• తాజా వార్తలు

ఇంధనంతో పాటు డబ్బును కూడా ఆదా చేసే క్రెడిట్ కార్డులపై సేవింగ్ గైడ్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బైక్ కాని కారు కాని తప్పక ఉంటుంది. వాహనాల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరగడం వల్ల ఇంధనాల వినియోగం అంతే స్థాయిలో పెరుగతూ వస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ధరల్లో ప్రతి రోజు కూడా మార్పు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధనం తలకు మించిన భారం అవుతోంది. క్రెడిట్ కార్డుల ద్వారా ఇంధనం లావాదేవీలు నడిపినా నెలఖారున బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని కార్డుల ద్వారా ఇంధనం కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినం క్రెడిట్ కార్డు 
 జూన్ 30 వరకు ఈ కార్డు తీసుకుంటే 30 రోజుల్లోపు చేసే మొదటి ఖర్చుపై 250 టర్బో పాయింట్లను ఆఫర్ చేస్తున్నారు. లావాదేవీ జరిపినప్పటి నుంచి 60 రోజుల్లో ఈ బౌన్స్ పాయింట్స్ కార్డు ఖాతాలో చేరిపోతాయి. ఇతర కొనుగోళ్ళ కోసంకూడా ఈ కార్డును వినియోగించుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్ లెట్లలో రూ. 150 విలువైన ఇంధనం కొనుగోలు చేస్తే 4 టర్బో పాయింట్లు లభిస్తాయి. - నిత్యావసర సరుకులు, షాపింగ్, డైనింగ్, ఇతర చెల్లింపులపైనా కూడా టర్బో పాయింట్లు లభిస్తాయి.  ఇంధన కొనుగోలుపై విధించే సర్ చార్జీకి మినహాయింపు ఉంటుంది. ఏడాదిలో రూ. 30,000 ఖర్చు చేస్తే వార్షిక ఫీజును ఎత్తివేస్తున్నారు.

ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్పీసిఎల్ కొరల్ క్రెడిట్ కార్డు 
 2.5 శాతం క్యాష్ బ్యాక్ , హెచ్ పీ సి ఎల్ పంపుల్లో ఇంధనం కొనుగోలు చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్చార్జీ ఎత్తివేత , రూ. 100 ఖర్చు చేస్తే 2 పే బ్యాక్ రివార్డ్ పాయింట్లు , బుక్ మై షో లో నెలలో 2 సినిమా టిక్కెట్లపై రూ. 100 డిస్కౌంట్ 

ఐ సి ఐ సి ఐ బ్యాంకు హెచ్ పీ సి ఎల్ కొరల్ అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డ్ 
2.5 శాతం క్యాష్ బ్యాక్ - హెచ్ పీ సి ఎల్ పంపుల్లో ఇంధనం కొనుగోలు చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్చార్జీ ఎత్తివేత - హెచ్ పీ సి ఎల్ పంపుల్లోరూ. 100 ఖర్చు చేస్తే 6 పే బ్యాక్ పాయింట్లు

బీపీసీఎల్ ఎస్ బీ ఐ కార్డు
జాయినింగ్ ఫీజు చెల్లింపు తర్వాత రూ. 500 విలువైన 2,000 అక్టీవేషన్ బోనస్ రివార్డ్ పాయింట్లు .వీటిని బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో ఇంధన కొనుగోళ్ల కోసం వినియోగించుకోవచ్చు. రూ . 4,000 వరకు చేసే ప్రతి లావాదేవిపై 3.25 +1 శాతం ఇంధన సెర్ ఛార్జ్ ఎత్తివేత. మరికొన్ని కంపెనీలు కూడా ఇంధన క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. కార్డులను తీసుకునే ముందు ఆయా కంపనీలు ఇస్తున్న ఆఫర్లను ఒకసారి తెలుసుకోవడం మంచిది.
 

జన రంజకమైన వార్తలు