• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో మీ సొంత డిజిట‌ల్ సిగ్నేచ‌ర్‌ని త‌యారు చేయ‌డానికి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

మ‌నం మెయిల్ పంపుతూ ఉంటాయి.. కింద మ‌న పేరు పెట్టి పంపిస్తాం... ప్ర‌తిసారి మెయిల్ పంపిన‌ప్పుడు ఇలా మ‌న పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మ‌న మ‌న మెయిల్ పంపేట‌ప్పుడు ఆటోమెటిగ్గా మ‌న పేరు (సంత‌కం) మ‌న మెయిల్ అడుగు భాగంలో వ‌చ్చేస్తే.. చాలా బాగుంటుంది క‌దా! దీన్నే డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ అంటారు. ఈ విష‌యం త‌రుచూ ఈమెయిల్ వాడే వాళ్ల‌కు తెలుస్తుంది. అస‌లు మెయిల్ అనే కాదు ఆన్‌లైన్‌లో మ‌న‌కు డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ చాలా విష‌యాల్లో అవ‌స‌రం అవుతుంది. అయితే చాలామందికి ఈ డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ గురించి తెలియ‌దు. మ‌రి ఆన్‌లైన్‌లో మ‌న సొంత డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ కావాలంటే ఏం చేయాలి?

డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ కావాలంటే ముందుగా మ‌నం ఫాంట్‌, స్ట‌యిల్‌, సైజు, క‌ల‌ర్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత మాత్ర‌మే మీరు సిగ్నేచ‌ర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మీరు మౌస్ లేదా ట‌చ్ పాడ్ సాయంతో మీకు మీరే సొంతంగా సిగ్నేచ‌ర్‌ను కూడా డ్రా చేసుకోవ‌చ్చు. అయితే మీరు కోరుకున్న‌ట్లు ఔట్‌పుట్ రాక‌పోవ‌చ్చు. అందుకే ఆన్‌లైన్‌లో సిగ్నేచ‌ర్ స్ట‌యిల్ కోసం చాలా ఫాంట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మ‌నం అప్ప‌టిక‌ప్పుడు లైవ్ సిగ్నేచ‌ర్ కూడా సృష్టించుకోవచ్చు లేదా ప‌ర్మినెంట్‌గా ఒక సిగ్నేచ‌ర్‌ను సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. అందుకు కొన్ని మార్గాలున్నాయి.

డాక్ స్కెచ్‌
ఆన్‌లైన్‌లో మ‌న డిజిటల్ సిగ్నేచ‌ర్‌ని క్రియేట్ చేయ‌డానికి డాక్ స్కెట్‌ను సిగ్నేచ‌ర్ మేక‌ర్‌ను యూజ్ చేసుకోవ‌చ్చు. మీకు న‌చ్చిన స్ట‌యిల్‌లో సిగ్న‌చ‌ర్‌లు ఇవ్వ‌డం ఈ సైట్ ప్ర‌త్యేక‌త‌. దీనిలో మీరు ఫాంట్ మార్చుకోవ‌చ్చు... రంగులు మార్చుకోవ‌చ్చు. అంతేకాదు మీ సొంతంగా కూడా సిగ్నేచ‌ర్ డ్రా చేసుకోవ‌చ్చు. అందుకోసం ఇందులో డ్రా సిగ్నేచ‌ర్ అనే ఆప్ష‌న్ ఉంది. 

మై లైవ్ సిగ్నేచ‌ర్‌
మై లైవ్ సిగ్నేచ‌ర్ అనేది మ‌రో ఆన్‌లైన్ సిగ్నేచ‌ర్ మేక‌ర్‌. సిగ్నేచ‌ర్ డిజైన్స్ చాలా భిన్నంగా ఉంటాయి ఈ సైట్‌లో.. ఈ సైట్ ఓపెన్ చేసి మీ పేరు ఎంట‌ర్ చేయాలి. మీకు న‌చ్చిన ఫాంట్ స్ట‌యిల్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ త‌ర్వాత మీకు న‌చ్చిన సిగ్నేచ‌ర్ యాంగిల్ ఎంచుకోవాలి. క‌ల‌ర్ ఎంచుకోవాలి. ఆ త‌ర్వాత పీఎన్‌జీ ఫార్మాట్‌లో సిగ్నేచ‌ర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మొబైల్ ఫిష్‌.కామ్‌
ఇది కూడా ఆన్‌లైన్లో సిగ్నేచ‌ర్ మేకింగ్ చేసుకునే సైట్‌. మీ సిగ్నేచ‌ర్‌ని క‌స్ట‌మైజ్ చేసుకోవ‌డానికి ఈ సైట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. యానిమేటెడ్‌, స్మూత్ లుకింగ్‌, పిక్స‌ల్స్ లుక్ ఇలా భిన్న ర‌కాల్లో లుక్‌ని క్రియేట్ చేయ‌డం మొబైల్‌ఫిష్‌.కామ్ ప్ర‌త్యేక‌త‌. మీ సొంతంగా కూడా సిగ్నేచ‌ర్ డ్రా చేసుకునే ఆప్ష‌న్ దీనిలో ఉంది. ఆన్‌లైన్‌సిగ్న‌చ‌ర్‌.కామ్ అనే మ‌రో సైట్ కూడా డిజిట‌ల్ సిగ్నేచ‌ర్‌ను క్రియేట్ చేయ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

జన రంజకమైన వార్తలు