• తాజా వార్తలు

స్మార్ట్ ఫోన్ వాడకం వలన మీ కళ్లపై పడే ఒత్తిడి నివారణ గైడ్

నేటి టెక్ ప్రపంచం లో స్మార్ట్ ఫోన్ ల వాడకం ఎక్కువఅయిపోయింది. స్మార్ట్ ఫోన్ లు అనే కాదు కానీ కంప్యూటర్ లు , లాప్ టాప్ లు మరియు ట్యాబు ల ముందు కూడా యూజర్ లు గంటల తరబడీ కూర్చుంటున్నారు. వాడుక భాషలో చెప్పాలంటే వాటిని ముఖానికి కట్టుకుంటున్నారు. ఈ పోకడలు మనిషి యొక్క ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అని వైద్యులు మరియు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ డివైస్ ల డిస్ప్లే ముందు గంటల తరబడి కూర్చునే వారి కళ్ళు త్వరలోనే దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే దానినుండి వెలువడే కాంతి యొక్క ప్రభావం ముందుగా డైరెక్ట్ గా కళ్ళ పైనే పడుతుంది. దీనివలన మన కళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి.ఇక ఆ తర్వాత దీని ప్రభావం నిదానంగా మన మెదడుకూ, నరాలకూ మరియు నాడీ వ్యవస్థ కూ వ్యాపిస్తుంది. దీర్ఘ కాలం లో మరణం కూడా సంభవించవచ్చు. అయితే వీటి వాడకాన్ని తగ్గించుకోమనీ మరియు తగిన జాగ్రత్తలు తీసుకోమనీ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మనం ఎవరి మాటా వినం కదా! మనం సోషల్ మీడియా కు మరియు టెక్ కు బానిసలం అయ్యాము కాబట్టి టెక్నాలజీ ద్వారా నే మనం కళ్లపై ఒత్తిడిని నివారించే కొన్ని టూల్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.
ట్వి లైట్
మంచం మీద పడుకొని కూడా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే మన అలవాటును మనం ఎలాగూ మార్చుకోలేము. ఇలాంటి వారికోసమే ఈ యాప్. ఖచ్చితంగా ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా మన కళ్ళపై పడే ఒత్తిడిని నివారించవచ్చు. ముందుగా ఈ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇందులో బెడ్ రీడింగ్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ కలర్ టెంపరేచర్ ను, బ్రైట్ నెస్ యొక్క తీవ్రతను మనకు తగిన విధంగా తగ్గించుకోవచ్చు. అంతేగాక ఇది సూర్యోదయం, అస్తమయం, బెడ్ టైం లాగే నిద్ర లేచే సమయాలకు తగ్గట్లు ఆటోమాటిక్ గా అప్ డేట్ అవుతుంది. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ యాప్ ద్వారా మీరు ఫిలిప్స్ లాంటి స్మార్ట్ బుల్బ్ ల తీవ్రత ను కూడా తగ్గించవచ్చు. ఇది ఫ్రీ గానే లభిస్తుంది. కానీ రూ 15 లతో వచ్చే మరొక యాప్ లో మరిన్ని ఎక్కువ సెట్టింగ్ లు ఉంటాయి.
బ్లూ లైట్ ఫిల్టర్
మన కళ్లపై పడే ఒత్తిడికి ప్రధాన కారణం 460-480 nm ల రేంజ్ ఉండే బ్లూ లైట్ యొక్క నారో బ్యాండ్. మీ కళ్ళు ఈ లైట్ ఎక్కువగా ఎక్స్ పోజ్ అయితే మీ కళ్ళలో కాంతిని గ్రహించే మెలనోప్సిన్ అనే భాగం ఒత్తిడికి గురిఅవుతుంది. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ బ్లూ లైట్ ను మీ కళ్ళ సామర్థ్యానికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఐదు రకాల ఆప్షన్ లను అందిస్తుంది.ఇది కేవలం మీ స్మార్ట్ ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ ను మాత్రమే కంట్రోల్ చేస్తుంది. ఈ యాప్ ఆపరేట్ చేయాడానికి చాలా సులభంగా ఉంటుంది. కేవలం ఆన్ ఆఫ్ బటన్ ద్వారా దీనిని ఆపరేట్ చేయవచ్చు.
f. లక్స్
ఇది విండోస్, మాక్, ఐ ఫోన్ మరియు లినుక్స్ ఇలా అన్ని రకాల ఫ్లాట్ ఫాం లపైనా అందుబాటులో ఉంటుంది.ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా ఉంటుంది కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి.దీనిని మీ ఆండ్రాయిడ్ లో ఉపయోగించాలి అంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను రూట్ చేయాలి. రూటింగ్ చేయకుండా కూడా దీనిని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు, కానీ ఈ యాప్ ను పూర్తీ స్థాయి లో ఉపయోగించుకోవాలి అంటే మాత్రం రూటింగ్ చేయాల్సిందే. ఈ యాప్ స్మార్ట్ ఫోన్ యొక్క లైట్ లో ఉండే తీవ్రత ను మార్చకుండానే నిద్ర వస్తున్న భావనను మీకు కలిగిస్తుంది. రోజులో ఉండే సమయాన్ని బట్టి మీరు దీనిలో సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. అంటే ఈ యాప్ వలన మీ స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ సమయానికి తగ్గట్లు మారుతుంది.
ఈజీ ఐస్ ( easy eyes )
ఈ యాప్ ద్వారా కేవలం ఒక్క ట్యాప్ ఉపయోగించి మీరు మీ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. పేరుకుతగ్గట్లు ఇది ఆపరేట్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఒక్క ట్యాప్ ద్వారా ఇది హానికరమైన బ్లూ లైట్ యొక్క తీవ్రత ను తగ్గిస్తుంది. ఇది మీ రెటినా ను కాపాడుతుంది.
బ్లూ లైట్ ఫిల్టర్ బై ఐ కేర్
ఇది మరొక ఫిల్టర్ యాప్ మాత్రమే కాదు, అంతకు మించి మరెన్నో ఆఫర్ చేస్తుంది.ఇందులో మీరు మీ సౌకర్యానికి తగ్గట్లు సెట్టింగ్ లను మార్చుకోవచ్చు.ఇందులో ఉండే ఏడు రంగుల ఫిల్టర్ ల ద్వారా మీరు హానికరమైన బ్లూ లైట్ ను నిరోధించవచ్చు.ఒక్కసారి మీరు దీనిని కొనుగోలు చేశాక ఇది మీకు అనేక రకాల ఆప్షన్ లను అందిస్తుంది. నావిగేటర్ బార్ ను కూడా అందిస్తుంది. ఇది ఉపయోగించడానికి చాలా సింపుల్ గా ఉంటుంది.

జన రంజకమైన వార్తలు