• తాజా వార్తలు

బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందా? అయితే ఈ సేఫ్టీ గైడ్ మీకోసమే

మేం బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం...మీకు ఏటిఎం కార్డు వివరాలు చెప్పండి అంటూ వచ్చే ఫోన్లు మోసం అంటూ ఎంత అవగాన కల్పిస్తున్నా...రోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అకౌంట్లో నుంచి సొమ్మును పోగొట్టుకుంటున్నవారి జాబితా పెరిగిపోతూనే ఉంది. టెక్నాలజీ పరంగా ఎన్ని మార్పులు తీసుకొచ్చిన సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునే ఉన్నారు. అలాంటి మాయగాళ్ల గాలంలో చిక్కుకోండా ఉండేందుకు...కొత్త బ్యాంకింగ్ స్కాంను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. 

* మొదటగా బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది. మిమ్మల్ని నమ్మించడానికి బ్యాంకు ప్రతినిధిగా మాట్లాడుతాడు. 
*నిజంగా బ్యాంకు నుంచే కాల్ వచ్చిందని నమ్మించేందుకు పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలను చెబుతారు. 
*ల్యాండ్ లైన్ నుంచి కాల్ వస్తుంది
*మీ కా్డు బ్లాక్ అయ్యింది అని చెప్పి మిమ్మల్ని నమ్మించే బయపెట్టించే ప్రయత్నం చేస్తాడు. 
*అంతేకాదు రివార్డ్ పాయింట్లతో మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. 
*మీ ద్రుష్టిని మరల్చడానికి సైబర్ నేరగాళ్లు కొత్త చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను అప్ గ్రేడ్ చేయమని అడుగుతారు. 
*మిమ్మల్ని మాటల్లో పడేసేందుకు కస్టమర్ ఐడి లేదా డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను అడుగుతాడు. 
*అనంతరం బ్యాంకు అకౌంట్ వివరాలను అడిగే అవకాశం ఉంటుంది. 
* మీ ఫోన్ మీకు వచ్చిన OTPని అడిగేందుకు సర్వీసును వెరిఫై చేయాలని అడుగుతాడు. 
* మీ అకౌంట్ నుంచి డబ్బను బదిలీ చేయడానికి మీ ఆన్ లైన్ బ్యాంక్ అకౌంట్ ను హైజాక్ చేయడానికి ఇలా ప్రవర్తిస్తుంటారు. కానీ రిమోట్ అకౌంట్లకు డబ్బును బదిలీ చేయడం చాలా కష్టమని గుర్తుంచుకోండి. 
మీ వ్యక్తిగత వివరాలను ఏ బ్యాంకు కూడా అడగదు. ఎవరు ఫోన్ చేసినా...మీ బ్యాంక్ కు సంబంధించిన వివరాలను వెల్లడించవద్దు. మీకేమైనా సమస్యలున్నట్లయితే...సమీప బ్యాంకు శాఖకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకోండి. 

జన రంజకమైన వార్తలు