యూఎస్ వెళ్లాలి.. అక్కడ జాబ్ చేయాలని చాలామందికి కల.. కానీ ఈ కలను కొంతమందే నెరవేర్చుకోగలుగుతారు. స్కిల్ ఉన్నా కూడా కొన్ని సాంకేతిక సమస్యలతో ఇక్కడే ఉండిపోతారు. ఇప్పుడు యూఎస్ వీసా కావాలంటే నిబంధనలు మరింత కఠినతరం అయిన నేపథ్యంలో ప్రత్యేకత ఉంటే మాత్రమే వీసా లభిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మన పాత్ర ఏమిటో తెలిస్తే కానీ ఈ వీసా సులభంగా లభించే అవకాశాలున్నాయి.
అనుభవం కావాలి
మనం వీసా అప్లికేషన్‌ను ఒకసారి చూస్తే కాంటాక్ట్ సెక్షన్‌లో అప్లికేంట్స్ తమ సోషల్ మీడియా సమాచారాన్ని షేర్ చేయాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా మీరు ఏదో ఒకటి ఎంచుకున్న తర్వాత ఆ యూజర్ నేమ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది . ఒక అకౌంట్‌ను ఒకరికి మించి వాడుతుంటే మాత్రం అలాంటి అకౌంట్లను పరిగణనలోకి తీసుకోరు. ఒకవేళ సోషల్ మీడియా సెక్షన్‌లో మీరు ఫిల్ చేయకపోయినా లేకపోతే నన్ అనే ఆప్షన్ యూజ్ చేయకపోయినా మీ అప్లికేషన్ ప్రొసీడ్ కాదు. సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్‌తో పాటు ఐదేళ్లుగా మనం వాడుతున్న ఈమెయిల్ అడ్రెస్‌లు, ఫోన్ నంబర్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ డేటా ఎందుకు?
మనం వీసా కోరుతున్నాం అంటే వేరే దేశంలోకి ఎంటర్ అవుతున్నాం అని అర్ధం. అది చదువు కోసమా.. లేదా బిజినెస్ కోసమో. ఉద్యోగం కోసమో ఏదైనా కావొచ్చు. కానీ ఆ దేశం విదేశాల నుంచి వచ్చే వాళ్లను క్షణ్ణంగా పరిశీలిస్తుంది. ఉగ్రవాద దాడులు ఎక్కువైన నేపథ్యంలో సోషల్ మీడియా, ఫోన్ నంబర్లు, అడ్రెస్‌లను కూడా మాండెటరీ చేసింది యూఎస్ ప్రభుత్వం. ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే విదేశీయులను తమ దేశంలోకి రాకముందే అడ్డుకోవాలన్నదే యూఎస్ భావిస్తోంది. మన డేటాకు పూర్తి సెక్యూరిటీ కల్పిస్తామని కూడా చెబుతోంది.