టెలికాంలో పోటీ ఎక్కువ అయిపోవడంతో అన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఎయిర్‌టెల్ ఒక ఆఫర్‌ను ప్రకటించింది. అదే మొబైల్ సెక్యూర్ డ్యామేజ్ ఆఫర్. ఎయిర్ టెల్ మొబైల్ సెక్యూర్ డ్యామేజ్ క్లయిమ్ పేరుతో వచ్చిన ఈ ఆఫర్‌ను ఉపయోగించుకునేది ఎలా? అసలు ఈ ఆఫర్‌లో నిజం ఎంత? మనకు నిజంగా ఉపయోగపడుతుందా!
ఆఫర్ ఏమిటి?
ఎయిర్‌టెల్ లాంఛ్ చేసిన ఈ ఆఫర్‌లో అన్ని బ్రాండ్స్ కవర్ అవుతున్నాయి. నెలకు రూ.49 పెట్టి సబ్‌స్కైబ్ చేసుకుంటే చాలు మన ఫోన్‌కు ఏమైనా డ్యామేజ్ జరిగితే చాలు ఎయిర్‌టెల్ ఆ నష్టాన్ని భరిస్తుంది. మీ హ్యాండ్‌సెట్ టైప్‌ను బట్టి సబ్‌స్క్రిప్షన్ అమౌంట్ ఆధారపడి ఉంటుంది. కొన్ని మొబైల్స్‌కు నెలకు రూ.79 ఉంటుంది. వన్‌ప్లస్ లాంటి ఫోన్లకు రూ.25 వేల వరకు కవరేజ్ అందిస్తోంది ఎయిర్‌టెల్. మీరు కట్టే సబ్‌స్క్రిప్షన్, మీ ఫోన్ మోడల్‌ను బట్టి ఎయిర్‌టెల్ యాప్ మీకు ఎంత అమౌంట్ కవర్ అవుతుందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
ఏ బ్రాండ్‌లకు వర్తిస్తుందంటే..
ఏసర్, యాపిల్, ఏసెస్, బ్లాక్‌బెరీ, సెల్‌కాన్, కూల్‌పాడ్, డెల్, జియోని, హానర్, ఐబాల్, ఇన్‌ఫోకస్, ఇన్‌టెక్స్, కార్బన్, లావా, లెనొవొ, లెట్‌వి, ఎల్‌జీ, మీజు, మైక్రోమాక్స్, మైక్రోసాఫ్ట్, నోకియా, వొనియా, వొప్పొ, పానసోనిక్, రిలయన్స్, శాంసంగ్, శాన్‌సుయ్, స్పైస్, స్పైప్, వీడియోకాన్, వివో, జియోమి, యు, జెన్, జీటీఈ లాంటి బ్రాండ్‌లకు ఈ ఎయిర్‌టెల్ ఆఫర్ వర్తిస్తుంది.
ఎలా వర్తిస్తుంది?
ఎయిర్ టెల్ సెక్యూర్ ప్లాన్ ద్వారా ఉపయోగం ఏమిటంటే యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్‌లకు సెక్యూరిటీ ఇస్తుంది. యాంటీ వైరస్, క్లౌడ్ బ్యాక్ అప్ కల్పిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్ పొరపాటున డ్యామేజ్ అయితే సర్వీసు సెంటర్‌కు వెళ్లి రిపేర్లకు భారీగా డబ్బులు వెచ్చించక్కర్లేదు. ఈ ఆఫర్ ఉంటే చాలు ఎయిర్‌టెల్ మీకు ఫ్రీ పిక్ అప్‌ను అరేంజ్ చేస్తుంది. ఆథరైజ్డ్ సర్వీసు సెంటర్‌లో రిపేర్ చేయించి మీ ఇంటికే తిరిగి డెలవరీ చేస్తుంది. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌ను ఈ డివైజ్‌లో యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా మై ఎయిర్‌టెల్ యాప్‌ను ఓపెన్ చేసి ఎయిర్‌టెల్ సెక్యూర్ బ్యానర్ మీద క్లిక్ చేసి నిబంధనలను ఫాలో కావాలి. ఆ తర్వాత యాక్టివేట్ మీద క్లిక్ చేస్తే చాలు. ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులైన అందరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.