• తాజా వార్తలు

మనందరం తెలుసుకోవాల్సిన ఆండ్రాయిడ్ హిడెన్ సీక్రెట్స్ కోడ్స్ కి కంప్లీట్ గైడ్

మీ ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టం లో మీరు మార్పులు చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? ఐఒఎస్ తో పోల్చి చూస్తే డివైస్ మరియు OS లోపల మార్పులు చేసే అవకాశం ఆండ్రాయిడ్ లో ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఆప్షన్ లన్నీ కేవలం సెట్టింగ్స్ మెనూ లో మాత్రమే ఉండవు.ఆండ్రాయిడ్ లో దాగిఉన్నఈ సెట్టింగ్స్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు కొన్ని కోడ్ ల గురించి తెలుసుకోవాలి.ఈ కోడ్ లు సింపుల్ గా ఉంటాయి కానీ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. వీటిని మీ డయలర్ లో టైపు చేసి కొద్ది క్షణాలు వేచి చూస్తే చాలు.

                   ఆండ్రాయిడ్ లో హిడెన్ కోడ్ లు వాటి వివరాలు

*#*#7780#*#*

ఈ సీక్రెట్ కోడ్ మీ డివైస్ ను ఎటువంటి హార్డ్ మెనూ లకు వెళ్ళకుండా ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన విష్యం ఏమిటంటే ఈ ప్రక్రియ లో అప్లికేషను లు మరియు వాటికీ సంబందించిన డేటా డిలీట్ అవుతుంది. మీ డివైస్ యొక్క ఫర్మ్ వేర్ లి ఎలాంటి మార్పులు జరుగవు.

*2767*3855#

మీ డివైస్ లో ఉన్న ప్రతీ చిన్న డేటా కూడా డిలీట్ అయ్యేలా చేస్తుంది. ఫ్యాక్టరీ స్టేట్ కు ఫోన్ రీ స్టోర్ చేయబడుతుంది. ఫర్మ్ వేర్ రీ ఇన్ స్టాల్ చేయబడుతుంది. అయితే మీ ఫైల్ లకు సరైన బ్యాక్ అప్ ఉన్నపుడు మాత్రమే ఈ ఆపరేషన్ చేయాలి.

*#*#34971539#*#*

మీ కెమెరా లోని టెక్నికల్ ఇష్యూ లు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది ఈ సీక్రెట్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కోడ్ మీ డివైస్ యొక్క కెమెరా మోడ్యూల్ కు సంబంధించి అన్ని వివరాలను అందిస్తుంది.

*#*#273283*255*663282*#*#*

మీ మీడియా ఫైల్ లు అన్నింటినీజాగ్రత్తగా ఉంచాలి అనుకుంటే ఈ కోడ్ ఉపయోగపడుతుంది. దీనిని పేస్టు చేయడం ద్వారా మీ మీడియా ఫైల్ లకు సంబందించిన పూర్తి బ్యాక్ అప్ ను సింపుల్ గా చేయవచ్చు. ఇది సెలక్షన్ ఆప్షన్ ను ఆఫర్ చేయదు.

*#*#197328640#*#*

డివైస్ లోని టెస్ట్ మోడ్ ను అన్ లాక్ చేయడానికి ఈ సీక్రెట్ కోడ్ ను ఉపయోగిస్తారు. అంటే డివైస్ లోని వివిధ రకాల మాడ్యూల్ లను దీనిద్వారా ఓపెన్ చేయవచ్చు. ఉదాహరణకు సౌండ్ మాడ్యూల్ లేదా సెల్యూలర్ మాడ్యూల్ సరిగా పనిచేస్తుందో లేదో ఈ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

*#*#232339#*#* or *#*#526#*#*

WLAN టెస్ట్ లు చేయడానికి వీటిలో ఏదైనా కోడ్ ను ఉపయోగించవచ్చు. మీ డివైస్ లోని వైఫై సెక్షన్ లో ఏవైనా లోపాలు ఉంటే దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ డివైస్ లోని వైఫై మాడ్యూల్ సరిగా పనిచేస్తుందా లేదా కూడా దీనిద్వారా తెలుసుకోవచ్చు.

*#*#232338#*#*

మీ డివైస్ యొక్క వై ఫై MAC అడ్రస్ ను కనుగొనడానికి ఈ కోడ్ ను ఉపయోగించవచ్చు. మామూలుగా అయితే సెట్టింగ్స్ లోనికి వెళ్లి అక్కడ సబ్ కేటగరీ లను ఎంచుకుని తద్వారా చూడవలసి ఉంటుంది. అయితే ఏ కోడ్ ద్వారా డైరెక్ట్ గా దీని గురించి తెలుసుకోవచ్చు.

*#*#232338#*#*

మీ డివైస్ యొక్క LCD డిస్ప్లే సరిగ్గా పనిచేస్తుందో లేదో ఈ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కోడ్ మిగతా రకాల డిస్ప్లే లకు కూడా ఉపయోగపడుతుంది.

*#*#1472365#*#*

మీ gps మాడ్యూల్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఈ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

*#*#0*#*#*

ఈ కోడ్ కూడా మీ డివైస్ యొక్క డిస్ప్లే సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

*#*#0673#*#* or *#*#0289#*#*

మీ డివైస్ యొక్క మైక్ లేదా స్పీకర్ సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ సీక్రెట్ కోడ్ లలో ఏదో ఒకదానిని ఉపయోగిస్తారు.

*#*#0842#*#*

మీ డివైస్ యొక్క వైబ్రేషన్ మాడ్యూల్ మారాయి బ్యాక్ లిట్ మాడ్యూల్ సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ కోడ్ ను ఉపయోగిస్తారు.

*#*#4986*2650468#*#*

మొట్టమొదటి కోడ్ ఫోన్ యొక్క బేసిక్ డీటెయిల్స్ గురించి తెలియజేస్తే ఇది మీ డివైస్ హార్డ్ వేర్ యొక్క వివరాలను మరింత లోతుగా తెలియజేస్తుంది.

*#06#

మీ ఫోన్ యొక్క IMEI నెంబర్ గురించి ఈ సీక్రెట్ కోడ్ తెలియజేస్తుంది.

*#*#232331#*#*

బ్లూటూత్ మాడ్యూల్ లో ఉన్న సమస్యల గురించీ మరియు వాటి పరిష్కారం గురించీ ఈ కోడ్ తెలియజేస్తుంది.

                                       మరిన్ని కోడ్ లు

*#*#0588#*#*                         ప్రాక్సిమిటీ సెన్సార్ వర్కింగ్

*#*#3264#*#*                         RAM వెర్షన్

*#*#7262626#*#*                     ఫీల్డ్ టెస్ట్

*#*#1111#*#*                           FTA సాఫ్ట్ వేర్ వెర్షన్

*#*#44336#*#*                        బిల్డ్ రిలేటెడ్ డీటెయిల్స్

 

 

జన రంజకమైన వార్తలు