మనకు క్రెడిట్, డెబిట్ కార్డుల గురించి తెలుసు.. ఆన్‌లైన్ కొనుగోళ్లు అయినా బయట షాపుల్లో కొనుగోళ్లు అయినా వెంటనే కార్డులు యూజ్ చేస్తాం. డబ్బులు కూడా తీసుకెళ్లడం మానేశాం ఇప్పుడు. అయితే ఇప్పుడు కార్డులు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదంట! ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఏదైనా కొనేటప్పుడు మన ఒరిజినల్ కార్డులు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎలా అంటారా? వర్చువల్ కార్డులు యూజ్ చేస్తే చాలు. అంటే ఒరిజినల్ కార్డులకు బదులుగా వాడే కార్డులన్నమాట. వీటి వల్ల ఆన్‌లైన్‌లో ఏదైనా మోసం జరిగినా మన కార్డులో ఇన్ఫర్మేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనల్ని ఎవరూ మోసం చేయలేరు. ప్రస్తుతం వర్చువల్ కార్డుల్లో మూడు బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి.. అవేంటంటే...
ప్రైవసీ
ఆన్‌లైన్‌లో పర్చేజ్‌లకు వాడే వర్చువల్ కార్డుల్లో ప్రైవసీ ఒకటి. దీని పేరుకు తగ్గట్టే మన కార్డుకు ప్రైవసీ ఇవ్వడంలో ఇది ముందు ఉంటుంది. మీ సమాచారాన్ని చాలా భద్రంగా ఉంచుతుంది. ఇది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. కేవలం ఒక మర్చెంట్ దగ్గరే దీన్ని వాడుకోవచ్చు. దీనిలో మనం ఎంత స్పెండ్ చేయాలో సెట్ చేసుకోవచ్చు. మీ కార్డుని పాజ్ చేసుకోవచ్చు.. రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఫ్లై సాయంతో క్రోమ్‌లో కార్డులను క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లకు అందుబాటులో ఉంటుంది.
బ్లర్
వర్చువల్ కార్డుల్లో ఇంకో ఆప్షన్ బ్లర్. మీ ఒరిజినల్ కార్డు నంబర్, వివరాలు చెప్పకుండానే ట్రాన్సాక్షన్లు చేయడానికి బ్లర్ బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా వెబ్‌సైట్లలో షాపింగ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రిపెయిడ్ గిఫ్ట్ కార్డులు కొనుక్కొని వాటిని తర్వాత యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా దీన్ని ఉపయోగించడం చాలా సులభం.
స్క్రిల్
ఆన్‌లైన్లో మనీ సెండ్ చేయడానికి స్క్రిల్ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడానికి కూడా స్క్రిల్ వర్చువల్ కార్డు మీకు ఎంతో సాయం చేస్తుంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి, పోకర్ ఆడటానికి కూడా ఇది యూజ్ అవుతుంది. మీ స్క్రీల్ అకౌంట్‌లో మనీ ఉంటే చాలు... మీ వర్చువల్ కార్డును ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికి మాస్టర్ కార్డు బాగా సపోర్టు చేస్తుంది.