• తాజా వార్తలు

జియో గ్రూప్ టాక్ కి స్టెప్ బై స్టెప్ గైడ్

రిలయన్స్ జియో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త యాప్ ను విడుదల చేసింది. జియో గ్రూప్ టాక్ పేరుతో ఈ యాప్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. జియో టాక్ యాప్ వన్ టచ్ మల్టీ పార్టీ కాలింగ్ అప్లికేషన్ పేరుతో జియో వినియోగదారుల కోసం డెవలప్ చేసింది రిలయన్స్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ట్రయల్ వెర్షన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సాయంతో గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు. ఒకేసారి పదిమందితో వాయిస్ కాల్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ యాప్ ను డెవలప్ చేశారు. 

జియో గ్రూప్ టాక్ ఎలా స్టార్ట్ చేయాలి?

రిలయన్స్ జియో గ్రూప్ టాక్ ను ప్రయత్నించాలనుకుంటే...జియో కస్టమర్లు యాప్ వోల్ట్ తో ఉన్న ఫోన్ అవసరం ఉంటుంది. అది వైఫై కనెక్షన్ తో పనిచేయదు. ఈ యాప్ పనిచేయాలంటే వోల్ట్ యాప్ ఆన్ చేసిన డివైజులో జియో సిమ్ తప్పనిసరిగా ఉండాలి. మీ డివైజులో యాప్ డౌన్ లోడ్ చేయగానే...లాగిన్ డిటైల్స్ ఉపయోగించి సైన్ ఇన్ చేయాలి. కొన్ని కండిషన్స్ అడుగుతుంది. ఇలా చేయడం ద్వారా మీరు మీ రిజిస్టర్డ్ నెంబర్ ను గుర్తించడానికి మీ ఫోన్ కు ఒక otpనెంబర్ వస్తుంది. ఈ otp నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు యాప్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు. మీరు యాప్ లాగిన్ చేయడానికి జియో 4జి ఇంటర్నెట్ కనెక్షన్ పొంది ఉండాలి. లేదంటే ఈ యాప్ పనిచేయదు. 

జియో గ్రూప్ టాక్ యాప్ తో మీరు మొదటిసారిగా కాన్ఫరెన్స్ కాల్ చేయడానికి...ట్యాబ్ కింద న్యూ కాన్ఫరెన్స్ కాల్ బటన్ ఉంటుంది. దానిపై నొక్కండి. ఇప్పుడు మీరు డయల్ చేయాలనుకున్న కాంటాక్ట్స్ ను సెలక్ట్ చేసుకోండి. కాన్ఫరెన్స్ కాల్స్ స్టార్ట్ చేయడానికి స్క్రీన్ కింది బాగానా కాల్ బటన్ను నొక్కాలి. రియలన్స్ జియో గ్రూప్ టాక్ కూడా మిమ్మల్ని మొదటి గ్రూప్ గా గుర్తించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 

జియో గ్రూప్ టాక్ వివరాలు...
జియో గ్రూప్ యాప్ ను ఉపయోగించని వారు కూడా...కాల్ చేసుకోవచ్చు. నాన్ జియో వినియోగదారులను కాన్ఫరెన్స్ కాల్స్ కు కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే జియో గ్రూప్ టాక్ యాప్ నాన్ జియో నెంబర్స్ కు కాల్స్ చేయలేరని తేలింది. ఈ యాప్ ఇంకా టెస్టింగ్ లోనే ఉంది కాబట్టి సాధ్యం కావచ్చు. 

కాగా రిలయన్స్ జియో గ్రూప్ టాక్ చాప్ లెక్చర్ మోడ్ గా పిలిచే కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొనేవారి కోసం ప్రత్యేక ఫీచర్ ను అందిస్తుంది. ఈ మోడ్ ఇతరులకు కూడా వర్తిస్తుంది. మేనేజ్ కాల్ స్క్రీన్ టాప్ రైట్ కార్నర్ లో ఉన్న మ్యూట్ బటన్ను నొక్కడం ద్వారా రిలయన్స్ జియో గ్రూప్ టాక్ యాప్ పై లెక్చర్ మోడ్ ను ఆన్ చేయవచ్చు. 

ఈ యాప్ ఇంకా బీటా దశలో ఉండటంతో...ఇప్పటికీ పనిచేయని కొన్ని ఫీచర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని షెడ్యూల్ గ్రూప్ కాల్ ఫీచర్ ఒకటి. ఈ యాప్ ద్వారా డయల్ చేయడానికి ముందు యూజర్ల కాంటాక్ట్స్ సేవ్ చేయాల్సి ఉంటుంది. 

మొత్తానికి రిలయన్స్ జియో గ్రూప్ టాక్ ప్రస్తుతం మార్కెట్లో మంచి యాప్ అని చెప్పవచ్చు. ఈ యాప్ ద్వారా ల్యాండ్ లైన్ నెంబర్స్ తో సహా...ఒకేసారి పది మందితో కనెక్ట్ కావడానికి కూడా అనుమతిస్తుంది. ఇది జియో నుంచి ఆకట్టుకునే ఆఫర్ అని చెప్పవచ్చు. 
 

జన రంజకమైన వార్తలు