• తాజా వార్తలు

మీ జూమ్ అకౌంట్‌ను డిలీట్ చేయాల‌నుకుంటున్నారా.. ఇదిగో సింపుల్ గైడ్‌

లాక్‌డౌన్ టైమ్‌లో వీడియో కాన్ఫ‌రెన్సింగ్ కోసం ఇండియాలో అత్య‌ధిక మంది వాడిన యాప్ జూమ్‌. అయితే ఈ యాప్ సెక్యూరిటీ మీద విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ త‌మ మంత్రులు, ఉన్న‌తాధికారులు ఎవ‌రూ ఈ యాప్ వాడొద్ద‌ని ఆదేశాలు ఇచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా జూమ్ యాప్‌ను ఎందుకు నిషేధించ‌కూడ‌దో చెప్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఈ ప‌రిస్థితుల్లో చాలామంది జూమ్ యాప్‌లో తమ అకౌంట్‌ను ప‌ర్మినెంట్‌గా డిలీట్ చేసుకోవాల‌ని భావిస్తున్నారు. అలాంటి వారికోసం ఈ సింపుల్ గైడ్‌. 

వెబ్‌లో డిలీట్ చేయాలంటే.. 
మీ డెస్క్‌టాప్ లేదా ల్యాపీలో జూమ్ ఓపెన్ చేసి సైన్ ఇన్ అవ్వండి

* అకౌంట్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లి అకౌంట్ ప్రొఫైల్‌ను క్లిక్ చేయండి.

* దీనిలో టెర్మినేట్ మై అకౌంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఎస్ అనే బ‌ట‌న్ నొక్కి క‌న్ఫ‌ర్మ్ చేయండి.

* అంతే జూమ్ యాప్‌లో మీఅకౌంట్ ప‌ర్మినెంట్‌గా డిలీట్ అయిపోతుంది.

* త‌ర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌,ట్యాబ్‌ల్లో ఉన్న జూమ్ యాప్‌ను కూడా డిలీట్ చేయండి.

ఆండ్రాయిడ్‌, ఐఫోన్, ఐప్యాడ్స్‌లో జూమ్ అకౌంట్ డిలీట్ చేయడం ఎలా? 
* మీ స్మార్ట్ ఫోన్ లేదా ఐపాడ్‌లో జూమ్ అకౌంట్‌ను డిలీట్ చేయాలంటే ముందుగా మీరు ఆ జూమ్ అకౌంట్ నుంచి సైన్ అవుఏట్ అయి ఉండాలి

* మీరు ఆండ్రాయిడ్ యూజ‌ర్ అయితే ఫోన్‌లో సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్స్ అండ్ నోటిఫికేష‌న్స్‌ను టాప్ చేయండి.

* త‌ర్వాత సీ ఆల్ యాప్ అనే ఆప్ష‌న్ నొక్కండి. జూమ్ యాప్ క‌నిపిస్తే దాన్ని టాప్ చేసి డిలీట్ నొక్కండి. 

* మీరు ఐ ఫోన్ లేదా ఐ ప్యాడ్‌లో జూమ్ అకౌంట్ వాడుతుంటే జూమ్ యాప్ ఐకాన్‌ను లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ ఆప్షన్ నొక్కండి.  

జన రంజకమైన వార్తలు