విమాన ప్రయాణం ఇప్పుడు బాగా చవకైపోయింది. కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే ట్రైన్‌లో త్రీ టైర్ ఏసీ టికెట్ ధరకు, ఒక్కోసారి అంతకంటే తక్కువ ధరకు కూడా విమాన ప్రయాణం చేసేయొచ్చు. దీంతో మీకు బోల్డంత టైమ్ ఆదా. విమాన ప్రయాణం చేశామన్న ఫీల్ ఉంటుంది. ట్రైన్, బస్ జర్నీల మాదిరిగా గంటలు, రోజుల తరబడి ప్రయాణం ఉండదు కాబట్టి అలిసిపోరు. వెళ్లినచోట హ్యాపీగా స్పెండ్ చేసి రావచ్చు. ఇలా చౌకలో విమాన ప్రయాణం చేయాలంటే మీరేం చేయాలో చెప్పే ఏ టూ జెడ్ గైడ్ మీకోసం..
తక్కువ ధరకు టికెట్లిచ్చే విమానాల గురించి సెర్చ్ చేయండి
ఫ్లైట్ టికెట్ ఫేర్‌ను కంపేర్ చేస్తే తక్కువ ధరకు టికెట్స్ పెట్టే విమానయాన సంస్థలేవో మీకు అర్ధమవుతుంది. మీరు నేరుగా జెట్ ఎయిర్‌వేస్ లేదా ఇండియన్ ఎయిర్‌లైన్స్ లేదా ఇంకేదైనా కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే కేవలం ఆ ఎయిర్‌లైన్స్ వాళ్ల ఫ్లైట్ టికెట్ ధరలే కనిపిస్తాయి. అదే ఫేర్ కంపేర్ సైట్లలోకి వెళితే మీకు తక్కువ ధరకు ఏ ఎయిర్‌లైన్స్‌లో టికెట్ దొరుకుతుందో తెలుస్తుంది.
స్కైస్కానర్
ఇదొక ఫేర్ కంపేర్ వెబ్‌సైట్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళతారు? ఏ డేట్‌న వెళతారు స్పెసిఫై చేసి సెర్చ్ కొడితే చాలు. బెస్ట్ ఫేర్ ఏమిటి? అత్యంత తక్కువ ధరకు వచ్చే చీఫ్ ఫేర్ ఏమిటి? అత్యంత వేగంగా తీసుకెళ్లే ఎయిర్‌లైన్స్‌లో తక్కువ ధరకు వచ్చే విమాన సర్వీస్ ఏమిటి? మీకు చూపిస్తుంది. కావాల్సింది బుక్ చేసుకోవచ్చు.
అలాగే గూగుల్ ఫ్లైట్స్ (Google FLights), మొమోండో (Momondo), ఫేర్ కంపేర్ (farecompare), చీప్ ఓ ఎయిర్ (CheapOair) వెబ్‌సైట్లను కూడా చూస్తే ఏ ఎయిర్‌లైన్స్‌లో తక్కువ ధరకు టికెట్ దొరుకుతుందో తెలుస్తుంది.
వీలైనంత ముందే బుక్ చేసుకోండి
మీ ప్రయాణ తేదీ మరీ దగ్గరైన కొద్దీ మీ ఫ్లైట్ టికెట్ ధర ఆకాశన్నంటుతుంది. అదే కాస్త ఎక్కువ రోజులు ముందు బుక్ చేసుకుంటే ధర తగ్గుతుంది. కనీసం 47 రోజుల ముందు బుక్ చేసుకుంటే సరసమైన ధరకు ఫ్లైట్ టికెట్ దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడి నుంచి 117 రోజుల వరకు ఎంత ముందు బుక్ చేసుకుంటే అంత తక్కువ ధరకు టికెట్ దొరుకుతుంది.
తరచూ ప్రయాణిస్తుంటే ఒకే ఎయిర్‌లైన్స్‌లో వెళ్లండి
మీరు తరచుగా విమాన ప్రయాణాలు చేసేవారైతే ఒకే ఎయిర్‌లైన్స్‌కి స్టిక్ ఆన్ అవండి. మీరు లాయల్ కస్టమర్ కాబట్టి ఎయిర్‌లైన్స్ కంపెనీలు మీకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి.
పార్టనర్ షిప్ క్రెడిట్ కార్డ్‌లతోనూ ఆదా
ఎయిర్‌లైన్స్‌తో పార్టనర్‌షిప్‌లో కొన్ని బ్యాంక్‌లు క్రెడిట్ కార్డ్‌లు ఆఫర్ చేస్తుంటాయి. ఆ కార్డ్‌తో మనం విమానం టికెట్ బుక్ చేస్తే ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఇస్తాయి. లేదంటే లాయల్టీ, పాయింట్ల రూపంలో కూడా పొదుపు చేసుకోవచ్చు. వీటిని తర్వాత సారి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి వాడుకోవచ్చు.
బుక్ చేసేటప్పుడు జాగ్రత్త పడితే సొమ్ము ఆదా
టికెట్ బుక్ చేసేటప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు రకరకాల ఆఫర్లు పెడుతుంటాయి. ఉదాహరణకు మీకు 20 కేజీల లగేజ్ తీసుకెళ్లడానికి 15 డాలర్లు కడితే చాలని ఓ ఆఫర్ కనిపిస్తుంది. వెంటనే ఎట్రాక్ట్ అయిపోయి దాన్ని బుక్ చేయకుండా సావధానంగా ఆలోచించడి. వీలైతే తర్వాత పేజీలోకి వెళ్లి చూడండి. అక్కడ ఏ 9,10 డాలర్లకో వాటిని తీసుకెళ్లే ఆప్షన్ ఉండొచ్చు.
అలాగే ఒకటి, రెండు గంటల ప్రయాణానికి ఫ్లైట్‌లో ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఉండే డబ్బు ఆదా అవుతుంది. కాంప్లిమెంటరీ ఉంటే ఓకే. మనం పే చేయాల్సిందైతే చిన్న చిన్న ప్రయాణాల్లో అయితే ఫ్లైట్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొద్దు. ఎందుకంటే ఎయిర్‌లైన్స్ కంపెనీలు టికెట్‌లో తగ్గించిన అమౌంట్‌ను ఇక్కడ లాగేయడానికి ప్రయత్నిస్తాయి.