• తాజా వార్తలు

వాట్సాప్‌తో ఈపీఎఫ్‌వో సేవ‌లు.. ఎలా వాడుకోవాలో  చెప్పే తొలి గైడ్ 

భ‌విష్య‌నిధి అదేనండీ ప్రావిడెంట్ ఫండ్ తెలుసుగా..  ఉద్యోగులు త‌మ జీతంలో నుంచి కొంత మొత్తాన్ని భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం దాచుకునే నిధి ఈ పీఎఫ్‌.  ల‌క్ష‌ల మంది చందాదారులున్న ఈపీఎఫ్ ఇటీవ‌ల త‌న సేవ‌ల‌ను బాగా డిజిట‌లైజ్ చేస్తోంది. ఇప్పుడు కొత్త‌గా ఈపీఎఫ్ చందాదారుల కోసం వాట్సాప్   హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించింది. చందాదారుల స‌మ‌స్య‌లు సుల‌భంగా ప‌రిష్క‌రించుకోవ‌డానికి ఈ వాట్సాప్ హెల్ప్ లైన్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. చిన్న విషయానికి కూడా పీఎఫ్ ఆఫీస్‌కు వెళ్ల‌న‌క్క‌ర్లేకుండా ఈ ఏర్పాటు చేసింది.  


వాట్సాప్ సేవలను ఎలా ఉపయోగించాలి?

* ఈపీఎఫ్‌వోకు చెందిన మొత్తం 138 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ వాట్సప్ హెల్ప్ లైన్ సర్వీస్‌ను ప్రారంభించారు. పీఎఫ్‌ కాంట్రిబూటర్లు ఇప్పుడు వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 

* కస్టమర్లు ముందుగా  ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ www.epfo.gov.in ఓపెన్ చేయాలి. 

* వెబ్‌ పేజీలో ప్రాంతీయ కార్యాలయాల వాట్సాప్‌ నంబర్లు కనిపిస్తాయి. సంబంధిత రీజినల్ ఆఫీస్ వాట్సాప్ నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. 

* ఇప్పుడు చాట్‌లో ఆ నంబ‌ర్‌ను ఓపెన్ చేయండి. 

*  పీఎఫ్‌ కాంట్రిబూషన్, ఇతర వివరాలకు సంబంధించిన సమాచారాన్ని చాట్ లిస్ట్‌లో టైప్ చేసి సెండ్ చేయాలి. 

*  క్లెయిమ్ స్టేట‌స్ వంటి ఇత‌ర వివ‌రాల‌ను, ఇంకేమ‌న్నా స‌మ‌స్య‌లున్నా కూడా వాట్సాప్ చాట్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్ల‌చ్చు.

జన రంజకమైన వార్తలు