• తాజా వార్తలు

ఫుడ్ డెలివ‌రీ యాప్స్ తో మాక్సిమం లాభం పొందడానికి డెలీషియస్ గైడ్

రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తినే రోజులు పోయాయి.  ప‌నిగ‌ట్టుకుని రెస్టారెంట్‌కు వెళ్ల‌డం, అక్క‌డ ఫుడ్ ఆర్డ‌రిచ్చి తిని వ‌చ్చేస‌రికి సిటీల్లో అయితే క‌నీసం రెండు మూడు గంట‌ల ప‌ని. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఉద్యోగాలుచేసేవారికి అంత టైమ్ స్పెండ్ చేయడం ఏ వీకెండో త‌ప్ప వీలుప‌డ‌ని వ్య‌వ‌హారం. ఇక ఇంటికి ఎవ‌రైనా స్నేహితులో, బంధువులో వ‌స్తే అప్ప‌టిక‌ప్పుడు వారికోసం ర‌కర‌కాలు వండ‌డానికి టైం లేక వాళ్ల‌ను రెస్టారెంట్ తీసుకెళ్ల‌డానికి కుద‌ర‌క‌పోతే ఇప్పుడు బోలెడు ఫుడ్ యాప్స్ ఉన్నాయి. ఇండియాలో ఫుడ్ యాప్స్ బిజినెస్ పెంచుకోవ‌డానికి ఒక‌దాన్ని మించి ఒక‌టి ఆఫ‌ర్ల‌తో పోటీపడుతున్నాయి. 

జొమాటో ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు
ఫుడ్ యాప్స్‌లో ఇప్పుడు మార్కెట్‌లో బెస్ట్ ఆఫ‌ర్లు ఇస్తున్న యాప్ జొమాటో (Zomato).  ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు 23 దేశాల్లో జొమాటో స‌ర్వీస్‌లున్నాయి.  జొమాటో యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మొద‌టి 5 ఆర్డ‌ర్లకు 50% డిస్కౌంట్ ఇస్తుంది. ( మ్యాగ్జిమం డిస్కౌంట్ 150 రూపాయ‌లు). 
* ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లో నుంచి జొమాటో యాప్ డౌన్‌లోడ్ చేయండి.
* రిజిస్ట‌ర్ చేసుకుని మీ ( ఇల్లు లేదా ఆఫీస్‌) అడ్ర‌స్ సేవ్ చేయండి. మ్యాప్‌లో మీ అడ్ర‌స్‌ను లొకేట్ చేయండి.
* ఇప్పుడు మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న రెస్టారెంట్స్‌, బేక‌రీలు, కాఫీషాప్‌లు, ఐస్‌క్రీమ్ పార్ల‌ర్స్ లిస్ట్ చూపిస్తుంది. వాటిలో నుంచి కావాల్సినది సెలెక్ట్ చేసుకోండి. మీకు న‌చ్చిన ఫుడ్ ఆర్డ‌ర్ చేయండి.
*ప్రోమో కోడ్ ద‌గ్గ‌ర NEW50 టైప్ చేసి అప్ల‌యి చేయండి. మీ ఆర్డ‌ర్ ఖ‌రీదులో స‌గం (మ్యాగ్జిమం 150 రూపాయ‌లు) డిస్కౌంట్ వ‌స్తుంది.
*పేటీఎంతో పే చేస్తే 15 శాతం వ‌రకు ఇన్‌స్టంట్ క్యాష్‌బాక్ కూడా వ‌స్తుంది. 
అయితే ఈ ఆఫ‌ర్ మే ఎండింగ్ వ‌ర‌కు మాత్ర‌మే ఉంది.  అలా అని నిరాశ‌ప‌డ‌క్క‌ర్లేదు. ఈ ఆఫ‌ర్ లేక‌పోయినా కూడా జొమాటోలో 40%డిస్కౌంట్ ఆఫ‌ర్ కూడా ఉంది.  ఫుడ్ ఒక్క‌టే కాదు ఫ్రూట్ జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు, బేక‌రీ ఐట‌మ్స్, స్వీట్స్ కూడా ఈ ఆఫ‌ర్ల కింద తెప్పించుకోవ‌చ్చు.

స్విగ్గీ (Swiggy)
ఇండియ‌న్ ఫుడ్  మార్కెట్‌లో టాప్ ప్లేస్‌ల్లో ఉన్న‌యాప్స్‌లో స్విగ్గీ (Swiggy) ఒక‌టి. కొత్త యూజ‌ర్ల‌కు ఫ‌స్ట్‌టైమ్ 33% డిస్కౌంట్ (మ్యాగ్జిమం 100 రూపాయ‌లు) డిస్కౌంట్ వ‌స్తుంది.  ఫ్రీ డెలివ‌రీ ల‌భిస్తుంది. 
సింగిల్ లంచ్.. స్విగ్గీ పాప్  
బ్యాచిల‌ర్స్‌గా ఉండి ఉద్యోగ‌, వ్యాపారాలు చేసేవాళ్లే టార్గెట్‌గా స్విగ్గీ .. స్విగ్గీ పాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. సింగిల్ మీల్స్‌ను 99 నుంచి 200 రూపాయ‌ల్లోపు ద‌గ్గ‌ర‌లో ఉన్న రెస్టారెంట్ల నుంచి తెచ్చి అందించ‌డం దీని టార్గెట్‌.  హైద‌రాబాద్‌, చైన్నైతోపాటు ఏడు న‌గ‌రాల్లో ఈ స‌ర్వీస్‌ను లాంచ్ చేసింది.

ఉబెర్ ఈట్స్ (Uber Eats)
క్యాబ్ సర్వీసులు న‌డిపే ఉబెర్ కూడా ఉబెర్ ఈట్స్ పేరిట ఫుడ్ డెలివ‌రీ స‌ర్వీసులు తీసుకొచ్చింది. దీనిలో కూడా ఫ‌స్ట్ ఆర్డ‌ర్‌కు ఆఫ‌ర్లు చాలా ఉన్నాయి. ఇవేకాదు కేఎఫ్‌సీ, పిజ్జాహ‌ట్‌, డొమినోస్ వంటి ఫుడ్ అవుట్‌లెట్స్ కూడా ఫ్రీ డెలివ‌రీలు ఇస్తున్నాయి. 
ఇదీ చిట్కా
ఈ ఫుడ్ డెలివ‌రీ యాప్స్ అన్నీ కొత్త యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తాయి. ఆఫ‌ర్లు కూడా వారికే ఎక్కువ ఉంటాయి. ఎలాగూ మీకు రెండు సిమ్‌లు ఉంటాయి.  ఒక సిమ్ మీద యాప్ డౌన్‌లోడ్ చేసి ఆ ఆఫ‌ర్లు వాడుకున్నాక యాప్ అన్ఇన్‌స్టాల్ చేసి మ‌ళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. ఈసారి రెండో సిమ్ నెంబ‌ర్‌తో రిజిస్ట‌ర్ అయి ఆర్డ‌ర్ చేయండి. అప్పుడు మీకు డ‌బుల్ ఆఫ‌ర్లు వ‌స్తాయి. అలాగే ఇంట్లో ఉన్న భార్య / భ‌ర్త లేదా పిల్ల‌ల మొబైల్ నుంచి కూడా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఎక్కువసార్లు ఆఫ‌ర్ వాడుకోవ‌చ్చు.


 

జన రంజకమైన వార్తలు