ఒక్కోసారి కారణం లేకుండానే దిగులుగా అనిపిస్తుంది. ఏం చేయాలో అస్సలు తోచదు. మీ మనసు అలా మూడీగా ఉన్నట్లయితే...జస్ట్ ఈ వెబ్ సైట్లను ఓ సారి చెక్ చేయండి.
Emergency Compliment...
ఎమర్జెన్సీ కాంప్లీమెంట్....ఇది అందరికీ ఉపయోగపడే వెబ్ సైట్. ఏదైనా ఆలోచనతో బాధపడుతన్నట్లయితే..ఈ వెబ్ సైట్ ద్వారా ప్రశాంతత పొందవచ్చు. ఈ వెబ్ సైట్లో చాలా ఇంటర్ స్పేస్ ఉంటుంది. వెబ్ సైట్ ను ఓపెన్ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. పైన ఉన్న స్క్రీన్ షాట్లో థ్యాంక్స్, మెహ్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు మెహ్ బటన్ను నొక్కినట్లయితే..వెబ్ సైట్ మీకోసం మరోక కంప్లిమెంట్ ను చూపిస్తుంది. మీరు థ్యాంక్స్ బటన్ను నొక్కినట్లయితే మీరు వేరొక వెబ్ సైట్ కు వెళ్తారు.
Looking at Something ...
మీ మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడ...ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసినట్లయితే...మీరు ఇతర సమస్యల నుంచి బయటపడతారు. మీ జీవితం మీ నియంత్రణలో లేనట్లయితే...ఇంటర్నెట్ కి కొద్దిగా సమయాన్ని కేటాయించండి. ఈ మానసిక స్థితిని మార్చడానికి ఈ వెబ్ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వెబ్ సైట్ ఓపెన్ చేశాక...పేజీ పైన మౌస్ తో స్క్రోలింగ్ చేయండి. ఇలా చేస్తే సన్ షైన్ తోపాటు కాంతి ప్రతిభింబిస్తుంది. వాటిని చూస్తుంటే మనస్సు ఎంతో ఆనందంగా ఉంటుంది. పేజీ కిందకు మౌస్ కర్సర్ ద్వారా డౌన్ చేసినట్లయితే వర్షాలు, ఉరుములు కనిపిస్తాయి.
Weave Silk...
వీవ్ సిల్క్ అంటే భావోద్వేగాలు అని అర్థం. ఈ వెబ్ సైట్ ను నీన్ రంగులతో డిజైన్ చేశారు. వెబ్ సైట్లో ర్యాండమ్ డిజైన్లు తయారు చేయడానికి మీరు మౌస్ ను ఉపయోగించాల్సి ఉంటుది. ఒక కళాత్మక డిజైన్ను రూపొందించవచ్చు. మీ మానసిక స్థితిని బట్టి కూడా కొన్ని పంక్తులను కూడా రెడీ చేయవచ్చు. ఫేస్ బుక్, ట్విట్టర్ లేదా ఇతర సామాజిక మాధ్యమాలలో మీరు క్రియేట్ చేసిన వాటిని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. కీబోర్డులోని స్పేస్ బటన్ను నొక్కినట్లయితే..ఒక కొత్త ఆర్ట్ వర్క్ ను ప్రారంభించవచ్చు.
Castles ...
ఈ వెబ్ సైట్ చాలా సరదాగా ఉంటుంది. ఈ వెబ్ సైట్లో కోటలు, మల్టిపుల్ లేయర్ టవర్లు లేదా బిల్డింగులను క్రియేట్ చేయవచ్చు. బ్లాక్ రంగును మార్చడానికి మీకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి. పేజీలోని కుడి భాగంలో ప్రీవియస్ కలర్, నెక్ట్స్ కలర్ అనే ఆప్షన్లు కూడా ఉన్నాయి. చిన్నా లేదా పెద్ద బిల్డింగ్ ను క్రియేట్ చేయవచ్చు. ఈ గేమ్ లో ఒక గోపురంను క్రియేట్ చేస్తే....మీరు మానసికంగా చాలా ఉత్సాహం అవుతారు.
ISO Blocks game ...
ఐఎస్ఓ బ్లాక్స్ గేమ్...ఇది ఒక సరదాగా యాక్టివిటీ. ఇందులో జిగ్గింగ్ బాక్స్ ఎంతో సరదాగా కనిపిస్తాయి. పైన స్క్రీన్ షాట్లో మీరు చూసే పేజీ ఉంటుంది. మిగతా పరిసరాలన్నీ కూడా బ్లాక్ కలర్ లో ఉంటాయి. వాటి చుట్టూ తరంగాలు చూడటానికి చాలా సరదాగా ఉంటుంది. జంప్ మరియు డౌన్ బ్లాక్స్ మీ ముఖాన్ని సంతోషంగా ఉంచేలా చేస్తుంది.
This is sand ...
ఈ వెబ్ సైట్ చాలా సరదాగా ఉంటుంది. వెబ్ సైట్ ఓపెన్ చేసి ఎలా ఉపయోగించాలో వివరించడానికి ఒక చిన్న పాప్ అప్ స్క్రీన్ ను పొందుతారు. ఇసుకను నింపడానికి ఒక ఖాళీ కాన్వాస్ ఉంటుంది. కేవలం ఇసుక ...రంగురంగుల్లో ఉంటుంది. ఇసుక రంగును మార్చడానికి కుడి సైడ్ కార్నర్ కు వెళ్లాలి. కలర్స్ పై క్లిక్ చేసి...మరిన్ని కలర్స్ ను పొందే ఆప్షన్ను చూస్తారు.
100,000 Stars...
ఇదొక ఆత్మవిశ్వాసాన్నిపెంచే వెబ్ సైట్. అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది. వెబ్ సైట్లో గెలాక్సీ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. సూర్యుడు, దాని చుట్టూ ఉన్న గ్రహాలు, వేలాది నక్షత్రాలతో గెలాక్సీ ఏర్పాటు అవుతుంది. వీటన్నింటిని చూస్తుంటే...ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇట్టే మర్చిపోతాము.
Automatic Flatterer...
ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసినప్పుడు మీరు పేరును ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు పేరును ఎంటర్ చేయగానే...పాప్ అప్ విండోల మీకో కాంప్లిమెంట్ వస్తుంది. మీరు పై చూపిన స్క్రీన్షాట్లో చూడవచ్చు. ఓకే బటన్ను క్లిక్ చేసినప్పుడు...మరొక కాంప్లిమెట్ పేరుతో మళ్లీ జనరేట్ అవుతుంది. ఈ వెబ్ సైట్ ఖచ్చితంగా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
Who is the cutest...
ఈ వెబ్ సైట్ ఒక ప్రశ్న అడుగుతూ...సమాధానం చెప్పుతుంది. ప్రశ్నకు సమాధాన్ని పై స్క్రీన్లో చూడవచ్చు. మీరు ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన ప్రతిసారీ ఎవరు అందమైనవారు అనే ప్రశ్న అడుగుతుంది. మీరే అన్నట్లు సమాధానం కూడా ఇస్తుంది. మీ ముఖంలో ఆనందాన్ని తెచ్చేందుకు ఈ వెబ్ సైట్ ప్రయత్నిస్తుంది.