పొద్దస్తమానం వాట్సప్ చాటింగ్‌తోనే గడుపుతుంటారు చాలా మంది. అన్ని వ్యవహారాలు వాట్సప్ ద్వారా పూర్తి చేసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే మీరు ఒక వ్యక్తి గురించో లేదా అతని బిహేవియర్ గురించి రీసెర్చ్ చేయడం కోసమో అతని చాటింగ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే? .. మామూలుగా అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరూ తమ చాటింగ్ వివరాలు చెప్పరు. చూపించరు.. దీన్ని మనం దొంగతనంగా చూడాల్సిందే. అయితే ఇలా దొంగతనంగా కాకుండా టెక్నాలజీ వాడి ఆ చాట్ వివరాలను తెలుసుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది కదా.. దీనికి ఒక టూల్ అందుబాటులో ఉంది. మరి ఆ టూల్ ఏంటో దాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దామా..
ఫ్రీ వాట్సప్ చాట్ ఎనలైజర్ టూల్ ఉసయోగించడం ద్వారా ఇలా ఇతరుల వాట్సప్ చాట్‌ను విశ్లేషించే అవకాశం ఉంది. అంతేకాదు ఒక నివేదికలా తయారు చేసుకుని దాన్ని మన పీసీలో సేవ్ చేసుకోవచ్చు కూడా. ఎవరు ఎక్కువ మెసేజ్‌లు పంపుతున్నారు.. ఎవరు ఎక్కువగా ఎమోజీలు యూజ్ చేస్తున్ నారు.. మెసేజ్ యాక్టివిటీ ఎలా ఉంది అనే విషయాలను ఈ టూల్స్ విశ్లేషించి మనకు ఒక రిపోర్టు అందిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని కీలక టూల్స్ ఏమిటో చూద్దాం..
వాట్సప్ చాట్ అనలైజర్
వాట్సప్ చాట్ హిస్టరీని ఎనలైజ్ చేయడానికి ఇది ఒక సింపుల్ ఓపెన్ సోర్స్ టూల్. మీ వాట్సప్ చాట్‌ను టెక్ట్ ఫైల్‌గా మార్చే ఈ టూల్ మీకు భిన్నమైన కోణాల్లో ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఎంతమంది ఈ చాట్‌లో పార్టిసిపేట్ చేశారు.. ఎంతమంది మెసేజ్‌లు చేశారు.. ఎన్ని వర్డ్స్ టైప్ చేశారు..రోజుకు ఎన్ని మెసేజ్‌లు చేశారు అనే చిన్న పాటి వివరాలు కూడా టూల్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని క్రోమ్‌లో ఓపెన్ చేసుకోవడం ద్వారా ఈ వివరాలు మనం తెలుసుకోవచ్చు.
చాట్‌లైజర్
వాట్సప్ కన్వర్షేన్లను విశ్లేషించానికి వాడే మరో టూల్ చాట్ లైజర్. దీనిలో టెక్ట్ ఫైల్ అప్‌లోడ్ చేస్తే చాలు మనకు అవసరమైన రిపోర్టును అన్ని వివరాలతో అందిస్తుంది. అప్‌లోడ్ చేశాక అన్ని మెసేజ్‌లు, టోటల్ నంబర్ ఆఫ్ మెసేజ్‌లు, యావరేజ్ ఆఫ్ మెసేజెస్, టోటల్ పార్టిసిపెంట్స్ లాంటి వివరాలన్ని మనం తెలుసుకోవచ్చు.
వాట్స్ ఎనలైజర్
వాట్సప్ చాట్‌ను విశ్లేషించడానికి మరో టూల్ వాట్స్ ఎనలైజర్. వాట్సప్ చాట్ హిస్టరీని మొత్తం మన కళ్ల ముందు ఉంచడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. ఈ టూల్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్‌ను మనం ఈమెయిల్‌కు కూడా పంపుకోవచ్చు. ఆ తర్వాత మీరు రిపోర్టు తెప్పించుకోవచ్చు. ఈ రిపోర్టును డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ గా కూడా దీన్ని మార్చుకునే అవకాశం ఉంది.