• తాజా వార్తలు

జియో ఫోన్ల‌లో కాల్ డైవ‌ర్ట్‌, వెయిటింగ్‌ల‌ను యాక్టివేట్‌, డీయాక్టివేట్ చేయ‌డానికి గైడ్‌

జియో ఫోన్లలో కాల్ డైవర్ట్, కాల్ వెయిటింగ్ ఆప్ష‌న్లు కావాలా? ఇప్ప‌టికే ఈ ఆప్ష‌న్లున్నాయి. వాటిని ఎలా ఉప‌యోగించుకోవాలి?  కాల్ డైవ‌ర్ట్‌, కాల్ వెయిటింగ్‌ను యాక్టివేట్ చేసుకోవ‌డం ఎలా?  డీయాక్టివేట్ చేసుకోవ‌డం ఎలా అని తెలియ‌జెప్పే డిటెయిల్డ్ గైడ్ మీకోసం..

జియో కాల్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌కు షార్ట్ కోడ్స్‌ 

1. ఫోన్ నాట్‌రీచ‌బుల్ అయిన‌ప్పుడు కాల్ ఫార్వ‌ర్డ్ చేయ‌డానికి    *405*< మీ జియో నెంబ‌ర్‌>      

2. వేరే కాల్‌లో బిజీగా ఉన్న‌ప్పుడు కాల్ ఫార్వ‌ర్డ్ చేయ‌డానికి  *405*< మీ జియో నెంబ‌ర్‌>      

3. కాల్ ఆన్స‌ర్ చేయ‌న‌ప్పుడు ఫార్వ‌ర్డ్ చేయ‌డానికి  *403*< మీ జియో నెంబ‌ర్‌> 

4. ఇన్‌క‌మింగ్ కాల్స్ అన్న ఫార్వ‌ర్డ్ చేయ‌డానికి *401*< మీ జియో నెంబ‌ర్‌> 

5. కాల్ ఫార్వ‌ర్డ్‌ను డిజేబుల్ చేయ‌డానికి *410ను మీ మొబైల్లో డ‌య‌ల్ చేస్తే చాలు

నాన్ వోల్ట్ ఫోన్లు వాడుతున్న‌వారు, జియోఫై యూజ‌ర్లు Jio4GVoice యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ఐ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పై కోడ్స్ డ‌య‌ల్ చేస్తే కాల్ ఫార్వార్డ్ చేసుకోవ‌చ్చు.

మీ జియో కాల్స్‌ను వేరే నెంబ‌ర్‌కు డైవ‌ర్ట్ చేయాలంటే
మీ జియో నెంబ‌ర్‌కు వ‌చ్చే కాల్స్ అన్నింటినీ వొడాఫోన్‌, ఎయిర్‌టెల్, ఐడియా లాంటి ఇత‌ర నెంబ‌ర్ల‌కు డైవ‌ర్ట్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం మీ ఫోన్‌లో నుంచి *401*మీ ఇత‌ర కంపెనీల ఫోన్ నెంబ‌ర్ టైప్ చేసి కాల్ చేస్తే చాలు మీ జియో నెంబ‌ర్‌కి వ‌చ్చే ఇన్‌క‌మింగ్ కాల్స్ అన్నీ దానికి డైవ‌ర్ట్ అవుతాయి. 

జియో 4జీ వాయిస్ యాప్ ద్వారా
షార్ట్ కోడ్స్ ప‌ని చేయ‌క‌పోతే Jio4GVoice యాప్‌ను ప్లే స్టోర్ లేదా యాపిల్ యూజ‌ర్ల‌యితే ఐ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.

1. యాప్ ఓపెన్ చేసి ఫోన్ డ‌య‌ల్ సింబల్‌ను క్లిక్ చేయండి. 

2. దానిపైన ఉన్న త్రీ డాట్స్ మెనూను టాప్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. 

3. అక్క‌డ కాల్ సెట్టింగ్స్ ఆప్ష‌న్‌లోకి వెళ్లి కాల్ ఫార్వార్డ్‌, కాల్ డైవ‌ర్ట్ ఆప్ష‌న్లు వాడుకోవ‌చ్చు. 
 

జన రంజకమైన వార్తలు