• తాజా వార్తలు

ఉచితంగా రెజ్యూమె చేసిపెట్టే స‌ర్వీసుల‌కు ఒన్ అండ్ ఓన్లీ గైడ్‌

ఏదైనా ఆఫీసులో మిమ్మ‌ల్ని ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తికి మీపై ఒక స‌ద‌భిప్రాయం క‌ల్పించేదే రెజ్యూమె. అందుకే అది చ‌క్క‌గా త‌యారుచేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఆ మేర‌కు మీ విద్యార్హ‌త‌లు, నైపుణ్యాలు, అనుభ‌వం, ఇత‌ర వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఓ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో కూర్చ‌డం ఎంతో ముఖ్యం. మ‌న‌కు ఉచితంగా ఈ ప‌ని చేసిపెట్టే వెబ్‌సైట్లు చాలానే ఉన్నా వాటిలో ఓ ఐదు ఉత్త‌మ‌మైన ఆన్‌లైన్ రెజ్యూమె మేక‌ర్లు మీకోసం ఎంపిక చేయ‌బడ్డాయి. అవేమిటో చూద్దామా:
RESUME.COM
రెజ్యూమె.కామ్ (Resume.com)లో 20కిపైగా రెజ్యూమె టెంప్లేట్స్ ఉన్నాయి. ఈ సైట్‌లో మీరు ఉచిత అకౌంట్ క్రియేట్ చేసుకుని వాటిని వాడుకోవ‌చ్చు. ఎలాంటి ప్రొఫెష‌న‌ల్ రెజ్యూమె త‌యారీకైనా ఇవి చక్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మీరు సుల‌భంగా రెజ్యూమె రూపొందించుకుని TXT, DOC, PDF, DOCX, XML  లేదా మ‌రేదైనా స‌పోర్టెడ్ ఫార్మాట్ల‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ త‌ర్వాత వెబ్‌సైట్ స‌ద‌రు వివ‌రాల‌న్నిటినీ స్వీక‌రించి, నిర్దేశిత ఫీల్డ్స్‌లో వాటిని నింపుతుంది. ఏదైనా స‌రిగా లేక‌పోతే ఆ ఫీల్డ్‌ను మీరు ఎడిట్ చేసుకునే స‌దుపాయం కూడా ఉంది. ఈ టెంప్లేట్స్‌లో స‌మ్మ‌రీ, ఎంప్లాయ్‌మెంట్ హిస్ట‌రీ, విద్యార్హ‌త‌లు, వృత్తి నైపుణ్యాలు, మీకొచ్చిన భాష‌లు త‌దిత‌ర సెక్ష‌న్లుంటాయి. ఆయా సెక్ష‌న్ల‌ను మీకు కావల‌సిన క్ర‌మంలో స‌ర్దుబాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందులో రెజ్యూమె క‌వ‌ర్‌ను ప్ర‌త్యేకంగా క్రియేట్ చేసుకోగ‌ల సౌల‌భ్యం కూడా ఉండ‌టం ప్ర‌యోజ‌న‌క‌రం. మీ రెజ్యూమె జ‌న‌రేట్ అయ్యాక ప్రివ్యూ చూసుకోగ‌ల‌గ‌డం Resume.comలో మ‌రో మంచి ఫీచ‌ర్. ఆ ప్రివ్యూ మీకు సంతృప్తి క‌లిగిస్తే మీ రెజ్యూమెను కంప్యూట‌ర్‌లోకి DOCX, RTF, PDF ఫార్మాట్ల‌లోనే కాకుండా సాదా టెక్స్ట్ ఫైల్ రూపంలోనైనా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అనేక ఇత‌ర ఆన్‌లైన్ రెజ్యూమె మేక‌ర్ల‌లో లేని అత్యుత్త‌మ ఫీచ‌ర్ ఇది. మీ LinkedIn అకౌంట్‌తో క‌నెక్ట్ కాగ‌లిగే మ‌రో అరుదైన ఫీచ‌ర్ కూడా ఇందులో ఉంది.
CANVA
క‌ణ్వ (Canva) ఒక గ్రాఫిక్ డిజైన్ టూల్ వెబ్‌సైట్‌. దీనిలో మీరు ఫేస్‌బుక్ క‌వ‌ర్లు, పోస్ట‌ర్లు, లోగోలు, ఇన్ఫోగ్రాఫిక్స్‌, బ్రోష‌ర్లు, బిజినెస్ కార్డులు, ఫ్ల‌య‌ర్స్ వంటివి రూపొందించుకోవ‌చ్చు. వీట‌న్నిటితోపాటు రెజ్యూమె కూడా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రెజ్యూమె పేజీని https://www.canva.com/create/resumes/లో యాక్సెస్ చేయొచ్చు. దీని సాయంతో మీరు ప్రొఫెష‌న‌ల్‌, ఇన్ఫోగ్రాఫిక్‌,  ఫొటో,  కార్పొరేట్‌,  మినిమ‌లిస్ట్‌,  క‌ల‌ర్‌ఫుల్‌,  మోడ్ర‌న్ లేదా ఈ వెబ్‌సైట్ సపోర్ట్ చేసే వివిధ ర‌కాల రెజ్యూమెల‌ను కూడా రూపొందించుకోవ‌చ్చు. ఈ ఉచిత ప్లాన్‌లో మీకు ఉపయోగ‌ప‌డే చాలా ఫీచర్లున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు భిన్న‌మైన ఫాంట్లు, టెక్స్ట్ సైజ్‌, అక్ష‌రాల మ‌ధ్య స్పేస్‌, లైన్ హైట్‌,  బోల్డ్/ఇటాలిక్ ఫార్మాటింగ్ వ‌గైరాల‌ను ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. నిర్దిష్ట రెజ్యూమె ర‌కాల‌కు త‌గిన విభిన్న టెంప్లేట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో ఏ ఉచిత టెంప్లేట్‌నైనా మీరు యాక్సెస్ చేయొచ్చు. అంతేకాకుండా రెజ్యూమె బ్యాక్‌గ్రౌండ్ క‌ల‌ర్ మార్చ‌వ‌చ్చు... మ‌రికొన్ని పేజీల‌ను జోడించ‌వ‌చ్చు... గ్రిడ్‌,  ఫ్రేమ్స్‌,  షేప్స్‌,  లైన్స్ వంటివి ఇచ్చుకోవ‌చ్చు. మీ రెజ్యూమె జ‌న‌రేట్ అయ్యాక దాన్ని ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌ లేదా ఈమెయిల్ లింక్‌ద్వారా ఎవ‌రితోనైనా షేర్ చేసుకోవ‌చ్చు. ఇదే వెబ్‌సైట్‌లో మీ రెజ్యూమెను అంద‌రికీ అందుబాటులో ఉంచ‌వచ్చు లేదా మీ కంప్యూట‌ర్‌లోకి PDF, PNG, JPG ఇమేజ్ రూపంలోనూ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
CREDDLE
ఆన్‌లైన్ రెజ్యూమె మేక‌ర్ల‌లో అనేకానేక ఫీచ‌ర్లుగ‌ల‌ది ‘క్రెడిల్‌.’ ఇందులో ముందుగానే సిద్ధంచేసి ఉంచిన సెక్ష‌న్లు మీ రెజ్యూమె త‌యారీలో సాయ‌ప‌డ‌తాయి. మీరు బేసిక్ ఇన్‌‌ర్మేష‌న్‌, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్‌, యాక్టివిటీస్‌, అవార్డ్స్‌, స‌మ్మ‌రీ, స్కిల్స్‌, ప్రాజెక్ట్స్ త‌దిత‌ర వివ‌రాల‌ను ముంద‌స్తుగా నిర్దేశించిన సెక్ష‌న్ల‌లో నింప‌వ‌చ్చు. మ‌న‌కిష్ట‌మైన సెక్ష‌న్‌ను యాడ్ చేసుకునే ఫీచ‌ర్ కూడా ఇందులో ఉంది. ఇది బీటా వెర్ష‌న్ అయిన‌ప్ప‌టికీ చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ స‌మాచార‌మంతా నింపిన త‌ర్వాత కొన్ని ఆప్ష‌న్ల‌ను క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ప్రైమ‌రీ, సెకండ‌రీ క‌ల‌ర్స్‌, ఫాంట్స్‌తోపాటు రెజ్యూమె లే-అవుట్ (కాల‌మ్స్‌, పేప‌ర్ సైజ్‌, టాప్ బ్యాక్‌గ్రౌండ్ క‌ల‌ర్‌స‌హా), ఫాంట్ సైజ్‌, డేట్ ఫార్మాట్ వ‌గైరాల‌న్నిటినీ మార్చుకోవ‌చ్చు. మీకు కావాల్సిన మార్పులు చేసుకున్న తర్వాత ప్రివ్యూ చూసుకుని చివ‌ర‌గా ప్రింట్ తీసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి ఇందులో సొంత PDF ఎక్స్‌పోర్ట్ ఫీచ‌ర్ లేనందువ‌ల్ల (భ‌విష్య‌త్తులో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది) మీ రెజ్యూమె ప్రింట్ చేసుకునే స‌మ‌యంలో ప్రింట‌ర్ టైప్‌ను (క్రోమ్ బ్రౌజ‌ర్‌లో) “Save as PDF”గా సెట్‌చేసి, డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
RESUMEMAKER.ONLINE
ఇది (ResumeMaker.Online) ఒక WYSIWYG (What You See Is What You Get)  రెజ్యూమె మేక‌ర్ వెబ్‌సైట్‌. ఇందులో ఓ మంచి విష‌యం సైన్ అప్ ప్రాసెస్ లేక‌పోవ‌డం. మీరు చేయాల్సింద‌ల్లా.. హోమ్ పేజీ ఓపెన్ చేసి, మీ రెజ్యూమె సృష్టించుకోవ‌డం కోసం అందులో వివ‌రాలు నింప‌డ‌మే. ఇందులో విభిన్న టెంప్లేట్స్ ఏవీ ఉండ‌వుగానీ, డిఫాల్ట్ టెంప్లేట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందులోనూ మీరు కొన్ని మార్పులు చేసుకునే వీలుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు క‌ల‌ర్ ప్యాలెట్‌ను, అందుబాటులోగ‌ల‌ ఫాంట్ స్ట‌యిల్స్‌ను వాడుకోవ‌చ్చు. టెక్స్ట్ సైజ్‌ను మార్చుకోవ‌డంతోపాటు పేప‌ర్ సైజ్ (ఎ4, లెట‌ర్‌ లేదా లీగ‌ల్‌)ను సెట్ చేసుకోవ‌చ్చు.  కొన్ని సెక్ష‌న్ల‌తోపాటు వ్య‌క్తిగ‌త వివ‌రాల సెక్ష‌న్లోని పుట్టిన తేదీ, చిరునామా, జాతీయ‌త,  స్కైప్‌, లింక్‌డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్‌,  ఫేస్‌బుక్‌,  ట్విట్ట‌ర్ డీటెయిల్స్‌ వంటివాటిని SHOW లేదా HIDE చేయొచ్చు. మీ వివ‌రాల‌ను ADD లేదా EDIT చేసుకునే క్ర‌మంలో ఏ ద‌శ‌లోనైనా రెజ్యూమె ప్రివ్యూను చూసుకోవ‌చ్చు. చివ‌ర‌గా మీ రెజ్యూమెను PDF  ఫైల్‌గా మీ కంప్యూట‌ర్‌లో సేవ్ చేసుకోవ‌చ్చు. మీరు చెత్తాచెదారం లేని, అంద‌మైన రెజ్యూమె వేగంగా సృష్టించుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌ను ఎంచుకోవ‌డం అత్యుత్త‌మం.
CV MAKER
ప్రొఫెష‌న‌ల్ రెజ్యూమె సృష్టికి ‘CV Maker’ ఒక మంచి వెబ్‌సైట్‌. ఇందులో ఆరు ప్రాథ‌మిక‌ టెంప్లేట్స్ మాత్‌‌మే అందుబాటులో ఉన్నా మంచి రెజ్యూమె పొంద‌టానికి అవి అనువైన‌వే. మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను నింప‌డానికి ముంద‌స్తు సిద్ధ‌ప‌ర‌చిన సెక్ష‌న్ల‌ను వాడుకోవ‌చ్చు. అలాగే మీకు కావాల్సిన సెక్ష‌న్‌ను జోడించి వివ‌రాలు నింప‌వ‌చ్చు. మ‌న వివ‌రాల‌ను నింప‌డానికి, ఎడిట్ చేయ‌డానికి ఇందులో మంచి టెక్స్ట్ ఎడిట‌ర్ టూల్ కూడా ఉంది. రెజ్యూమె త‌యారీ ప్ర‌క్రియ పూర్త‌య్యాక దాన్ని PDF, TXT, HTML  ఫైల్ రూపంలో సేవ్‌చేసి,  డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే, HTML ఫైల్ మాత్రం వాట‌ర్‌మార్క్‌తో ఉంటుందని గ‌మ‌నించండి. ఇక సైన్ అప్‌తో నిమిత్తం లేకుండా ఈ వెబ్‌సైట్‌లో మీరు రెజ్యూమె క్రియేట్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. మీరు ఉచిత ఖాతా క్రియేట్ చేసుకుంటే ఒక‌టిక‌న్నా ఎక్కువ సంఖ్య‌లో రెజ్యూమె త‌యారుచేసుకుని కావాల్సిన‌పుడు వాటిని ఎడిట్ చేసుకునే స‌దుపాయం ఉంది. క్రోమ్ బ్రౌజ‌ర్ కోసం ఈ సైట్ అందిస్తున్న‌ ఎక్స్‌టెన్ష‌న్ కూడా ఉంది... ఓ సారి ప్ర‌య‌త్నించి చూడండి!

జన రంజకమైన వార్తలు