• తాజా వార్తలు

సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

సెప్టెంబర్‌ 1నుంచి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్స్‌, మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్‌సీటీసీ సర్వీస్‌ ఛార్జీల విధానంలో కీలక మార్పులు చేశారు. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ఇక రూల్స్ అతిక్రమించారో ఫైన్ పడడం ఖాయం. కావున కాస్త కేర్‌ఫుల్‌గా ఉండ్సాలిందే. అయితే రేపటి నుంచి కొత్తగా అమల్లోకి వచ్చేవి ఏంటో చూద్దాం.

BUY A HOUSE 
మీరు కొనే ఇంటి విలువ రూ.50 లక్షలు దాటితే విక్రయదారుడికి ఆ మెుత్తాన్నిచెల్లించడానికి ముందుగానే 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో టీడీఎస్‌ను డిపాజిట్‌ చేయకపోతే,దానిపై 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ ఛార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది.ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది.

WITHDRAW A LOT OF CASH 
ఒక సంవత్సరంలో ఒక అకౌంట్‌ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్‌డ్రాయెల్స్‌ జరిపితే 2 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్‌ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌ విధిస్తారు.

HAVEN'T LINKED PAN AND AADHAAR 
ఆధార్‌ నంబరుతో పాన్‌కార్డులు లింక్‌ చేయనివారికి ఆదాయపన్ను శాఖ కొత్త పాన్‌కార్డులు జారీ చేయనుంది.

GET LIFE INSURANCE FUNDS 
జీవిత బీమా ప్రీమియం గడువు ముగిసిన తర్వాత తీసుకునే నికర సొమ్ముపై 5 శాతం టీడీఎస్‌ కట్టాల్సి ఉంటుంది.

BOOK TICKETS ON IRCTC 
ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ‌) ఈ-టికెట్లపై సర్వీసు ఛార్జీలను పెంచింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న నాన్‌ ఏసీ టికెట్లపై రూ. 15, ఏసీ టికెట్‌పై రూ. 30 వరకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేయనుంది.

HAVE SERVICE TAX DUES 
సేవా పన్ను బాకాయిలను వదిలించుకునేందుకు కొత్త పథకం అమల్లోకి రానుంది. దీని ద్వారా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ ట్యాక్స్‌‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకుని బయటపడొచ్చు.

VIOLATE TRAFFIC RULES 
తాజాగా సవరించిన మోటారు వాహనాల చట్టం కూడా రేపటి నుంచి అమల్లోకి రానుంది. ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘించే వారు ఇక భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే. ఇప్పటికే ఈ చట్టంపై పోలీసులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించి డబ్బులు ఆదా చేసుకోవాలని ప్రమాదాల నివారణకు తోడ్పడాలని వాహనదారులకు కోరారు.

GO SHOPPING 
ఇప్పటివరకు 50 వేల రూపాయలకు పైబడి చేసిన షాపింగ్‌ గురించి మాత్రమే ఆదాయపన్ను శాఖకు బ్యాంకులు సమాచారం ఇచ్చేవి. టాక్స్‌ రిటర్న్స్‌లో ఎటువంటి అనుమానం కలిగినా చిన్న ట్రాన్స్‌క్షన్‌ గురించి కూడా బ్యాంకులు ఆరా తీసే అవకాశముంది.
 

జన రంజకమైన వార్తలు