• తాజా వార్తలు

రాంగ్ పిన్‌తో మీ కార్డ్ బ్లాక్ అయిపోయిందా? అయితే ఈ గైడ్ మీకు అవ‌స‌రం

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇండియాలో ఏ బ్యాంక్  డెబిట్ కార్డ్ అయినా మూడు సార్లు రాంగ్ పిన్ ఎంట‌ర్ చేస్తే ఆ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. అరే కార్డు బ్లాక‌యిపోయింది చాలామంది టెన్ష‌న్ ప‌డిపోతుంటారు. ఒక‌వేళ రాంగ్ పిన్ కొట్ట‌డం వ‌ల్ల మీ కార్డ్ బ్లాక్ అయిపోతే ఏం చేయాలో తెలియ‌జెప్పే ఈ గైడ్ మీ అంద‌రి కోసం.. 

 

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల వ‌ర‌కు అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డులు మూడు సార్లు రాంగ్ పిన్ ఎంట‌ర్ చేస్తే బ్లాక్ అయిపోతాయి.  మీ డెబిట్ కార్డ్ వీసా, మాస్ట‌ర్‌, రూపే ఆఖ‌రికి అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ అయినా స‌రే ఇలాగే జ‌రుగుతుంది.  కార్డ్‌దారు కాకుండా దాన్ని ఎవ‌రైనా వేరే వ్య‌క్తులు వాడాల‌ని ప్ర‌య‌త్నిస్తే పిన్ నెంబ‌ర్ తెలియ‌క రెండు, మూడుసార్లు ట్రై చేస్తారు. అలాంట‌ప్పుడు వాళ్లు ఎక్కువ‌సార్లు ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అవ‌కుండా సెక్యూరిటీ దృష్టితో ఈ నిబంధ‌న‌ను ఆర్‌బీఐ అమ‌ల్లోకి తెచ్చింది.

24 గంట‌ల త‌ర్వాత యాక్టివేష‌న్ 
* సాధార‌ణంగా చాలా బ్యాంకులు మీ కార్డ్‌ను బ్లాక్ చేసినా 24 గంట‌ల త‌ర్వాత దాన్ని ఆటోమేటిగ్గా అన్‌బ్లాక్ చేస్తాయి. కాబ‌ట్టి 24 గంట‌లు వేచిచూడండి. త‌ర్వాత మ‌ళ్లీ స‌రైన పిన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తే కార్డ్ తిరిగి ప‌ని చేస్తుంది. 

* అయితే కొన్ని బ్యాంకులు మ‌నం సంప్ర‌దించేవర‌కు కార్డ్‌ను తిరిగి అన్‌బ్లాక్ చేయ‌వు. అలాంట‌ప్పుడు మీ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ లేదా ఏటీఎంలో మీ కార్డ్‌ను ఉప‌యోగించి మీ పిన్ నెంబ‌ర్‌ను రీసెట్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం మీ ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్ కొన్ని అడుగుతుంది. అవి క‌న్ఫ‌ర్మ్ అయితే కొత్త పిన్ జ‌న‌రేట్ అవుతుంది. 

* ఇప్పుడు బ్యాంకింగ్‌కు మొబైల్ యాప్స్ వ‌చ్చాయి కాబట్టి వాటిలో కూడా Generate New Pin అనే ఆప్ష‌న్ ఉప‌యోగించి పిన్ జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. 

* మీ బ్యాంక్‌కు వెళ్లి కొత్త పిన్ నెంబ‌ర్ కోసం అప్ల‌యి చేయ‌వ‌చ్చు లేదంటే క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేయాలి. క‌స్ట‌మ‌ర్ కేర్ చెబుతున్న సూచ‌న‌లు పాటిస్తూ మీ కొత్త పిన్ నెంబ‌ర్‌ను జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. అయితే మీ డేట్ ఆఫ్ బ‌ర్త్‌, మ‌ద‌ర్ నేమ్ లాంటి ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్ అడిగి క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నాకే కొత్త పిన్ జ‌న‌రేట్ చేస్తారు. 

* కొన్ని బ్యాంకులు కొత్త పిన్ నెంబ‌ర్‌ను రీజ‌న‌రేట్ చేసి వాటిని పోస్ట్ ద్వారా మీ అడ్ర‌స్‌కు పంపుతాయి. 

లేఖ అడిగితే..
కొన్ని బ్యాంకులు కొత్త పిన్ నెంబ‌ర్  కావాలంటే లెట‌ర్ ఇమ్మ‌ని అడుగుతాయి.  అలాంట‌ప్పుడు  ఇలా లేఖ రాయొచ్చు.
To,
The Bank Manager, 
BANK ,
BRANCH , PIN-CODE

Date: dd/mm/YYYY

Respected Sir/Mam,

Subject: Application for Issuing New ATM Card Against lost/Blocked ATM CARD

Through this I would like to inform you that I have lost my ATM Card (or forgotten my ATM Card) and would like to request you for blocking the previously issued ATM Card and issuing a new ATM Card for my a/c number ************ named to **********. Other details are as follows:
Name               :
A/c no.             :
Mobile No.      :
Address            :
Thanking you,

Yours faithfully
Your Name & Signature రాసి లెట‌ర్ సబ్మిట్ చేయాలి. 
 

జన రంజకమైన వార్తలు