ఆండ్రాయిడ్‌లో యాప్స్ వాడకం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. అవసరం లేకపోయినా చాలా యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం వదిలేయడం మామూలు విషయం అయిపోయింది. మరి అవసరం లేని యాప్‌లను ఫోన్లో కనిపించకుండా చేయాలంటే మనం ఏం చేస్తాం వెంటనే వాటిని డిలీట్ చేస్తాం. అయితే డిలీట్ లేదా డిజేబుల్ చేయకుండా హైడ్ చేసి అవసరమైనప్పుడు వాడుకునేలా ఉంటే బాగుంటుంది కదా.. మరి ఇలా యాప్స్‌ని హైడ్ చేయడం ఎలాగో చూద్దామా..
స్టాక్ లాంచర్
శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మి లాంటి ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గానే యాప్స్‌ను హైడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది.అదే స్టాక్ లాంచర్. శాంసంగ్‌లో అయితే హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ట్యాప్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్క్రోల్ డౌన్ చేసి హైడ్ యాప్స్ మీద క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏ యాప్‌ని హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్‌ను ట్యాప్ చేసి అప్లై అని క్లిక్ చేస్తే చాలు. ఆ యాప్ హైడ్ అయిపోతుంది. షియోమి, వన్‌ప్లస్ ఫోన్లలో సైతం ఇలాగే ఇన్‌బిల్ట్ స్టాక్ లాంచర్ ద్వారా యాప్స్ హైడ్ చేసుకోవచ్చు.
థర్డ్ పార్టీ లాంచర్లు
అయితే మీ ఫోన్లో యాప్స్‌ను హైడ్ చేసే లాంచర్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి పోకో, ఇవె లాంటి థర్డ్ పార్టీ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని యూజ్ చేసుకొని యాప్స్‌ని హైడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం థర్డ్‌పార్టీ సర్వీసులను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇందులో కొన్ని డేంజర్ సర్వీసులు ఉండే అవకాశం ఉంది. రేటింగ్‌ను బట్టి డౌన్‌లోడ్ చేసుకుంటే మంచిది.
యాప్ పేరు, ఐకాన్‌ను మార్చడం
మీ ఫోన్లలో ఉండే యాప్‌ల పేర్లను ఐకాన్‌ను మార్చడం మరో పద్ధతి. ఇందుకోసం లాంచర్‌ని ఉపయోగించి మార్చాలి. నోవా లాంచర్ ఇందుకు ఉపయోగపడుతుంది. మిగిలిన లాంచర్ల మాదిరే దీన్ని డౌన్‌లోడ్ చేసి ఆ తర్వాత యాప్స్‌ని ట్యాప్ చేయడం ద్వారా వాటి పేరు, ఐకాన్‌ను మార్చే అవకాశం ఉంది. ఫోల్డర్ రినేమ్ చేయడం, మల్టీపుల్ యూజర్స్ ఫీచర్‌ని ఉపయోగించడం లాంటి వాటి ద్వారా మనం యాప్స్‌ని హైడ్ చేయచ్చు.