• తాజా వార్తలు

అన్‌లిమిటెడ్ సైజ్ ఫైల్స్‌ను ఉచితంగా షేర్ చేయ‌డానికి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్‌

ఫైల్ షేర్ చేయాలంటే వాట్సాప్ వాడేస్తాం. కానీ దానిలో 30 ఎంబీ మించితే ఫైల్ షేర్ కాదు. షేర్ ఇట్ ఉందిగా అంటారా.. దాని రేడియ‌స్ 100 నుంచి 300 మీట‌ర్ల‌లోపే. ఆ ప‌రిధిలో ఉంటేనే మీ ఫైల్స్‌ను వేరేవాళ్ల‌తో షేర్ చేసుకోగల‌రు. మెయిల్ చేసినా కూడా  కొంత సైజ్ దాటితే ఫైల్ వెళ్ల‌దు. మ‌రి పెద్ద ఫైల్స్‌ను సెండ్ చేయ‌డానికి దారేంటి?  ఎంత పెద్ద ఫైల్ అయినా ఫ్రీగా షేర్ చేయ‌డానికి కూడా వెబ్‌సైట్లున్నాయి.అందులో రెండు బెస్ట్ సైట్ల గురించిన వివ‌రాలు మీకోసం.. 

జ‌స్ట్ బీమ్ ఇట్ (JustBeamIt)
జ‌స్ట్ బీమ్ ఇట్ వెబ్‌సైట్ ద్వారా ఎంత పెద్ద సైజ్ ఫైల్‌న‌యినా ఈజీగా  షేర్ చేసుకోవ‌చ్చు. దీనిలో చాలా వెసులుబాట్లున్నాయి. ఇది ఫ్రీ సైట్ మాత్ర‌మే కాదు. సైన్ అప్ చేసుకోవాల్సిన అవ‌స‌రం కూడా లేదు.  సెండ‌ర్‌కి, రిసీవ‌ర్‌కు మ‌ధ్య‌లో ఓ డైరెక్ట్ కనెక్ష‌న్ ఏర్ప‌డుతుంది. వెంట‌నే ఫైల్ షేర్ చేసుకోవ‌చ్చు.  ఒకేసారి మ‌ల్టిపుల్ ఫైల్స్ షేర్‌చేసుకోవ‌చ్చు.   అంతేకాదు మీరు పంపింది లేదా రిసీవ్ చేసుకున్న‌ప్పుడు ఆ డేటా స‌ర్వ‌ర్స్‌లో స్టోర‌వదు. కాబ‌ట్టి ర‌హ‌స్య స‌మాచారాన్ని కూడా ఎలాంటి సంకోచం లేకుండా  జ‌స్ట్ బీమ్ ఇట్ ద్వారా షేర్ చేసుకోవ‌చ్చు.

* మీరు షేర్ చేయ‌డానికి ఫైల్స్‌ను జ‌స్ట్ బీమ్ ఇట్ ఇంట‌ర్‌ఫేస్‌లో యాడ్ చేయ‌గానే ఓ తాత్కాలిక‌మైన లింక్ క్రియేట్ అవుతుంది. ఈ లింక్ 10 నిముషాలు మాత్ర‌మే ప‌నిచేస్తుంది. ఆలోగానే మీరు ఫైల్‌ను షేర్ చేయాల్సి ఉంటుంది.  

*అంతేకాదు  రిసీవ‌ర్ ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవర‌కు సెండ‌ర్ కూడా ఆ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసే ఉంచాలి. 

* రిసీవ‌ర్ ఫైల్ లింక్ మీద క్లిక్ చేయ‌గానే డైరెక్ట్‌గా అది డౌన్‌లోడ్ అవుతుంది.

స్మాష్ (Smash)
స్మాష్ మీ అన్‌లిమిటెడ్ ఫైల్స్‌ను షేర్ చేయ‌డానికి మ‌రో మంచి ఆప్ష‌న్‌?  అయితే దీనిలో డైరెక్ట్ క‌నెక్ష‌న్ ఉండ‌దు. ఇది ఫ‌స్ట్ మీ ఫైల్స్‌ను సైట్‌లోని స‌ర్వ‌ర్‌లోకి అప్‌లోడ్ చేస్తుంది. ఆ త‌ర్వాతే లింక్ జ‌న‌రేట్ చేసి ఫైల్‌ను షేర్ చేస్తుంది. 

* స్మాష్ ద్వారా ఫైల్ షేర్ చేసేముందు మీరు ఆ ఫైల్‌కు 1నుంచి వారం రోజుల‌పాటు వాలిడిటీ టైమ్ ఫిక్స్ చేసుకోవ‌చ్చు.

*   సెక్యూరిటీ కోసం ఆ ఫైల్స్‌కు పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకోవ‌చ్చు. 

* మీ ఈమెయిల్‌కి షేరింగ్ లింక్‌ను కూడా సెండ్ చేయొచ్చు.

* ఫైల్ సైజ్ 2 జీబీ ఉంటే కొంత స్లో అవుతుంది. అయినా మ‌రీ స్లో కాదు. టెస్ట్ ట్ర‌య‌ల్ చూసిన‌ప్పుడు 8జీబీ ఫైల్ 15 నుంచి 20 నిముషాల్లోపు సెండ్ అయింది.

జన రంజకమైన వార్తలు