• తాజా వార్తలు

గూగుల్ మ్యాప్స్ లో మీకు కావాల్సిన ఏరియా లను డౌన్ లోడ్ చేసి పెట్టుకోవడానికి గైడ్

మనం ఏదైనా కొత్త ప్రదేశం లోనికి వెళ్ళినపుడు గానీ, ఏదైనా తెలియని ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకున్నపుడు గానీ గూగుల్ మ్యాప్స్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి.  అయితే అన్ని ప్రదేశాలలో నెట్ వర్క్ సరిగా ఉండకపోవచ్చు. తక్కువ కనెక్టివిటీ ఉండే ఏరియా లలో అలాగే అసలు నెట్ వర్క్ సరిగా లేని ఏరియా లలో ఈ గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించడం కొంచెం కష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాలలోనే గూగుల్ మ్యాప్స్ ఆఫ్ లైన్ లో కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇక పై ఇలాంటి ఇబ్బందులకు తావులేదు. గూగుల్ మ్యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో కూడా నావిగేషన్ చేసుకునే సదుపాయం వచ్చేసింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.

గూగుల్ మ్యాప్స్ ను మీ స్మార్ట్ ఫోన్ లో సేవ్ చేయడం ఎలా?

గూగుల్ మ్యాప్స్ ను PC లోకానీ ల్యాప్ ట్యాప్ లో కానీ డౌన్ లోడ్ చేసుకునే వీలులేదు. ఇది కేవలం ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ స్మార్ట్ ఫోన్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్ లు ఈ క్రింది విధంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయాలి. అంతకంటే ముందు మీరు మీ మొబైల్ లో మీయొక్క గూగుల్ ఎకౌంటు కు లాగ్ ఇన్ అయి ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ లాగ్ ఇన్ అవ్వకపోతే లాగ్ ఇన్ అవ్వాలి.

స్టెప్ 2 : మీరు ఏ ఏరియా ను డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఏరియా ను సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 3 : గూగుల్ మ్యాప్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియా ను చూపిస్తుంది. ఆ ఏరియా పేరుపై ట్యాప్ చేయండి.

స్టెప్ 4 : డౌన్ లోడ్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. అంతే మీకు కావాల్సిన ఏరియా యొక్క గూగుల్ మ్యాప్స్ మీ ఫోన్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లోనకి డిఫాల్ట్ గా సేవ్ అయిపోతుంది.

ఐ ఫోన్ లో ఎలా ?

స్టెప్ 1 : గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయండి

స్టెప్ 2:  కావలసిన ఏరియా ను సెలెక్ట్ చేసుకోండి.

స్టెప్ 3 : కుడి వైపు పైన ఉండే మోర్ ఆప్షన్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4 : డౌన్ లోడ్ ఆఫ్ లైన్ మ్యాప్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

గూగుల్ మ్యాప్స్ ను SD కార్డు లో డౌన్ లోడ్ చేయడం ఎలా ?

 సాధారణంగా ఈ గూగుల్ మ్యాప్స్ డౌన్ లోడ్ చేసినపుడు ఫోన్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లోనికి డిఫాల్ట్ గా సేవ్ అవుతాయి. ఒకవేళ మీ ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువగా ఉన్నట్లయితే ఒక చిన్న మార్పు ద్వారా గూగుల్ మ్యాప్స్ ను డైరెక్ట్ గా SD కార్డు లోనికి సేవ్ చేసుకోవచ్చు.

స్టెప్ 1 : ముందుగా మీ మెమరీ కార్డు స్మార్ట్ ఫోన్ లో సరిగ్గా ఉందొ లేదో చూసుకోవాలి. గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేసి మీ గూగుల్ ఎకౌంటు కు సైన్ ఇన్ అవ్వాలి.

స్టెప్ 2: ఎడమవైపు పై భాగం లో ఉండే ఐకాన్ పై క్లిక్ చేసి అక్కడుండే ఆఫ్ లైన్ మ్యాప్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 3 : కుడి వైపు పై భాగం లో ఉండే గేర్ ఐకాన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 4 : ఇక్కడమీకు కాన్ఫిగర్ కు సంబందించిన అనేక ఆప్షన్ లు కనిపిస్తాయి. వాటిలో స్టోరేజ్ ప్రిఫరెన్స్ ను సెలెక్ట్ చేసుకుని మీ డిఫాల్ట్ స్టోరేజ్ ను SD కార్డు కు మార్చుకోవడమే.

గమనిక: ఐ ఫోన్ లో SD కార్డు ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ గూగుల్ మ్యాప్స్ ను ఐ ఫోన్ లో ఇంటర్నల్ మెమరీ లోనే స్టోర్ చేసుకోవాలి.

జన రంజకమైన వార్తలు