ఎప్పుడైనా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ మార్చాల్సిన అవసరం వచ్చిందా? ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా వాట్సాప్‌ను ఏ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకున్నామో అదే నెంబర్ మీద కంటిన్యూ కావచ్చు. అలా కాకుండా పూర్తిగా మీ కొత్త నెంబర్‌నే వాట్సాప్‌లో ఉంచాలంటే పాత కాంటాక్ట్స్, చాట్స్, డేటా ఏమీ పోకుండా జస్ట్ మీ పాత నెంబర్ ప్లేస్‌లో కొత్త నెంబర్ యాడ్ చేయొచ్చు. ఇది ఇప్పటికే చాలా మంది చేసి ఉండొచ్చు. అయితే నెంబర్ మార్చాలనుకున్నా తెలియని వారూ ఉండొచ్చు. అందుకే ఈ ప్రాసెస్ గురించి ఈ సింపుల్ గైడ్‌లో చూడండి.
ఇదిగో ప్రొసీజర్
1. మీరు ప్రస్తుతం వాట్సాప్ వాడుతున్న స్మార్ట్ ఫోన్‌లోనే కొత్త సిమ్ వేయండి.
2. కొత్త సిమ్ యాక్టివ్ అయి సిగ్నల్ కనిపించగానే వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
3. వాట్సాప్‌లో పైనున్న 3 డాట్స్ మెనూను టాప్ చేసి సెట్టింగ్స్‌ను క్లిక్ చేయండి.
4. దానిలో అకౌంట్‌ను సెలెక్ట్ చేసి Change numberను టాప్ చేయండి
5. ఇప్పుడు మీరు మీ పాత ఫోన్ నెంబర్, కొత్త ఫోన్ నెంబర్ రెండూ ఎంటర్ చేసి నెక్స్ట్ నొక్కాలి.
6.మీరు వాట్సాప్ నెంబర్ మారుస్తున్న విషయాన్ని ఎవరికి నోటిఫై చేయాలని అని ఆప్షన్ అడుగుతుంది.
All Contactsను సెలెక్ట్ చేసే మీరు మీ వాట్సాప్ నెంబర్ మార్చినట్లు వాళ్లందరికీ మెసేజ్ వెళుతుంది.
Contacts I have chats with అనేది క్లిక్ చేస్తే మీరు చాట్ చేస్తున్నవారికి మాత్రమే మెసేజ్ పోతుంది.
Custom అనేది టాప్ చేస్తే మీరు ఎవరెవరికి ఆ మెసేజ్ వెళ్లాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు.
7. ఆప్షన్ సెలక్ట్ చేశాక వాట్సాప్ మీ ఫోన్ నెంబర్ మార్చినట్లు వాళ్లకు మెసేజ్ పంపుతుంది.
8. మీరు ఏ వాట్సాప్ గ్రూప్‌ల్లో సభ్యుడిగా ఉన్నారో ఆ గ్రూప్‌లన్నింటికీ మెసేజ్ వెళుతుంది. అక్కడున్న మీ పాత నెంబర్‌ను చెరిపేసి కొత్త నెంబర్‌ను ఆ ప్లేస్‌లో యాడ్ చేస్తుంది.
9. అంతే మీవాట్సాప్ కాంటాక్ట్స్, చాట్స్, గ్రూప్స్ వంటివేమీ పోకుండానే మీ వాట్సాప్ నెంబర్ మారిపోయినట్లే.