డిజిటల్ ఇండియా కోసం కృషి చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులను అంగీకరించే దుకాణదారులు ఇదివరకు ఎండీఆర్ పేరిట ఛార్జీలు కట్టాల్సి వచ్చేది. కార్డ్ ట్రాన్సాక్షన్లు మరింత పెంచడానికి ఈ ఎండీఆర్‌ను తొలగిస్తూ బడ్జెట్లో కేంద్రం ప్రకటించబోతోంది. మరోపక్క యూపీఐ పేమెంట్స్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి రికరింగ్ పేమెంట్స్ అనే కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ద
రికరింగ్ పేమెంట్స్ అంటే..
తరచూ చేసే పేమెంట్లు ఆటోమేటిగ్గా మన యూపీఐ అకౌంట్ ద్వారా అయిపోయేలా చేయడమే రికరింగ్ పేమెంట్స్. ఉదాహరణకు నెల నెలా కట్టే ఫోన్ బిల్లు, కరెంట్ బిల్, డీటీహెచ్ రీఛార్జిలాంటివి ఈ రికరింగ్ పేమెంట్స్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిగ్గా మీ యూపీఐ అకౌంట్ నుంచే అయిపోతాయి. దీనికి గవర్నమెంట్ ఇటీవలే అనుమతిచ్చింది. ఇండియాలోని యూపీఐ యూజర్లంతా ఈ రికరింగ్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని ఆర్‌బీఐ అనౌన్స్ చేసింది.
2వేల లోపు ట్రాన్సాక్షన్లకే..
అయితే ఈ రికరింగ్ పేమెంట్స్‌ను రూ.2వేల లోపు ట్రాన్సాక్షన్లకే పరిమితం చేశారు. అందువల్ల నెలవారీ బిల్లులు 2వేల లోపు ఉండేవారికే ఇది ఉపయోగం.
ఈ ఐదింటికీ బాగా ఉపయోగం
1. సిప్ చేయొచ్చు
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్ (సిప్) కింద నెలకు 500, 1000 సేవ్ చేసే చిన్న, మధ్య తరగతి ఉద్యోగులు మొదలైనవారికి ఈ యూపీఐ రికరింగ్ పేమెంట్ మంచి ఆప్షన్. దీన్ని అనేబుల్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి నేరుగా మనీ సిప్ ఖాతాకు వెళ్లిపోతుంది
2. మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్ పేమెంట్స్‌కి
పోస్ట్‌పెయిడ్ మైబల్‌వాడేవారు ప్రతి నెలా బిల్ చెల్లించాలి. దీనికి కూడా యూపీఐ రికరింగ్ పేమెంట్స్ ఆప్షన్ వాడుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను ఒకసారి సెట్ చేసి పెట్టుకుంటే ప్రతి నెలా గుర్తు పెట్టుకుని బిల్ కట్టక్కర్లేదు. మొబైల్ ఛార్జీలు ఇప్పుడు పెద్దగా లేవు కాబట్టి 90 శాతం మందికి 2వేల లోపే బిల్లు వస్తుంది. కాబట్టి బేఫికర్‌గా దీన్ని వాడుకోవచ్చు.
3. డీటీహెచ్ బిల్లులకు
కేబుల్ టీవీలు అంతరించిపోతున్నాయి. ఇప్పుడంతా డీటీహెచ్ యుగం. దీన్ని ప్రతి నెలా రీఛార్జి చేయించుకోవాలి. రికరింగ్ పేమెంట్స్ ఆప్షన్ సెట్ చేసుకుంటే ఆటోమేటిగ్గా నెల తిరగ్గానే మీ డీటీహెచ్ బిల్లు కట్టేస్తుంది.
4. ఇన్స్యూరెన్స్ ప్రీమియంలకు..
నెలవారీ రెండువేల లోపు ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టేవారికి కూడా ఈ రికరింగ్ పేమెంట్స్ మోడ్ ఉపయోగపడుతుంది.
5. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్లకు..
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటి సర్వీసులకు యూట్యూబ్ ప్రీమియంలాంటి సర్వీసులకు కూడా ఈ యూపీఐ రికరింగ్ పేమెంట్స్ ఆప్షన్ పనికొస్తుంది. అనేబుల్ చేసుకుంటే సబ్‌స్క్రిప్షన్ అయిపోగానే ఆటోమేటిగ్గా రెన్యువల్ చేస్తుంది.
It is expected that the recurring subscription charges for OTTs such as Netflix, Amazon Prime, besides premium song access services such as Youtube Premium etc can be now done automatically.
We will keep you updated, as more news come in.