• తాజా వార్తలు

 వీడియోగేమ్స్ కొనాల‌నుకుంటున్నారా? అయితే ఈ బ‌యింగ్ గైడ్ మీకోస‌మే..

ఆన్‌లైన్ ఆట‌లు వ‌చ్చినా, ఇంట‌ర్నెట్ మ‌న‌కు బోల్డంత వినోదాన్నిస్తున్నా ఇప్ప‌టికీ వీడియోగేమ్ క్రేజ్ వీడియోగేమ్‌దే. చాలా మంది ప్ర‌ముఖులు కూడా మార్కెట్లోకి కొత్త వీడియోగేమ్ ఏది వ‌స్తే అది కొని ఆడేసి రిలాక్స్ అయిపోతుంటారు. వీడియో గేమ్, డీవీడీ లేదా మ‌రే ఇత‌ర వినోద ప‌రిక‌రాల‌ను కొన‌డమైనా ప్ర‌క్రియ ఒక‌టే. కానీ వీటి మ‌ధ్య ఓ తేడా ఉంది. సినిమానో, టీవీ షోల‌కు సంబంధించిన డీవీడీ కొనాల‌నుకుంటే అది ఎలా ఉందో తెలుసుకోవ‌డం చాలా ఈజీ.   ట్రైలర్స్ లేదా టీజర్లతో ఆ సినిమా అవుట్‌లైన్ ఏమిటో తెలిసిపోతుంది. ఏదైనా ఛాన‌ల్‌లో టెలికాస్ట్ అయితే చూడొచ్చు. అప్పుడు ఆ సినిమా లేదా టీవీ షో మ‌నకు అవ‌స‌ర‌మో లేదో తెలుసుకుని కొనుక్కోవ‌చ్చు. కానీ వీడియోగేమ్స్ కొనేట‌ప్పుడు ఇలాంటివేమీ ఉండ‌వు. మ‌రి వీడియోగేమ్ కొనాలంటే ఎలా అనుకుంటున్నారా అయితే ఈ గైడ్ చ‌ద‌వండి.

1. ఆ గేమ్ గురించి తెలుసుకోండి
వీడియోగేమ్స్ అమ్మే  షాప్‌కి వెళ్ల‌గానే అక్క‌డ రంగు రంగుల గ్రాఫిక్ క‌వ‌ర్స్‌తో క‌నిపించే వీడియో గేమ్స్ క‌వ‌ర్స్ చూడ‌గానే టెంప్ట‌యిపోతాం. వెంట‌నే కొనేయాల‌న్నంత  ఆవేశం వ‌చ్చేస్తుంది. ఇది క‌రెక్ట్ కాదు. అస‌లు ఆ గేమ్ గురించి మీకు ఏం తెలుస‌ని  కొనాల‌నుకుంటున్నారో ఓసారి ఆలోచించండి. వీలైతే దాని గురించి తెలుసుకున్నాకే కొనండి.  ఎక్కువ వీడియోగేమ్స్ సీక్వెల్స్‌గా వ‌స్తుంటాయి. అంటే  ఒక గేమ్ హిట్ అవ‌గానే దాని త‌ర్వాత పార్ట్ రిలీజ్ చేస్తుంటారు. ఇలాంటి వాటిలో అంత‌కుముందు వ‌చ్చినవి క‌నుక మీరు ఆడి ఉంటే అవి బాగుంటే త‌ర్వాత‌ది కూడా కొనుక్కోవ‌చ్చు.  వీడియోగేమ్ గురించి ఎక్కువ మంది పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నా అది కొన‌ద‌గ్గ‌దే. ఆన్‌లైన్‌లో రివ్యూలు చ‌దివినా దాని గురించి చాలా అవ‌గాహ‌న వ‌స్తుంది. యూట్యూబ్‌లాంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో లెట్స్ ప్లే ఆఫ్ దిస్ గేమ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దీనిలో ఆ గేమ్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు అన్నీ చెప్పే వీడియోలుంటాయి.అవి  చూడొచ్చు.  మా వీడియో గేమ్ కేక అని యాడ్స్ ఇస్తున్నారంటే దాని జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే మంచి ప్రొడ‌క్ట్‌కు అంత ప్ర‌చారం అవ‌స‌రం లేదు క‌దా..

2.  గేమ్ రేటింగ్ 
వివిధ దేశాల్లో వీడియోగేమ్స్ వ‌య‌సును బ‌ట్టి విక్ర‌యిస్తారు. అంటే అందులో ఉండే కంటెంట్‌లో వేరియేష‌న్ ఉంటుంది. ఈ కంటెంట్‌ను, గేమ్‌ను చెక్ చేయ‌డానికి రేటింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి.  యూఎస్‌లో ESRB అనే బోర్డు ఉంటుంది. అక్క‌డ వీడియో గేమ్స్ బాక్స్ మీద ESRB రేటింగ్ ఉంటుంది.  దాని ద‌గ్గ‌ర T ​​లేదా M రేటింగ్ ఉంటుంది. T రేటెడ్ బాక్స్‌లో ఉండే వీడియో గేమ్స్‌ను 13 ఏళ్ల‌లోపు పిల్ల‌లు కూడా కొనుక్కోవ‌చ్చు. అదే Mఅయితే 19 సంవ‌త్స‌రాల వ‌య‌సు దాటిన‌వాళ్ల‌కు మాత్ర‌మే అమ్ముతారు. దీనిలో సెక్సువ‌ల్‌, క్రైమ్ కంటెంట్ ఉండే అవ‌కాశం ఉంటుంది.

3. ఆన్‌లైన్‌లో కొనాలంటే రివ్యూలు చూడండి
మీరు గేమ్స్‌ను ఆన్‌లైన్‌లో (అమెజాన్ లేదా స్టీమ్ వంటివాటిలో) కొనాలంటే ఆ ప్రొడ‌క్ట్ పేజీ కింద దాని డిటెయిల్స్‌, రివ్యూలు ఉంటాయి. అవి చ‌దవండి. 10 రివ్యూల్లో 8 నెగిటివ్ కామెంట్స్ గ‌నుక ఉంటే ఆట‌లో ఏదో తేడా ఉంద‌ని అర్ధం. అలా కాకుండా పాజిటివ్ రివ్యూస్ ఎక్కువ ఉంటే ఆ గేమ్‌ను కొనుక్కోవ‌చ్చు. 

4. భారీ డిస్కౌంట్ ఇస్తున్నారా?
క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ సేల్ అని డిస్కౌంట్ల‌లో అమ్ముతుంటారు. అంటే కొత్త సీజ‌న్‌లో కొత్త ప్రొడ‌క్ట్ వ‌స్తుంది కాబ‌ట్టి పాత‌దాన్ని త‌క్కువ రేటుకు అయినా అమ్మేయాల‌న్న‌ది కంపెనీల వ్యూహం. అంత‌వ‌ర‌కూ ఓకే. కానీ వీడియోగేమ్ స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా భారీ డిస్కౌంట్ అంటే 60, 70% ఇస్తుంటే మాత్రం ఆ గేమ్ ఫ్లాప్ అయింద‌ని, దాన్ని ఎవ‌రూ కొన‌డం లేద‌ని అర్థం.  అంటే డిస్కౌంట్ పెరిగే కొద్దీ గేమ్ క్వాలిటీ మీద మ‌నం డౌట్‌ప‌డాల‌న్న‌మాట‌.
 

5. స్క్రీన్ షాట్స్ చూశారా?
మీరు ఆన్‌లైన్‌లో వీడియోగేమ్  కొనుగోలు చేస్తే, ఆ గేమ్ స్క్రీన్ షాట్లు కూడా చూడొచ్చు. అంటే గేమ్ కొన‌క‌ముందే దాని ఇంట‌ర్‌ఫేస్‌, లుక్ బాగుందా? మ‌న కంటికి సౌక‌ర్యంగా క‌నిపిస్తుందా లేదో తెలుసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు