క్రెడిట్ కార్డ్ గురించి తెలియనివారు, ఉద్యోగుల్లో వాటిని వాడనివాళ్లు ఇప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు. చేతిలో డబ్బులేకపోయినా అవసరమైన వస్తువులు కొని, లేకపోతే సర్వీస్ చేయించుకుని 40, 50 రోజుల వ్యవధిలోతీర్చేసే వెసులుబాటు క్రెడిట్ కార్డ్‌లో ఉంది. దీనికి వడ్డీ లేకపోవడం ఎక్కువమందిని ఆకర్షించే అంశం. అంటే గతంలో మన ఊళ్లలో ఉండే చేబదులు లాంటిదన్నమాట. పెద్ద అమౌంట్ అయితే తక్కువ వడ్డీతో ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుని చెల్లించే వెసులుబాటు, ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్స్ వంటి ఆకర్షణలతో క్రెడిట్ కార్డ్‌లు జాబ్ హోల్డర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇండియాలో ప్రస్తుతం వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న క్రెడిట్ కార్డ్‌ల్లో బెస్ట్ ఏవి? వాటి ప్రత్యేకతలేమిటో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి
1. స్టాండర్డ్ ఛార్టర్డ్ మన్‌హట్టన్ క్రెడిట్ కార్డ్ (Standard Chartered Manhattan Credit Card)
స్టాండర్డ్ ఛార్టర్డ్ మన్‌హట్టన్ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజు 499 రూపాయలు. తొలి ఏడాది 30వేలు కార్డ్ మీద ఖర్చు పెడితే మీకు ఆ 499 రూపాయలు కూడా వెనక్కి ఇచ్చేస్తారు. రెండో సంవత్సరం 999 రూపాయల వార్షిక రుసుము ఉంటుంది. 60వేల రూపాయల ట్రాన్సాక్షన్ చేస్తే ఆ 999 రూపాయలు కూడా రద్దు చేస్తారు.
* రిలయన్స్, మోర్, బిగ్‌బజార్, ఫుడ్‌బజార్ లాంటి సూపర్ మార్కెట్స్‌లో గ్రోసరీ (పప్పులు, ఉప్పులు)పై 5% క్యాష్ బ్యాక్ ఇస్తారు.
* హోటల్స్, పెట్రోల్, డీజిల్ కొనుగోలు, ఫ్లైట్ టికెట్స్‌మీద 5 రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
* ఉబెర్ రైడ్స్‌పై 20% క్యాష్‌బ్యాక్
అయితే ఒక ట్రాన్సాక్షన్ మీద క్యాష్‌బ్యాక్ 150 రూపాయలు మించి ఇవ్వరు. అలాగే ఒక నెలలో క్యాష్‌బ్యాక్‌కు కూడా కొంత లిమిట్ ఉంది.
2. స్టాండర్డ్ ఛార్టర్డ్ ప్లాటినం రివార్డ్స్ కార్డ్ (Standard Chartered Platinum Rewards Card)
ఎలాంటి వార్షిక రుసుము లేకుండా క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే స్టాండర్డ్ ఛార్టర్డ్ ప్లాటినం రివార్డ్స్ కార్డ్ మంచి ఆప్షన్. ఉద్యోగి నెలజీతం ఎంతన్న దాన్ని బట్టి కార్డ్ ఇస్తారు.
*కార్డ్ తీసుకున్న 60 రోజుల్లోగా ట్రాన్సాక్షన్ చేస్తే 1000 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. ఆన్‌లైన్ బ్యాకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే బోనస్‌గా మరో 500 పాయింట్లు వస్తాయి.
* హోటల్‌లో డైనింగ్ బిల్ 150 రూపాయలు చేస్తే 5 పాయింట్స్ ఇస్తారు.
* పెట్రోల్, డీజిల్ మీద కూడా 150 రూపాయలు కొంటే 5 పాయింట్స్ వస్తాయి.
* ఉబెర్ రైడ్స్‌పై 20% క్యాష్‌బ్యాక్
3. ఐసీఐసీఐ ఇన్‌స్టంట్ ప్లాటినం కార్డ్ (ICICI Instant Platinum Card)
ఐసీఐసీఐ ఇన్‌స్టంట్ ప్లాటినం కార్డ్ కూడా ఎలాంటి జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు లేని కార్డే. స్టూడెంట్స్, గృహిణులు, జీతంగా డబ్బులు సంపాదించలేని వ్యక్తులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ చూసి ఈ క్రెడిట్ కార్డ్ ఇస్తారు.
* ప్రతి 100 రూపాయల ఖర్చుకు 3 పే బ్యాక్ పాయింట్లు ఇస్తారు.
* నెలకు రెండుసార్లు సినిమా టికెట్ల మీద 100 రూపాయల చొప్పున డిస్కౌంట్ వస్తుంది.
* హెచ్‌పీసీఎల్ బంకుల్లో ఫ్యూయల్ తీసుకుంటే ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌లో 5% తగ్గిస్తారు.
4. ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ (SBI Simply Click Credit Card)
దేశంలో ఉన్న బెస్ట్ క్రెడిట్ కార్డ్‌ల్లో ఇది ఒకటి. వార్షిక రుసుము 499 రూపాయలు. తొలి ఏడాది లక్ష రూపాయలు కార్డ్‌తో ఖర్చు పెడితే మీకు ఆ 499 రూపాయలు కూడా వెనక్కి ఇచ్చేస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ సైట్స్‌లో ప్రొడక్ట్స్ కొనే ఉత్సాహం ఉన్నవారికి ఈ కార్డ్ మంచి ఆప్షన్.
* కార్డ్‌తోపాటు 500 రూపాయల విలువైన అమెజాన్ గిఫ్ట్ ఓచర్ ఇస్తారు.
* అమెజాన్, బుక్ మై షో, క్లియర్‌ట్రిప్, ఫుడ్‌పాండా, ఫ్యాబ్ ఫర్నిష్, లెన్స్‌కార్ట్, ఓలా, జూమ్ కార్‌ల్లో ఈ కార్డ్‌తో పే చేస్తే 10 రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మిగతా ఆన్‌లైన్ షాపింగ్స్‌లో 5 రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్లు ఇస్తారు.
* కనీసం 500 రూపాయల డీజిల్ / పెట్రోల్ కొంటే ఫ్యూయల్ సర్ ఛార్జ్‌లో 1% తగ్గిస్తారు.
* సంవత్సరంలో లక్ష రూపాయలు స్పెండ్ చేస్తే 2వేల రూపాయల క్లియర్ ట్రిప్ ఓచర్ ఇస్తారు.
5. స్టాండర్డ్ ఛార్టర్డ్ సూపర్ వాల్యూ టైటానియం క్రెడిట్ కార్డ్ (Standard Chartered Super Value Titanium Credit Card)
ట్రావెల్ లవర్స్‌కి బాగా ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ స్టాండర్డ్ ఛార్టర్డ్ సూపర్ వాల్యూ టైటానియం క్రెడిట్ కార్డ్. ఎందుకంటే ఈ కార్డ్‌తో ఫ్యూయల్ కొంటే 5% ఆదా అవుతుంది. ఇందులో 2.5% క్యాష్‌బ్యాక్ కాగా మరో 2.5% ఫ్యూయల్ సర్‌ఛార్జి రివర్సల్. ఇండియాలో ఏ బంకులో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజ్ 499 రూపాయలు. రెండో సంవత్సరం నుంచి 750రూపాయలు వార్షిక రుసుము.
* ఫోన్ బిల్స్‌మీద 5% క్యాష్‌బ్యాక్
* గ్యాస్, కరెంట్, వాటర్ బిల్ మీద కూడా 5% క్యాష్ బ్యాక్.
* ప్రతి 100 రూపాయలస్పెండింగ్ మీద 1 రివార్డ్ పాయింట్ వస్తుంది. దీని విలువ 30 పైసలు. అంటే 100 రూపాయల కొంటే 3 రూపాయల విలువైన పాయింట్స్ వస్తాయి.
6. సిటీ బ్యాంక్ క్యాష్ బ్యాక్ కార్డ్ (Citibank Cash back Card)
కేవలం క్యాష్‌బ్యాక్‌ల కోసమే క్రెడిట్ కార్డ్ వాడే బ్యాచ్‌కి సూటబుల్ కార్డ్ ఈ సిటీ బ్యాంక్ క్యాష్ బ్యాక్ కార్డ్. 500 రూపాయల జాయినింగ్ ఫీజు ఉంటుంది.
* మూవీ టికెట్స్‌పై 5% క్యాష్‌బ్యాక్
* టటోలిఫోన్ బిల్స్ మీద 5% క్యాష్‌బ్యాక్
* గ్యాస్, కరెంట్, వాటర్ బిల్స్ సిటీబ్యాంక్ ఆన్‌లైన్ బిల్ పే ద్వారా చెల్లిస్తే 5% క్యాష్‌బ్యాక్ |
* ఇతర ఏరకమైన స్పెండింగ్ మీద అయినా 5% క్యాష్‌బ్యాక్ వస్తుంది.
అయితే ఇందుకు కొన్ని పరిమితులున్నాయి.