మీరు జాబ్ చేస్తున్నారా? మీకు పీఎఫ్ వస్తోందా? ప్రావిడెంట్ ఫండ్ గురించి తెలుసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ దగ్గర మొబైల్ తోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మీరు సులభంగా పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. ఇంతకుముందులాగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకునేందుకు పనివేళలను వృథా చేసుకుని హెచ్ఆర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే చాలా ఈజీగా మీకు పీఎఫ్ బ్యాలెన్స్ కు సంబంధించిన వివరాలు లభిస్తాయి. మీ మొబైల్ ఫోన్ నుంచి ఒక ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ తో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఎలాగో ఓ సారి చూద్దాం.
UAN ద్వారా ఆన్ లైన్లో చెక్ చేయడం....
1. ముందుగా మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను (UAN)యాక్టివేట్ చేసుకోండి.
2. మీ పీఎఫ్ అకౌంట్ కు UAN యాక్టివేట్ కావడానికి దాదాపు ఆరు గంటల సమయం పడుతుంది.
3.UAN నెంబర్ ను యాక్టివేట్ చేసిన తర్వాత మరో ఆరుగంటలు వేచి ఉండండి. ఎందుకంటే ఇది కొత్తగా యాక్టివేట్ చేసిన అకౌంట్ కు కనెక్ట్ చేయబడుతుంది.
4.ఇప్పుడు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ యొక్క మెంబర్ పాస్ బుక్ పేజీకి వెళ్లండి.
5. మీ UAN పిన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వండి.
6. ఇప్పుడు మీ ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎడమ వైపున మెంబర్ ఐడి ఉంటుంది. మీ పీఎఫ్ బ్యాలెన్స్ ను చెక్ చేయడానికి పాస్ బుక్ పై క్లిక్ చేయండి.
ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేయడం...
1. మొదట మీ UANనెంబర్ యాక్టివేట్ అయ్యిందా లేదా తెలుసుకోండి. యాక్టివేట్ కానట్లయితే....యాక్టివేట్ చేసుకునేందుకు ఆరుగంటల సమయం పడుతుంది.
2. UANకు యాక్టివేట్ చేసిన మీ మొబైల్ నెంబర్ నుంచి EFFOHO UANను 7738299899నెంబర్ కు ఎస్ఎంఎస్ పంపించండి.
3.వెంటనే మీ మొబైల్ కు EPFO నుంచి ఒక ఎస్ఎంస్ వస్తుంది.
4. ఇంగ్లీష్ లో కాకుండా ఇతర భాషల్లోనూ మీరు ఎస్ఎంఎస్ ను పొందవచ్చు. మీకు కావాల్సిన భాషలోని మొదటి మూడు అక్షరాలను యాడ్ చేయండి. ఉదాహరణకు తమిళంలో కావాలనుకుంటే EPFOHO UAN TAM అని టైప్ చేసి 7738299899 నెంబర్ కు పంపించండి.
5. తెలుగుతోపాటు బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాళీ, పంజాబీ భాషలకు సపోర్ట్ చేస్తుంది.
మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవాలంటే?
1. మీ UANనెంబర్ యాక్టివేట్ అయ్యిందా లేదా కన్ఫర్మ్ చేసుకోండి.
2. మీ UAN నెంబర్ కు బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్, పాన్ నెంబర్ లింక్ చేసి ఉన్నాయో లేదో తెలుసుకోండి.
3. ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత +911122901406 నెంబర్ కు మిస్ట్ కాల్ ఇవ్వండి. రెండుసార్లు రింగ్ అయిన తర్వాత అటోమెటిగ్గా డిస్ కనెక్ట్ అవుతుంది.
4. ఇప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ కు సంబంధించిన వివరాలు మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.