ఫోన్ నంబర్లు, లేదా ఇంటి అడ్రెస్‌ల మాదిరిగా ఎవరిదైనా ఈమెయిల్ అడ్రెస్ కనిపెట్టడం అంత సులభం కాదు. ఎందుకంటే ఈమెయిల్ అడ్రెస్‌లకు ప్రత్యేకించి డేటాబేస్ ఉండదు. ఈ ఐడీలు ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటాయి. అయితే మీకు ఎవరి ఈమెయిల్ ఐడీనైనా సులభంగా కనిపెట్టేసే పద్ధతి ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ మెథడ్‌ని యూజ్ చేసి సులభంగా ఎవరి ఈమెయిల్ ఐడీలను అయినా ఎలా కనిపెట్టాలో చూద్దామా..
వెబ్‌సైట్‌ల ద్వారా..
ఈమెయిల్ అడ్రెస్‌లను కనిపెట్టడానికి వెబ్‌సైట్‌లు కూడా ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. గూగుల్‌ను ఇందుకు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మేరీ అనే ఆమె ఈమెయిల్ ఐడీని కనుక్కోవాలని అనుకుంటే.. వాళ్లకు సంబంధించిన వెబ్‌సైట్‌ను జోడించి మేరీని యాడ్ చేసి చూస్తే మెయిల్ ఐడీ దొరికే అవకాశాలుంటాయి. అయితే ఇది లిమిటెడ్ ఎక్సెస్ మాత్రమే. ఈ అడ్రెస్‌లను ఛేంజ్ చేసుకుంటూ వెళితే మీకు కావాల్సిన వారి అడ్రెస్‌లు దొరికే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాక వోలియానోర్‌బెర్ట్ లాంటి ఈమెయిల్ స్క్రాపర్ ద్వారా మనకు కావాల్సిన ఈమెయిల్ ఐడీలను మనం ట్రెస్ చేయచ్చు. ఇందుకోసం మీరు మీరు వెతికే పర్సన్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్‌లతో పాటు వాళ్ల సైట్ యుఆర్ఎల్‌ను ఎంటర్ చేస్తే పోతుంది. వోలియానోర్‌బెర్ట్ ద్వారా 50 ఉచిత సెర్చ్‌లు చేసుకోవచ్చు.
పీఐపీఎల్ ద్వారా
మనకు కావాల్సిన ఈమెయిల్ అడ్రెస్‌లు వెతకడానికి పీఐపీఎల్ మీకు యూజ్ అవుతుంది. దీన్ని పీపుల్స్ సెర్చ్ టూల్ అంటారు. దీనికి మీరు మీరు వెతికే పర్సన్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ల సోషల్ మీడియా ప్రొఫైల్‌ను ఎంటర్ చేస్తే చాలు వాళ్లకు సంబంధించిన ఈమెయిల్‌ను కూడా మీకు వెతికి తీసుకొచ్చి ఇవ్వడం పీపుల్స్ సెర్చ్ టూల్ ప్రత్యేకత. అయితే వాళ్లు ఎప్పుడైనా పబ్లిక్‌గా తమ ఈమెయిల్ ఐడీ పోస్ట్ చేసి ఉండాలి. ఈ ఆప్షన్‌తో పాటు గెస్ చేయడం ద్వారా కూడా మనం ఈమెయిల్ అడ్రెస్‌లను ట్రేస్ చేయచ్చు. మనం ఎప్పుడు చేసేది ఇదే అయినా దీనిలో కొన్ని టిప్స్ ద్వారా సులభంగా కనిపెట్టొచ్చు. మనకు వాళ్ల యూజర్ ఐడీ తెలిసి ఉంటే దానికి .కామ్, లేదా జీమెయిల్.కామ్, ఔట్‌లుక్.కామ్ లాంటివి యాడ్ చేయడం ద్వారా వారి మెయిల్స్‌ను కనిపెట్టొచ్చు.