• తాజా వార్తలు

వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా.. మీ కంపెనీ డేటా సేఫ్‌గా ఉంచ‌డానికి ఇదిగో గైడ్

కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో దేశంలో ప్రజలంతా ఇళ్లలోనే లాక్‌డౌన్ అయిపోయారు. ఐటీ ఉద్యోగులు, కొన్ని గవర్నమెంట్ సంస్థలు తమ ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోం  చేయడానికి ఆప్షన్స్ ఇచ్చాయి. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ బాగున్నా కంపెనీ డేటాను మీరెంత సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంచుతున్నార‌నేది కూడా కీల‌క‌మే.  కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉంచాల్సిన ఈ సమాచారం లీక్ అయితే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినవచ్చు. తేడా వస్తే కంపెనీ న‌ష్టాల్లోకి కూడా వెళ్లొచ్చు. ఈ పరిస్థితుల్లో  వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పుడు మీ కంపెనీ డేటాను సేఫ్‌గా ఉంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.  
 

హోం వైఫై పాస్‌వ‌ర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి.

వర్క్ ఫ్రం హోం చేసే వాళ్లంతా తప్పనిసరిగా పాటించాల్సిన  రూల్ ఇది. మీ హోం వైఫై పాస్‌వ‌ర్డ్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉండాలి.  వీలైన‌న్ని ఎక్కువ రకాల క్యారెక్టర్స్ పాస్‌వ‌ర్డ్‌లో ఉండాలి. తరచూ పాస్‌వ‌ర్డ్ మార్చండి. ఇంకా మంచి పద్ధతి. వైఫై మీద పని చేస్తున్నప్పుడు గెస్ట్‌/  ఫ్యామిలీ/  ఐవోటీ డివైస్‌ల‌కు వేర్వేరు పాస్‌వ‌ర్డ్లు పెట్టుకోవ‌డం మ‌రింత మంచిది.  

కంపెనీ ఐటీ డిపార్ట్‌మెంట్‌తో టచ్‌లో ఉండండి
మీరు ఎక్కువ సేపు వర్క్ ఫ్రం హోం చేస్తుంటే మీ కంపెనీ వెబ్‌సైట్ లేదా వ‌ర్క్ ఫీల్డ్ హ్యాకింగ్‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి ఇలాంటి సంద‌ర్భాల్లో ఏం చేయాలో మీ కంపెనీ ఐటీ డిపార్ట్‌మెంట్‌ను అడగండి. వాళ్లు చెప్పిన రూల్స్ ఫాలో అవుతూ వెళ్లండి.  ఎవ‌రైనా ఫోన్ చేసి మీ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.  మీ లాగిన్ పాస్‌వ‌ర్డ్ లాంటివి అడిగార‌నుకోండి.  ఓసారి చెక్ చేసుకోండి. అది మీ కంపెనీ ఫోన్ అని ప‌క్కా అయితేనే ఆన్స‌ర్ చెప్పండి. లేదంటే కంపెనీకి నేనే ఫోన్ చేసి చెప్తాన‌ని కంపెనీ ఫోన్ నెంబ‌ర్‌కు కాల్ చేసి విషయం క‌నుక్కోండి.  ఏ మాత్రం జాగ్ర‌త్త‌గా లేకున్నా సైబ‌ర్ నేర‌గాళ్లు మీ పాస్‌వ‌ర్డ్‌తోటే మీ కంపెనీ డేటా కొ్ట్టేయొచ్చు జాగ్ర‌త్త‌.

కంపెనీ ఇచ్చిన డివైస్‌లే వాడండి.
వ‌ర్క్ ఫ్రం హోమ్ చేసే స‌మ‌యంలో కంపెనీ ఇచ్చిన ల్యాపీ లేదా డెస్క్‌టాప్‌లే వాడండి. ఎందుకంటే అవి ఫుల్ సెక్యూర్డ్‌గా ఉంటాయి. డేటా బ‌య‌టికి పోకుండా  హార్డ్‌వేర్ లెవెల్ నుంచి  జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. మీరు మీ పీసీ లేదా ల్యాపీ నుంచి చేస్తే డేటా పొర‌పాటున మిస్ యూజ్ అయితే మీరే స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంది. అందుకే కంపెనీ డివైస్‌లు వాడ‌టం బెస్ట్ ఆప్ష‌న్‌.

సాఫ్ట్‌వేర్ అప్ టు డేట్‌గా ఉంచుకోండి
మీ మొబైల్ ఆప‌రేటింగ్ సిస్టం, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌, యాప్స్‌, వెబ్ బ్రౌజ‌ర్స్ అన్నీ మాల్వేర్స్‌ను సెక్యూరిటీ  థ్రెట్స్‌ను త‌ట్టుకోవాలంటే  అవ‌న్నీ అప్‌టు డేట్‌గా ఉంచుకోవాలి. మీ కంప్యూట‌ర్ లేదా మొబైల్ అప్‌డేట్ చేసుకోమ‌ని మెసేజ్ చూపిస్తే వెంట‌నే ఆ ప‌ని చేసేయండి. ఎందుకంటే ప్ర‌తి అప్‌డేట్‌లోనూ సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి. అవి మిమ్మ‌ల్ని డేటా కోల్పోకుండా సిస్టం పాడవ‌కుండా కాపాడ‌తాయి.

 స‌ర్వ‌ర్ స్లోగా ఉందా.. ఓపిక పట్టండి
ఇంట్లో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చినప్పుడు కంపెనీ స‌ర్వ‌ర్ రిమోట్‌గా ప‌ని చేస్తుంది. కాబ‌ట్టి స్లో అవ‌డం స‌హ‌జం. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ఓపిక‌ప‌ట్టండి. 

జన రంజకమైన వార్తలు