• తాజా వార్తలు

ఫోన్ అన్‌లాక్ చేయ‌గానే దూసుకొచ్చే యాడ్స్‌ను రిమూవ్ చేయ‌డానికి ప‌క్కా గైడ్‌

మీరు ఫోన్ అన్‌లాక్ చేయ‌గానే కుప్ప‌లు తెప్ప‌లుగా యాడ్స్ వ‌చ్చి ప‌డుతున్నాయా? ఒక్కోసారి ఇది ఎంత ఇరిటేటింగ్ ఉంటుందంటే అస‌లు ఫోన్లో యాప్స్ అన్నీ అన్ఇన్‌స్టాల్ చేసి పారేయాల‌న్నంత కోపం వ‌స్తుంది. ఈ యాడ్స్‌ను రిమూవ్ చేయ‌డానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో మీకు తెలియ‌జెప్పే గైడ్ ఇదీ..

ఫోన్‌లో యాడ్స్ విప‌రీతంగా వ‌స్తున్నాయంటే దానిలో యాడ్‌వేర్ అనే అన్‌వాంటెడ్ యాప్ ఒక‌టి మీ ఫోన్‌లో ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ అయిపోయింద‌ని అర్ధం.  ప్లే స్టోర్ నుంచి ఏదైనా మాలిషియస్ యాప్ డౌన్లోడ్ చేస్తే  దాంతోపాటు మీకు తెలియకుండానే యాడ్ వేర్ యాప్ కూడా ఫోన్లో ఇన్ స్టాల్ అయిపోతుంది. ఫోన్ అన్ లాక్ చేసినప్పుడల్లా యాడ్స్ వచ్చిపడడానికి ప్రధాన కారణం ఇదే.  ఈ యాడ్స్ రాకుండా తొలగించాలంటే ముందుగా యాడ్స్ చూపించే యాప్స్ ఏమిటో గుర్తించాలి. ఇందుకు ఉన్న మార్గాలు

1. రీసెంట్ యాప్స్ చెక్ చేయడం
 ఫోన్ అన్ లాక్ చేయండి. మీకు యాడ్ కనపడగానే డివైస్‌లో రీసెంట్ యాప్స్ బటన్ టాప్ చేయండి.
రీసెంట్ యాప్స్ స్క్రీన్లోకి వెళ్లగానే మీకు యాడ్స్ చూపించిన యాప్ పేరుగానీ ఐకాన్ గానీ కనిపిస్తాయి. ఆ  పేరుగానీ ఐకాన్ గానీ గుర్తు పెట్టుకోండి.

 2.చెత్త యాప్స్‌ను హోం స్క్రీన్‌లోనే క‌నిపెట్ట‌డం 
ప్లే స్టోర్ నుంచి రీసెంట్‌గా యాప్ ఏదైనా డౌన్‌లోడ్ చేశారా?  ఇంట్లో పిల్ల‌లు ఫోన్‌లో ఏదైనా గేమ్ ఇన్‌స్టాల్  చేశారా?  ఒక‌వేళ మీకు గుర్తులేక‌పోతే హోం స్క్రీన్‌మీద‌గానీ, యాప్ డ్రాయ‌ర్‌లోగానీ ఈ యాప్ ఐకాన్ క‌చ్చితంగా క‌నిపిస్తుంది. ఈ యాప్స్‌ను ఒక్కొక్క‌టిగా అన్ఇన్‌స్టాల్ చేస్తూ చెక్ చేస్తే యాడ్స్ తెస్తున్న యాప్ ఏమిటో తెలిసిపోతుంది.

3. ఐకాన్ లేకున్నా యాప్‌ను చెక్ చేయ‌డం
కొన్ని యాప్స్ హోం స్క్రీన్ మీద‌గానీ, యాప్ డ్రాయ‌ర్‌లోగానీ క‌నిపించ‌కుండా దాక్కుంటాయి. అలాంటి వాటిని క‌నిపెట్టాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి  Appsను క్లిక్ చేయండి. అక్క‌డ మీకు ఆ యాప్ ఎలాంటి ఐకాన్ లేకుండా క‌నిపిస్తుంది. చాలా సంద‌ర్భాల్లో ఈ యాప్ ఇలాంటి చెత్త యాడ్స్ అన్నీ తీసుకురావ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. దాన్ని వెంట‌నే తొల‌గించేయండి.

4.ర‌న్నింగ్ స‌ర్వీస్‌ను చెక్ చేయడం
చెత్త యాప్స్‌ను గుర్తించడానికి మ‌రో మార్గం కూడా ఉంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ర‌న్నింగ్ స‌ర్వీసెస్ సెట్టింగ్స్‌లో చూస్తే ఇలాంటి యాప్స్‌ను గుర్తించ‌వ‌చ్చు. అయితే దీనికి డెవ‌లప‌ర్ ఆప్ష‌న్‌ను అనేబుల్ చేసుకోవాలి.  
*  Settings > System > About phoneలోకి వెళ్లి బిల్డ్ నెంబ‌ర్‌ను 7సార్లు టాప్ చేయాలి. వెంట‌నే డెవ‌ల‌ప‌ర్ ఆప్ష‌న్స్ అనేబుల్ అయినట్లు మీకు మెసేజ్ వ‌స్తుంది. 
* ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసి డెవ‌ల‌ప‌ర్ ఆప్ష‌న్స్‌లో ఉన్న Running servicesని టాప్ చేయాలి. ఇక్క‌డ మీకు మీ ఫోన్‌లో ర‌న్న‌వుతున్న యాప్స్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. మీకు తెలియ‌కుండా ఇన్‌స్టాల్ అయిన యాప్ ఏదైనా కనిపిస్తే వెంట‌నే దాన్ని అన్ ఇన్‌స్టాల్ చేయండి.

5. యాడ్ డిటెక్ట‌ర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి
పై ప‌ద్ధ‌తులేవీ వ‌ర్క‌వుట్ కాపోతే ప్లే స్టోర్ నుంచి AppBrain Ad Detector యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ యాడ్స్ ఉన్న యాప్స్ అన్నింట‌నీ వేరు చేసి చూపిస్తుంది. వీటిని కావాలంటే ఒక్కొక్క‌టిగా అన్ఇన్‌స్టాల్ చేస్తూ వెళ్లండి. ఎక్క‌డో ఓ చోట మీ స‌మ‌స్య‌కు పరిష్కారం దొరుకుతుంది.

గుర్తించాక ఏం చేయాలి?
ఏ యాప్ వ‌ల్ల మీ ఫోన్‌లోకి యాడ్స్ వ‌చ్చిప‌డుతున్నాయో గుర్తించాక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి ఈ కింది ప‌ద్ధ‌తి ఫాలో అవ్వండి.

1. మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Apps/Apps & notifications/App Managerలోకి ఎంట‌ర‌వండి.

2. యాడ్స్ విప‌రీతంగా పంపిస్తున్న యాప్ ఏమిటో మీరు ఇప్ప‌టికే గుర్తించారు కాబ‌ట్టి దాన్ని అన్ ఇన్‌స్టాల్ చేయండి. ఇప్పుడు ఫోన్ అన్‌లాక్ చేస్తుంటే యాడ్స్ వ‌స్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

3. ఇంకా యాడ్స్ వ‌స్తుంటే మీకు అనుమానం ఉన్న ప్ర‌తి యాప్‌ను ఇలాగే అన్ఇన్‌స్టాల్ చేసి త‌ర్వాత యాడ్స్ వ‌స్తున్నాయో లేదో చెక్ చేయండి.

4. కొన్ని యాప్స్ అన్ఇన్‌స్టాల్ బ‌ట‌న్‌ను చూపించ‌వు. అలాంటి వాటిని అన్ఇన్‌స్టాల్ చేయాలంటే మీ ఫోన్‌లో Settings ఓపెన్ చేసి Security ఆప్ష‌న్‌లోకి వెళ్లండి (కొన్ని ఫోన్ల‌లో Settings > Advanced Settingsలోకి వెళితే సెక్యూరిటీ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది). దీని కింద ఉన్న  Device Administrators లేదా  Device admin apps ఆప్ష‌న్ టాప్ చేయండి. ఐకాన్ లేకుండా లేదా అనుమానాస్పందంగా ఉన్న యాప్స్ ఏమైనా క‌నిపిస్తే వెంట‌నే దాన్ని డిజేబుల్ చేయండి. అది ఆటోమేటిగ్గా అన్ఇన్‌స్టాల్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు