూడా ట్యాక్స్ వేసేందుకు బ్యాంకులు సిద్దం అయ్యాయి. ఒకవేళ ఇదే గనుక జరిగితే వినియోగదారులలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీని గురించిన వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఏం జరిగింది ?
భారత ప్రభుత్వం యొక్క GDSST మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులకు సంబందించిన ఉచిత సేవలపై కూడా పన్ను విధించామని ఆదేశాలు జారీ చేసింది. ఇలా నోటీసులు పొందిన బ్యాంకు లలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు,యాక్సిస్ బ్యాంకు మరియు కోటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. మిగతా బ్యాంకులకు కూడా అతి త్వరలోనే నోటిసులు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే బ్యాంకులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. GDSST చెప్పిన ప్రకారం తప్పనిసరిగా టాక్స్ వసూలు చేస్తే వినియోగదారుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఒకవేళ వసూలు చేయని పక్షం లో ఈ మొత్తాన్ని బ్యాంకులే చెల్లించవలసి ఉంటుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నిబంధనపై బ్యాంకు లు కోర్టు వెళ్ళే ఆలోచనలో ఉన్నాయి.
వేటిపై టాక్స్ పడుతుంది?
ప్రతీ బ్యాంకు కూడా తమ ఖాతాదారుల యొక్క ఖాతాలలో కనీస నిల్వలు లేకపోతే పెనాల్టీ ని ఛార్జ్ చేస్తాయి. ఇవి కాకుండా ఎటిఎం విత్ డ్రా లు, చెక్ బుక్ లు, ఆన్ లైన్ బ్యాంకింగ్ లాంటి ఉచిత సర్వీస్ లను కూడా బ్యాంకులు అందిస్తాయి. అంటే కనీస నిల్వ ఉండేట్లుగా చూసుకున్నట్లయితే బ్యాంకు లు మన దగ్గర వసూలు చేయడానికి ఏమీ ఉండదు. అన్నీ ఉచిత సర్వీస్ లే ఉంటాయి. అయితే కొత్త నిబంధనల ప్రకారం మినిమం బాలన్స్ ఉన్నా లేకపోయినా సరే బ్యాంకు లు అందించే సర్వీస్ లపై బ్యాంకు లు ఖచ్చితంగా టాక్స్ విధించాలి. ఖాతాలలో కనీస నిల్వలు లేని కారణంగా గత సంవత్సరం ఏప్రిల్- నవంబర్ నెలల మధ్య స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కస్టమర్ ల నుండి రూ 1771 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వీటికి అదనంగా మరో 6 వేల కోట్ల రూపాయలను బ్యాంకులు వినియోగదారుల నుండి వసూలు చేయాలి. ఒక వేళ వసూలు చేయని పక్షంలో సదరు మొత్తాన్ని బ్యాంకులే చెల్లించాలి.
ఈ నిబంధనలని తప్పనిసరి చేసిన నేపథ్యం లో బ్యాంకు లు ఈ ఛార్జ్ లు వినియోగదారుల వద్దనుండి వసూలుచేస్తాయా? లేక బ్యాంకు లే చెల్లిస్తాయా? లేక కోర్ట్ లో తేల్చుకుంటాయా? అనేది మరికొద్ది రోజులలో తేలనుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు మా పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తాము,