ఎన్నికలు అయిపోయాయి. ఇక మిగిలింది రిజల్ట్స్. మే 23వ తేదీన డిల్లీ గద్దెనెక్కేదెవరన్న విషయం తేలిపోయతుంది.అయితే దానికి ముందు చాలామంది ఎవరికి వారు పీఎం లెక్కలేసుకుంటున్నారు. దేశంలో హాట్ టాఫిక్ గా మారిన దేశ ప్రధాని అంశాన్ని అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇందులో పుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా చేరింది. తర్వాతి పీఎం ఎవరు అనే థీమ్‌తో ఈ కంపెనీ పెట్టిన గేమ్‌లో తర్వాత దేశ ప్రధాని ఎవరో చెబితే.. 30 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తామంటోంది జొమాటో. అదెలాగో చూద్దాం.
జొమాటో ఎలక్షన్ లీగ్ పేరుతో ఆఫర్ నిర్వహిస్తోంది. ఇందులో మన దేశ తర్వాతి ప్రధాని ఎవరో కరెక్ట్‌గా ఊహించిన వారికి 30 శాతం క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. మీ అంచనా నిజమైతే.. ఆ తర్వాత మీరు ఆర్డర్ చేసే ఫుడ్‌లో 30 శాతాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో మీరు పొందొచ్చు. ఈ నెల 22వ తేదీలోపు మీరు ఆర్డర్ చేసిన ఫుడ్‌తో పాటు ఈ గేమ్ ఆడొచ్చు. గెలిస్తే.. 23వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వాడుకోవచ్చు. ఇది ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లలో ఇస్తున్న 40 శాతం డిస్కౌంట్‌కు అదనంగా ఇస్తామని జొమాటో ప్రకటించింది.
ప్రెడిక్షన్‌తో కస్టమర్లకు ఆఫర్లు ఇవ్వడం ఇదే కొత్త కాదు. ఐపీఎల్ సీజన్‌లో ఇలాంటి ఆఫర్ అందించింది. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ జరిగినప్పుడు ప్రతీ రోజూ ఈ ప్రెడిక్షన్ గేమ్‌ను నిర్వహించింది జొమాటో. అప్పుడు తమ కస్టమర్ల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందని కంపెనీ చెబ్తోంది. మొత్తం 224 నగరాల నుంచి 1.4 కోట్ల మంది ఈ ఆటలో పాల్గొన్నారు. డిస్కౌంట్ల రూపంలో సుమారు రూ.15 కోట్ల వరకూ ప్రయోజనం పొందారని అంచనా.
జొమాటో ఇప్పటికే పలు రెస్టారెంట్లపై 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌కు అదనంగా కాబోయే ప్రధాని క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన తర్వాత యాప్‌లోనే ప్రధాని ఎవరో ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ సమాధానం కరెక్ట్ అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాన్ని తర్వాతి ఆర్డర్లకు వినియోగించుకోవచ్చు. మోదీ, రాహుల్ గాంధీ, ఇతరులు అనే మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు దేశీయ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ ఒకటిన్నర బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.10500 కోట్ల వరకూ ఉంటుంది. ఇది రాబోయే రెండేళ్లలో 2.5 -3.5 బిలియన్ డాలర్లకు చేరే ఆస్కారం ఉంది అని రెడ్‌సీర్ అనే కన్సల్టింగ్ కంపెనీ అంచనా వేస్తోంది. ఈ లెక్కన ఇండియాలో ఈ ఆన్ లైన్ ఫుడ్ మార్కెట్ రూ.15 వేల నుంచి 25 వేల కోట్లకు విస్తరించేట్టు కనిపిస్తోంది.