ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి అందరికి తెలుసు. పదేళ్ల నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను విజయవంతంగా నడుపుతోంది. ఈ ఆండ్రాయిడ్ ప్రస్తుతం ప్రతి మొబైల్ ఫోన్‌నూ నడిపిస్తోంది. గూగుల్‌కి ఆండ్రాయిడ్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. ఒక్క చైనాను మినహాయించి దాదాపు ప్రతి దేశంలో వాడే స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడే కీలకపాత్ర పోషిస్తోంది. దీనిలో ఉండే గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, గూగుల్ ప్లే స్టోర్ ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే మన ఫోన్లో చాలా యాప్‌లు రన్ అవుతూ ఉంటాయి. కానీ ఒక దశకు చేరిన తర్వాత ఈ యాప్‌లు ఫోన్‌కు భారంగా మారి ఫోన్ ఈజ్ రన్నింగ్ ఆన్ లో స్టోరేజ్ అనే ఆప్షన్ వస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనకు అవసరమైన యాప్‌లను మాత్రమే ఉంచి మిగిలిన యాప్‌ను పని చేయకుండా చేసే ఒక వ్యవస్థ ఉంది దాని పేరు ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ.
ఎలా పని చేస్తుంది?
ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ పేరే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఇది పని చేస్తుంది మీకు అవసమైన యాప్‌లను బ్రౌజర్ ఓపెన్ చేయకుండానే పని చేసేలా చేయడం లేదా ఆ ఆప్లికేషన్‌ను క్లోజ్ చేయడం ఈ వెబ్ వ్యూ ప్రత్యేకత. సాధారణంగా మనం ఏదైనా సైట్ ఓపెన్ చేయాలంటే బ్రౌజర్‌లో ఆ లింక్‌ను పేస్ట్ చేసి ఓపెన్ చేస్తాం. కానీ వెబ్ వ్యూలో ఈ ఇబ్బంది ఉండదు. మనకు కావాల్సిన యాప్‌లను లింక్ కాపీ చేయకుండానే ఓపెన్ చేయచ్చు. దీని వల్ల మీకు సమయం కలిసొస్తుంది. టైమ్, ఎనర్జీ సేవ్ అవుతుంది. అంటే మీరు రోజూ ఫేస్‌బుక్ వాడుతుంటే మీరు రీసెంట్‌గా యూజ్ చేసిన యాప్స్ అన్నిటిని ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ మనకు క్రోమ్‌లో కనిపించేలా చేస్తుంది. మనం టైప్ చేయకుండానే నేరుగా ఫేస్‌బుక్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది.
ఎలా ఉపయోగించాలి?
గూగుల్ డెవలప్ చేసిన ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూను ఉపయోగించడం చాలా సులభం. ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూను ఆండ్రాయిడ్ 4.3 వెర్షన్ ద్వారా పొందొచ్చు. ఒక వేళ మీ ఆండ్రాయిడ్‌లో లేకపోతే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇదే ప్యాకేజ్ మాదిరిగా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న చాలా స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తుంది. గూగుల్ ప్యాకేజ్‌లు జీయాప్స్ ప్యాకేజ్ పేరుతో మనకు లభ్యమవుతాయి. వీటిని ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు మనకు సంబంధించిన అన్ని రకాల పనులను అవే చూసుకుంటాయి.